Breaking News

Andhra Pradesh

శివారు ప్రాంతాలకు తాగునీరు అందించాలి

-నిర్ణీత సమయంలోగా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి -అధికారిక కార్యక్రమాలకు ప్రోటోకాల్ పాటించండి -జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని శివారు గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీరు సక్రమంగా అందించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, వైస్ చైర్ పర్సన్ గరికిపాటి శ్రీదేవి అధ్యక్షతన స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో స్థాయి సంఘ సమావేశాలు …

Read More »

అర్బన్ బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అర్బన్ బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన గుంటూరు అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు లాకర్లు డిపాజిట్లు రుణాల విభాగాలను క్యాష్ కౌంటర్లను పరిశీలించారు. అనంతరం వినియోగదారులకు తనదైన శైలిలో మెరుగైన సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి బ్యాంక్ అధికారులకు …

Read More »

ప్రశాంతంగా ముగిసిన పన్నెండవరోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా పన్నెండవ రోజు అనగా 16/10/2024 తేదీన ఉదయం , మధ్యాహ్నం పేపర్ 2 ఏ మాథ్స్ & సైన్స్ విభాగంలో అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 28354 మందికి గాను 23872 మంది అభ్యర్థులు అనగా 84.19 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 57 సెంటర్లలో జరిగిన పేపర్ 2 ఏ.మాథ్స్ & సైన్స్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 14300 మందికి గాను 12093 మంది …

Read More »

మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకి కాలుష్య రహిత నగరానికి నిపుణులతో సమావేశం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు, కాలుష్య రహిత నగరానికి ఆ ఆ రంగం నిపుణులతో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రధాన కార్యాలయంలో తమ చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేస్ట్ వాటర్ ప్రాసెస్,పారిశుద్ధ్య నిర్వహణ మరియు నగరాభివృద్ధి దిశగా చర్చించారు. కాలుష్య రహిత సమాజానికి తీసుకోవాల్సిన చర్యలు, పారిశుధ్య నిర్వహణకి మెరుగైన వసతులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కాస్మిక్ హిలోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ …

Read More »

ముంపు బాధితులకు దుప్పట్లు, టవల్స్ పంపిణి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆల్ ఇండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్, విజయవాడ డివిజన్ వారి ఆధ్వర్యములో బుధవారం కామ్రేడ్ కె ఎస్ ఎన్ మూర్తి భవన్ నందు బుడమేరు ముంపు బాధితులకు దుప్పట్లు, టవల్స్ ఒక కిట్ రూపములో పంపిణి చేయటం జరిగింది. బుడమేరు ముంపు లో రైల్వే ఉద్యోగులు మరియు పెన్షనర్లు గృహాలు మునిగిపోయి తీవ్ర ఇబ్బందుల పాలు పడ్డారని, వారికి ఫెడరేషన్ ద్వారా ఎంతో కొంత సహాయం చేపట్టటం జరిగిందని ఫెడరేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన …

Read More »

అక్టోబ‌రు 28 నుండి 30వ తేదీ వ‌ర‌కు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

తిరుప‌తి, 2నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 28 నుండి 30వ తేదీ వరకు ప‌విత్రోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. ఇందులో భాగంగా అక్టోబరు 27వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు ఆచార్య రుత్విక్‌వ‌ర‌ణం, సాయంత్రం 6 గంటలకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 28వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6.30 గంటలకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. రెండో రోజు అక్టోబ‌రు 29వ తేదీన మధ్యాహ్నం …

Read More »

అక్టోబరు 17న పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 17న పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ చేస్తారు విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

Read More »

నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వరద బాధితులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహాకారంతో సుజనా ఫౌండేషన్ మరియు రామకృష్ణ ఆశ్రమం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ NDA కార్యాలయము, స్వాతి ధియేటర్ రోడ్, భవానీపురం విజయవాడ నందు 3 వేల మందికి నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి y సత్యకుమార్ మాట్లాడుతూ విజయవాడలో కురిసిన భారీవరదలకు బుడమేరు కట్ట తెగిన కారణంగా విజయవాడలో లక్షల మంది ప్రజలు 10 రోజులపాటు …

Read More »

అందరూ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి…

అమ‌రావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ప్రతిష్టతను ఆకాశంలో నిలబెట్టేలా శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత రక్షణ రంగం బలోపేతానికి విశేష కృషి చేసిన మీసైల్ మ్యాన్, మేధావి, నిరాడంబరుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేడు నేతలు ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అయన సేవలను కొనియాడారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్పశాస్త్రవేత్త. యువతకు మార్గదర్శి. జీవితాంతం దేశ ప్రతిష్టకోసం తపించిన దేశభక్తుడని ప్రశంశించారు. అందరూ కలాంను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. …

Read More »

సీఎం సహాయ నిధికి పలువురు దాతల విరాళం

అమ‌రావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు దాతలు విరాళం అందించారు. వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడుని సచివాలయంలో కలిసి విరాళాల చెక్కులను అందించారు. దాతలను సీెం అభినందించారు. చెక్కులు అందజేసిన వారిలో…. 1. బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రూ.83 లక్షలు(నియోజకవర్గ కూటమి నేతలు, ప్రజల భాగస్వామ్యంతో) 2. ఏపీ మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ రూ.5 లక్షలు 3. శ్రీ భానోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రూ.2 లక్షలు 4. వీఆర్ఆర్ వైభవ్ ఫ్లాట్స్ ఓనర్స్ …

Read More »