Breaking News

Andhra Pradesh

జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి…

-నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి -లక్ష్య సాధనలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు -కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ భవనాలు పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. మాధవి లత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి పాఠశాలల్లో నాడు నేడు, హౌసింగ్, గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లు, హెల్త్ క్లినిక్ భవనాల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …

Read More »

రబీ సాగు చేసే పంట కొనుగోలు చేసిన తర్వాత మిల్లింగ్ అయినా బియ్యం నాణ్యత పరిశీలన…

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సాగు చేసే పంట కొనుగోలు చేసిన తర్వాత మిల్లింగ్ అయినా బియ్యం నాణ్యత పరిశీలించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు గ్రామంలో SWC గోడౌన్ ఆకస్మికంగా జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, అర్భికెలు ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం మిల్లింగ్ అనంతరం ఎఫ్ సి ఐ గో డౌన్ కి చేరుకోవడం జరుగుతుందన్నారు. ఆ బియ్యం నాణ్యత ప్రమాణాలు …

Read More »

జగనన్న పాలన అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-57 వ డివిజన్ 236 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే ప్రధాన అజెండాగా జగనన్న ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 57 వ డివిజన్ – 236 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రెండో రోజు ప్రజాదరణతో దిగ్విజయంగా సాగింది. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ …

Read More »

ఘనంగా మాచవరం దాసాంజనేయ స్వామి వారి హనుమజ్జయంతి ముగింపు వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం హనుమజ్జయంతి ముగింపు వేడుక ఘనంగా జరిగాయి. గత నాలుగు రోజులుగా జరుగుతున్న హనుమాన్ జయంతి కార్యక్రమాలతో దాసాంజనేయ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం భారీగా జరిగిన అన్నప్రసాద వితరణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, …

Read More »

ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు

-దావోస్‌ పర్యటనలో సీఎం వైయస్‌.జగన్‌ నేతృత్వంలో ఏపీకి చక్కటి ఫలితాలు -అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫాక్చరింగ్‌–డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం -కర్బన రహిత ఆర్థిక వ్యవస్థవైపు అడుగులు -భారీగా గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి -తొలిసారిగా ఏపీలో ఆర్సెలర్‌ మిట్టల్‌ పెట్టుబడులు -అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో రూ.1.25 లక్షల కోట్ల ఎంఓయూలు -మచిలీపట్నంలో గ్రీన్‌ ఎనర్జీ ఎస్‌ఈజెడ్‌ -హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ -యూనికార్న్‌ స్టార్టప్స్‌కూ వేదిక -దావోస్‌వేదికపై వైద్యం, ఆరోగ్యం, విద్యా తదితర రంగాల్లో ప్రగతివాణి వినిపించిన రాష్ట్రం దావోస్‌, నేటి పత్రిక ప్రజావార్త : దావోస్‌లో జరుగుతున్న …

Read More »

సీనియర్ జర్నలిస్ట్ ని మ్మరాజు చలపతిరావు 61 వ జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరులోని హ్యాపీ కేర్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో సీనియర్ పాత్రికేయులు విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు టెలికం సలహా కమిటీ సభ్యులు నిమ్మ రాజు చలపతిరావు 61 వ జన్మదిన వేడుకలు ఈ నెల 26వ తేదీన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ నాలుగు దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో …

Read More »

భువనేశ్వర్‌లోని టీటీడీ ఆలయ ‘మహా సంప్రోక్షణ’లో పాల్గొన్న గవర్నర్ హరిచందన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భువనేశ్వర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు గురువారం నిర్వహించిన ‘విగ్రహ ప్రతిష్ట’ ‘మహా సంప్రోక్షణ’, ‘ఆవాహన’ శుభ కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఇతర హిందూ మత పెద్దల సమక్షంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కల్యాణోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి, టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More »

క్షేత్రస్థాయిలో ని వివిధ శాఖల అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలి… : కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించే లక్ష్యాలపై రాష్ట్ర స్థాయి అధికారులు వారం వారం సమీక్షిస్తూ, ప్రగతి సాధనే దిక్సూచి గా పేర్కొనడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీ లత పేర్కొన్నారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, జగనన్న స్వచ్చ సంకల్పం , ఉపాధిహామీ, వైఎస్ఆర్ జల కల , జల్ జీవన్ మిషన్ , పన్నుల వసూలు (పన్నులు & నాన్ ట్యాక్స్‌లు) , నాడు నేడు పై పాఠశాల విద్య …

Read More »

సేంద్రియ ఎరువులు అందరికీ అందుబాటులో ఉంచాలి…

-జిల్లా యూనిట్ గా అమ్మకాలు చేపట్టాలి -జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలలో ఉత్పత్తి చేసిన సేంద్రియ ఎరువు ను అందరికి అందుబాటులోకి తెచ్చి విక్రయించేందుకు అడుగులు వెయ్యాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత సూచించారు. గురువారం బొమ్మూరు లోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సేంద్రియ ఎరువు విక్రయ కేంద్రాన్ని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా . కె.మాధవిలత ప్రారంభించారు. ఈ సందర్భంగా …

Read More »

జిల్లాలో 272 గ్రామాల్లో రీ సర్వే పనులు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భూ హక్కు భూ రక్షా కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సిబ్బంది రీ సర్వే పూర్తి చేసేందుకు క్షేత్ర స్థాయి లో ప్రణాళిక లు రూపొందించామని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత పేర్కొన్నారు . గురువారం అమరావతి నుంచి సిసిఎల్ఏ & స్పెషల్ సీఎస్ జీ. సాయిప్రసాద్, కార్యదర్శి బాబు. ఏ. తదితరులు రీసర్వే పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జేసీ సిహెచ్. శ్రీధర్ లు పాల్గొన్నారు. సి సి ఎల్ ఏ & …

Read More »