Breaking News

ప్రజలందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలి : ఎం.పి కేశినేని శివ నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం చిట్టి నగర్ లోని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన అమ్మవార్ని ఎంపీ కేశినేని శివ నాథ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఏం.పి కేశినేని శివ నాథ్ కి వేద పండితుల మంత్రోచ్ఛారణలతో మంగళ వాయిద్యాలతో నగరాల దేవస్థానం కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. దేవాలయ కమిటీ సభ్యులు ఎంపీ కేశినేని శివనాధుని ఘనంగా సత్కరించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు ఎంపీ కేశినేని శివ నాథ్ తెలిపారు. జగన్మాత ఆశీస్సులు, ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు కృషి వల్ల వరద విపత్తు నుంచి బయటపడి ఆనందంగా దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నామని ఎం.పి కేశినేని శివ నాథ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగరాల దేవస్థానం అధ్యక్షుడు లింగిపల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు, ఉపాధ్యక్షుడు గౌరవ శ్రీనివాసరావు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గుడాల శ్రీనివాసరావు 48వ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ భోగపల్లి నాగబాబు, పోతిన బీసు కంటేశ్వరుడు, బేవర సాయి సుధాకర్, 52వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర్లు, పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ, పశ్చిమ నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు సుఖా చరిత పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *