-రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
-మంత్రిని కలిసిన మత్స్యకార సంఘ నాయకులు.
పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారులు ఎనిమిది కిలో మీటర్ల అవతల నుండి రింగు వలలతో చేపల వేట చేసుకోవాలని రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సూచించారు. గురువారం మంత్రి కార్యాలయంలో రాష్ మత్స్యకార కార్పోరేషన్ చైర్మన్ కోల గురువులు మత్స్యకార సమస్యలు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు దృష్టి తీసుకు వచ్చారు. విశాఖపట్నంలో జాలరిపేటకు చెందిన మత్స్యకారులు రింగు వలలతో చేపల వేట చేస్తూ జీవిస్తుంటారని వారికి ప్రస్తుతం చేపల వేట సమస్యగా మారిందని మంత్రి తెలిపారు. రింగు వలలతో చేపల వేట చేసే మత్స్యకారుల కష్టాలు విన్న మంత్రి వెంటనే స్పందించి రాష్ట్ర మత్స్యశాఖ కమీషనర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. అయితే శాఖా పరమైన ఇబ్బందులు లేకుండా మత్స్య కారుల జీవనం కొనసాగించేలా చేపల వేట చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. సముద్రంలోని ఎనిది కిలోమీటర్ల అవతల నుండి రింగు వలలతో చేపల వేట చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. మత్స్యకారులు ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అందుకు మత్స్యకారులు అంతా ఏకమై వైఎస్ఆర్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలను పొందాలని మంత్రి కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర మత్స్యకార కార్పోరేషన్ చైర్మన్ కోల గురువులు, మత్స్యకార సంఘ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.