విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్(సిబిసి) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ విశాఖ మహిళా డిగ్రీ కాలేజీలో నిర్వహించిన ఓటర్ల అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవస్థికృత ఓటర్ల విద్య, ఓటర్ల భాగస్వామ్యం కార్యక్రమం-స్వీప్( Systematic Voter’s Education and Electoral Programme-SVEEP)పై వయోజన ఓటర్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరియు సిబిసి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అధనపు …
Read More »All News
అన్ని గ్రామ పంచాయతీల్లోను ఉపాధి హామీ పనులు చేపట్టండి.
-ఉపాధి హామీ పనులను చేసిన కూలీలకు సకాలంలో సొమ్ము చెల్లించండి -సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను త్వరిత గతిన నీటితో నింపండి -సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు నిర్వహించేందుకు ప్రస్తుతం మంచి అనుకూల సమయమని కావున అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.రాష్ట్రంలో తాగునీరు,ఉపాధి హామీ పనులు,నీటి సరఫరా,విద్యుత్ సరఫరా పరిస్థితులపై మంగళవారం …
Read More »నిరంతర నిఘాతో రాష్ట్రాన్ని జల్లిడిపడుతున్న త్రిబుల్ “సి”
-ఎంసిసి ఉల్లంఘనలు, మద్యం అక్రమ రవాణా, సీజర్లపై త్రిబుల్ “సి” నిఘా నేత్రం -వెబ్ కాస్టింగ్ ద్వారా అంతర్-రాష్ట్ర్ర చెక్ పోస్టుల్లో వాహనాల కదలికపై పర్యవేక్షణ -వెబ్ కాస్టింగ్, జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా మద్యం సరఫరాపై నియంత్రణ -ఎంసిసి ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు వినియోగిస్తున్న దాదాపు 1,680 వాహనాలను జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షణ -ఎలక్ట్రానిక్ చానళ్లలో నిరంతరాయంగా ప్రాసారం అయ్యే వార్తాంశాలపై ప్రత్యేక దృష్టి -అత్యాధునిక సాంకేతికత అనుసందానంతో రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుండి పర్యవేక్షణ -సిఈఓ శ్రీ ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో …
Read More »గరికిముక్కు రవికుమార్‌ను అభినందించిన పలువురు వైసీపీ నాయకులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితుడైన ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, గొల్లపూడి గ్రామానికి చెందిన గరికిముక్కు రవికుమార్‌ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్, రాష్ట్ర శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ సెంట్రల్ ఆఫీస్ కోఆర్డినేటర్ లేళ్ళ అప్పిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌లు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. …
Read More »గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం… : షేక్ జలీల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. మంగళవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ జలీల్ మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తును కేటాయించటంతో రాష్ట్రంలో 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు స్థానాల్లో మా పార్టీ …
Read More »నీటి సరఫరా, విద్యుత్ సరఫరా పరిస్థితులపై వీడియో సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తాగునీరు, ఉపాధి హామీ పనులు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా పరిస్థితులపై మంగళవారం విజయవాడ లోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధి హామీ పనులను మే ఒకటవ తేదీ నుంచి మరింత పెంచడం జరుగుతుందనీ తెలిపారు. జిల్లాకి సంబంధించి ఈ ఏడాది 30 లక్షలు పని దినాలు లక్ష్యం …
Read More »తూర్పు గోదావరి జిల్లాలో ఐదవ రోజు నామినేషన్లు
-రాజమండ్రి పార్లమెంట్ కు 4 నామినేషన్లు -7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 నామినేషన్లు దాఖలు -జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని మంగళవారం నాలుగు పార్లమెంటు, ఏడు అసెంబ్లి నియోజకవర్గాల్లో 25 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చెయ్యడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఇందులో …
Read More »తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్ జవహర్ రెడ్డికి వివరించారు. విజయవాడలోని సీఎస్ క్యాంప్ కార్యాలయం నుండి మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె ఎస్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో తాగునీరు, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టర్ …
Read More »ఎన్నికల సాధారణ అబ్జర్వర్‌గా మంజూ రాజ్‌పాల్
– స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలోని తిరువూరు, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సాధారణ అబ్జర్వర్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారి మంజూ రాజ్‌పాల్ మంగళవారం విజయవాడ నగరానికి విచ్చేశారు. స్థానిక మునిసిపల్ గెస్ట్ హౌస్ వద్ద మంజూ రాజ్‌పాల్‌కు కలెక్టర్ ఎస్.డిల్లీరావు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లాలో ఎన్నికలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లను కలెక్టర్ …
Read More »సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో కీలకంగా ఎస్ఎల్‌బీసీ
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్‌బీసీ) పోషిస్తున్న పాత్ర కీలకమైందని.. ఇలాంటి సమితికి కన్వీనర్‌గా సీవీఎన్ భాస్కర్ బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. ఎస్ఎల్‌బీసీ నూతన కన్వీనర్ సీవీఎన్ భాస్కర్ మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ డిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు నూతన కన్వీనర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. బ్యాంకు లింకేజీ, ఫైనాన్షియల్ లిటరసీ, ప్రజలకు …
Read More »