గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెప్మా రీసోర్స్ పర్సన్స్ (ఆర్.పి.) ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా అర్హులైన స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంక్ ల నుండి రుణాలు అందేలా చిత్తశుద్దితో కృషి చేయాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏ నసీర్ అహ్మద్ స్పష్టం చేశారు. శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆర్.పి.లు, సిఎంఎంలు, సిఓలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ తొలుత నియోజకవర్గ పరిధిలో ఎంత మంది స్వయం సహాయక గ్రూప్ లు, సభ్యులు, ఇప్పటి …
Read More »Andhra Pradesh
సచివాలయం పరిధిలో సమస్యలు, పరిష్కార మార్గాలపై సమగ్ర అవగాహన కల్గి ఉండాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయ కార్యదర్శులు తమ సచివాలయం పరిధిలో సమస్యలు, పరిష్కార మార్గాలపై సమగ్ర అవగాహన కల్గి ఉండాలని, కార్యదర్శులు స్థానికంగా ఉండే సమస్యలను పరిష్కారానికి చొరవ చూపాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ ఎన్.జి.ఓ.కాలనీ, నల్లకుంట, శ్యామలా నగర్, పలకలూరు రోడ్, ఉద్యోగ నగర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం, అభివృద్ధి పనులను ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. …
Read More »పోషన్ వాటికాస్ కాంపోనెంట్ సద్వినియోగం చేసుకోవాలి
-మొక్కలు పెంపకం కోసం ప్రతి అంగన్వాడీ కేంద్రానికి రూ.10 వేలు మంజూరు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోషన్ వాటికాస్ కాంపోనెంట్ కింద ప్రతి అంగన్వాడీ కేంద్రానికి రూ.10,000/- నిధులను విడుదల చెయ్యడం జరుగుతోందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం నగరంలోని సిగిడిల పేట, బాలజీపేట లలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , పోషన్ వాటికాస్ కాంపోనెంట్ను ప్రతి అంగన్వాడీ కేంద్రంలోని సెక్టార్ సూపర్వైజర్ …
Read More »ఈ నెల 25లోగా పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలి
-ఉమ్మడి కృష్ణా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి అబ్దుల్ రబ్బానీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉర్దూ భాష అభివృద్ధి, సాహిత్యంతో పాటు వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ప్రదానం చేసే పురస్కారాలకు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి కృష్ణా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి అబ్దుల్ రబ్బానీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ స్థాయి పురస్కారం, డాక్టర్ అబ్దుల్ హఖ్ ప్రాంతీయ స్థాయి పురస్కారంతో పాటు ఉర్దూ …
Read More »“జాబ్ డ్రైవ్”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్, విజయవాడ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.19.10.2024 శనివారం నాడు విజయవాడ లోని జిల్లా ఉపాధి కార్యాలయం, ప్రభుత్వ ITI కళాశాల, రమేష్ హాస్పిటల్స్ రోడ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా నందు “జాబ్ డ్రైవ్” నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు(FAC) మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి …
Read More »ప్రశాంతంగా ముగిసిన పదిహేనవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా పదిహేనవ రోజు అనగా 19/10/2024 తేదీన ఉదయం, మధ్యాహ్నం పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర విభాగంలో అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 23219 మందికి గాను 20350 మంది అభ్యర్థులు అనగా 87.64 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 68 సెంటర్లలో జరిగిన పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 12867 మందికి గాను 11184 మంది అనగా 86.92 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా …
Read More »కృష్ణమ్మ చెంత భారీ డ్రోన్ షోకు పకడ్బందీ ఏర్పాట్లు
– ఈ నెల 22న సాయంత్రం 6.30 గం. నుంచి 8 గం. వరకు సాంస్కృతిక సంరంభం. – అయిదు వేలకు పైగా డ్రోన్లతో రికార్డుస్థాయి డ్రోన్ షోకు కసరత్తు. – లేజర్ బీమ్ షో, మ్యూజిక్ బ్యాండ్, బాణసంచా వెలుగు జిలుగులు కూడా. – డ్రోన్ సమ్మిట్-ప్రత్యేక కార్యక్రమాల విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి. – జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా – కార్యక్రమానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు: సీపీ ఎస్వీ రాజశేఖరబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »నిత్యావసర వస్తువులు పక్కదారి పడితే 6A చట్టం ద్వారా కఠిన చర్యలు
-రేషన్ డీలర్ల నియామకల ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టండి -ప్రత్యేక కౌంటర్ల ద్వారా పామాయిల్, కందిపప్పు, ఉల్లి విక్రయాలు -ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీచేసే నిత్యావసర వస్తువుల పంపిణీలో ఎటువంటి అవకతవకలకు పాల్పడిన ఉపేక్షించబోమని అక్రమలకు పాల్పడితే 6A చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాలో నూతన రేషన్ దుకాణాల ఏర్పాటుకు డీలర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రత్యేక కౌంటర్ల …
Read More »వరద బాధితులకు స్పెషలిస్టు వైద్య సేవలు
-రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు. -జీవితంలో ముందుకెళ్లాలంటే ఆరోగ్యం అత్యంత ప్రధానం. -రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ ఎం.బబిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావంతో విజయవాడలోని అనేక ప్రాంత ప్రజలు ఇబ్బందిపడ్డారని.. మనం హాయిగా జీవించాలన్నా, జీవితంలో ముందుకెళ్లాలన్నా ఆరోగ్యంగా ఉండటం అత్యంత ముఖ్యమని, అందుకే ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్) ఎం.బబిత తెలిపారు. …
Read More »ఈ నెల 25లోగా పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలి
-ఉమ్మడి కృష్ణా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి అబ్దుల్ రబ్బానీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉర్దూ భాష అభివృద్ధి, సాహిత్యంతో పాటు వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ప్రదానం చేసే పురస్కారాలకు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి కృష్ణా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి అబ్దుల్ రబ్బానీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ స్థాయి పురస్కారం, డాక్టర్ అబ్దుల్ హఖ్ ప్రాంతీయ స్థాయి పురస్కారంతో పాటు ఉర్దూ …
Read More »