Breaking News

Andhra Pradesh

గవర్నర్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ , సుప్రవ హరిచందన్ దంపతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు భేటీ అయ్యారు, సోమవారం రాజ్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. గవర్నర్ ను వెంకటేశ్వర స్వామి మెమోంటో, దుశ్సాలువాతో సత్కరించారు. దాదాపు గంట సేపు గవర్నర్, ముఖ్యమంత్రి ఏకాంతంగా సమావేశం అయ్యారు. సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. మర్యాద …

Read More »

కీచక ప్రిన్సిపాల్ పై భగ్గుమన్న ‘మహిళా కమిషన్’

-పోక్సోకు మించిన సెక్షన్లతో కఠినచర్యలు -కాకినాడ ఎస్పీకి వాసిరెడ్డి పద్మ ఆదేశాలు -మహిళా వసతిగృహాల పర్యవేక్షణపై ప్రత్యేక నిఘా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వసతిగృహంలో ఉంటూ చదివే విద్యార్ధినిపై ప్రిన్సిపాల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ భగ్గుమంది. ఈ విషయం వెలుగులోకి రాగానే కాకినాడ ఎస్పీతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. వివరాల్లోకొస్తే.. కాకినాడలోని కొండయ్యపాలెం హెల్పింగ్ హ్యాండ్స్ వసతిగృహంలో 15ఏళ్ల విద్యార్ధిని ఉంటూ సమీప పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. కరోనా …

Read More »

రేపు సీఎం వైయస్‌ జగన్‌ గుంటూరు, పల్నాడు జిల్లాలలో పర్యటన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉదయం 10.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి , 10.40 గంటలకు గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో ఏర్పాటుచేసిన సభావేదిక వద్దకు చేరుకుంటారు. 10.45 – 11.30 గంటల వరకు డాక్టర్‌ వైయస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్‌లను, హర్వెస్టర్‌లను జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పల్నాడు జిల్లా కొండవీడు చేరుకుని జిందాల్‌ ప్లాంటు సమీపంలో ఏర్పాటుచేసిన హరిత నగరాలు నమూనాని ఆవిష్కరిస్తారు. 12.15 – 12.30 గంటల …

Read More »

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సీఎం సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే)పై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. సమగ్ర సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పటివరకూ జరిగిన సర్వే ప్రగతిని సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ సమగ్ర సర్వే కారణంగా అన్ని భూ వివాదాలు పరిష్కారం అవుతాయని సీఎం అన్నారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. భూ వివాదాలను …

Read More »

ఎస్సీ గురుకులాల్లో చిత్తూరు జిల్లా టాప్

-పదవ తరగతి పరీక్షల్లో 92శాతం ఉత్తీర్ణత -రాష్ట్రవ్యాప్తంగా 69 శాతం ఫలితాలు సాధించిన ఎస్సీ గురుకులాలు -మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ గురుకులాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులలో రాష్ట్రవ్యాప్తంగా 69 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లాకు చెందిన గురుకులాలు టాప్ లో ఉన్నాయని, ఆ జిల్లాకు చెందిన గురుకులాల విద్యార్థులు శాతం 92 ఉత్తీర్ణతను సాధించారని వివరించారు. …

Read More »

పట్టణాలు, నగరాల్లో ఇక మరింత పచ్చదనం.. జగనన్న హరిత నగరాలతో సాకారం…

-పల్నాడు జిల్లా కొండవీడు గ్రామంలో ‘జగనన్న హరిత నగరాలు’ కార్యక్రమానికి మంగళవారం నాడు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.. -మొదటి విడతగా 45 పట్టణ స్థానిక సంస్థల్లో పచ్చదనం, సుందరీకరణ అమలుకు ప్రణాళికలు.. అంచనా వ్యయం రూ. 78.84 కోట్లు. -గ్రీన్ సిటీ ఛాలెంజ్ లో మొదటి 10 ర్యాంకులు సాధించిన వారికి ఒక్కొక్క సంస్థకు కోటి రూపాయల చొప్పున 10 కోట్లు బహుమానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణాలు, నగరాల్లోని రహదారులు పచ్చటి చెట్లతో, సుందరీకరణతో …

Read More »

అర్హులైన ప్రతి విద్యార్థికి అమ్మఒడి పథకం వర్తింపజేయాలి…

-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమ్మఒడి పథకంలో ఎదురయ్యే సమస్యలపై పున:పరిశీలన చేసి అర్హుత ఉన్న ఏ ఒక్కరూ అమ్మఒడి పథకంవల్ల తమకు లబ్ది చేకూరలేదనే పిర్యాదు రానీయరాదని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విద్యా శాఖాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అమ్మఒడి పథకం అమలలో ఎదురవుతున్న సమస్యలపై డిఇవో, మండల విద్యా శాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 607 గ్రామ సచివాలయాలలో …

Read More »

10వ తరగతి ఫలితాల్లో 78.30 శాతం ఉత్తీర్ణతతో సాధించి ప్రకాశం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది..

-4,14,281 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా బాలురు కంటే బాలికలు ఎక్కువ శాతం ఉత్తీర్ణత.. -797 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి.. -ఫెయిల్ అయిన విద్యార్థులకు జులై 6 నుండి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణ.. -సప్లిమెంటరీ పరీక్షలకు జూన్ 7 నుండి ఫీజుల చెల్లింపు ప్రారంభం.. -పాఠశాల గడువు తేదీ కంటే ముందు తెరిచినా, తరగతులు ప్రారంభించినా చర్యలు తీసుకుంటాం.. -రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 10వ తరగతి …

Read More »

ఆర్జీదారుడు సంతృప్తి చేందేలా సమస్యను పరిష్కరించండి…

-స్పందనలో 110 ఆర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌ స్పందన సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రజల నుండి110 ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఎంతో నమ్మకంతో ఆర్జీలను సమర్పిస్తారన్నారు. అధికారులు ఆర్జీలను నిశితంగా పరిశీలించి పరిష్కారం …

Read More »

సాధించే లక్ష్యాల ఆధారంగా రాష్ట్ర, దేశ స్థాయి సుస్థిరాభివృద్ధి ఆధారపడి ఉంటుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయిలో సాధించే లక్ష్యాల ఆధారంగా రాష్ట్ర, దేశ స్థాయి సుస్థిరాభివృద్ధి ఆధారపడి ఉంటుందని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో భాగంగా గోల్‌ నెంబర్‌ 13 క్లైమేట్‌ యాక్షన్‌ పై సోమవారం నగరంలోని స్పందన సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యావరణానికి నష్టం కలగకుండా జరిగే ఆర్థికాభివృద్ధిని సుస్థిరాభివృద్ది అంటారన్నారు. ప్రస్తుత కాలంలో మన అవసరాలను తీర్చుకుంటూ భావితరాలకు కూడా సమకూర్చుకోవడంలో రాజీలేని అభివృద్ధిని సుస్థిరాభివృద్ధి …

Read More »