Breaking News

శ్రీ మహిషాసుర మర్దిని దుష్ట శక్తులపై విజయం సాధించిన దేవత

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సీతారాంపురం ఇజ్జాడ వారి వీధి నందు శుక్రవారం దసరా నవరాత్రులలో భాగంగా నేడు శ్రీ శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి పంచలోహ తురన ప్రభ మహోత్సవ కమిటీ వారు ఏర్పాటుచేసిన  “శ్రీ మహిషాసుర మర్దిని” గా దర్శనమిచ్చిన అమ్మవారిని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా సిద్దార్థ దర్శించుకుని ఆ అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపై సెంట్రల్ నియోకవర్గం పై ఉండాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం బొండా సిద్ధార్థ మాట్లాడుతూ:-ఈరోజు 9వ రోజు దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారి అలంకరణ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని…తొమ్మిదవ రోజు అమ్మవారి అవతారం ”శ్రీ మహిషాసుర మర్దిని దేవి శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్ధిని దేవి గా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని…మహిషాసురమర్దినిని సాధారణంగా భయంకరమైన రూపంలో చిత్రీకరిస్తారు. ఆమె ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో డమరుకం పట్టుకుని ఉంటారు,ఆమె వాహనం సింహం…ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కూటమి ప్రభుత్వం లో ప్రజలు అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని ఆరాధించడం జరిగినదని బొండా సిద్దార్థ తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *