-రైతులతో ప్రత్యక్ష సంబంధం వున్న క్షేత్ర స్థాయి వ్యవసాయ సహాయకులు రైతులకు బ్యాంకులు అందిస్తున్న సేవలు -రుణ పదకాలపై మరింత అవగాహన,ప్రచారం చేపట్టాలి
– బుడితి రాజశేఖర్ ఐఏఎస్
ప్రత్యెక ముఖ్య కార్యదర్శి (వ్య.& సహ)
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ ప్రత్యెక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ , ఐఏఎస్ వెలగపూడి కార్యాలయం నుండి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్, కమిషనర్ ఉద్యాన శాఖ శ్రీనివాస్ ఐఏఎస్,రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు కన్వీనర్ సి.భాస్కర రావు ,వ్యవసాయ ఉప సంచాలకులు పద్మావతి,జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్లు మరియు వివిధ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల అధిపతులు పాల్గొన్నారు .
రాజశేఖర్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులలో తరచుగా ఏర్పడుతున్న తుఫాన్లు ,అధిక వర్షాల కారణంగా వ్యవసాయము ఆటుపోట్లకు గురవుతూ వున్న ప్రస్తుత పరిస్థితులలో, రైతులు వారి మనోధైర్యం కోల్పోకుండా వారిలో భరోసాను ,మానసిక ధైర్యం పెంచెవిధముగా బ్యాంకర్లు,వ్యవసాయ సిబ్బంది రైతులకు పూర్తి స్థాయి తోడ్పాటు అందించాలని తెలిపారు.
వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం రైతులు ఎటువంటి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించవలసిన అవసరం లేదని ,ప్రభుత్వం సంస్థాగతంగా బ్యాంకులు ,సహకార సంఘాల ద్వారా రుణాలు ,సకాలములో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ లేని రుణాలు మరియు ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్న సమాచారాన్ని రైతులకు అవగాహన పెరిగే విధముగా క్షేత్ర స్థాయిలో రైతులకు మరింత అవగాహన పెరిగే విధముగా వ్యవసాయ సహాయకులు కార్యోన్ముఖులు కావాలని తెలిపారు.
డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ ,రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శక సూత్రాలను అనుసరించి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల నుండి రైతులకు ఎటువంటి హామీ , పూచీకత్తు లేకుండా రుణాన్ని 1,60,000/- నుండి 2,00,000 వరకు పెంచిన విషయాన్ని , రుణంపొందిన రైతులు సకాలములో రుణాన్ని తిరిగి చెల్లించడం ద్వారా బ్యాంకర్లు రైతులకు అందించే ప్రోత్సహకాలపై వ్యవసాయ సహాయకులు ద్వారా మరింత చైతన్యం కలిగిస్థామని తెలిపారు. తదనుగుణంగా వివిధ బ్యాంకుల ద్వారా గ్రామస్థాయి లో రుణాలను పొందిన రైతుల వివరాలను వారికి అందించడమైనదని తెలిపారు.రాష్ట్ర బ్యాంకర్ల కన్వీనర్ సి భాస్కర రావు మాట్లాడుతూ రైతులకు పూర్తిగా మానవీయ కోణంలో సహకారం అందిస్తామని ,
తెలిపారు.
Prajavartha Online Telugu News