రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో తాగునీరు, ఉపాధి హామీ పనులు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా పరిస్థితులపై మంగళవారం విజయవాడ లోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధి హామీ పనులను మే ఒకటవ తేదీ నుంచి మరింత పెంచడం జరుగుతుందనీ తెలిపారు. జిల్లాకి సంబంధించి ఈ ఏడాది 30 లక్షలు పని దినాలు లక్ష్యం లో ఇప్పటి వరకు 3.42 లక్షల మేర లక్ష్యాలను సాధించడం జరిగిందనీ పేర్కొన్నారు. జిల్లాలో త్రాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా లో, త్రాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏపిఈపిడిసిఎల్ టీవీఎస్ఎన్ మూర్తి, డ్వామా పిడి ఏ. ముఖలింగం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ డీ. బాల శంకరరావు, ఆర్ ఎం సి ఎస్ ఈ జి. సాంబశివ రావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News