రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) ఫీల్డ్ ఆఫీస్, కాకినాడ ఆధ్వర్యంలో రాష్ట్రీయ పోషణ్ మాహ్ సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించిన రెండ్రోజుల పోషకాహార ప్రదర్శన ముగింపు సభ నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, చిరుధాన్యాలను (మిల్లెట్స్) ఆహారంలో భాగం చేసుకోవాలని, సుపోషిత భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పోషకాహార స్టాళ్లను పరిశీలించి, ఐసీడీఎస్, అంగన్‌వాడీ సిబ్బంది సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వక్తృత్వం, వ్యాసరచన పోటీల విజేతలకు ఆయన బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన సోము వీర్రాజు ని సీబీసీ అధికారులు శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించారు.
Prajavartha Online Telugu News