Breaking News

ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ కు అభినందనలు వెల్లువ

-కొత్త సంవత్సరంలో రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేద్దామని అధికారులు, కూటమి నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన మంత్రి దుర్గేష్
-ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన మంత్రి దుర్గేష్
-త్వరలోనే రాష్ట్ర ప్రజలు అభివృద్ధి ఫలాలు చూడబోతున్నారు అని ప్రజల్లో ఉత్సాహం మంత్రి దుర్గేష్
-తమ అభిమాన నేత మంత్రి దుర్గేష్ ని కలిసామన్న ఆనందంలో ప్రజలు, అభిమానులు

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్త సంవత్సరంలో రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేసి సరికొత్త ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మించుకుందామని ప్రజలందరికీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. బుధవారం నిడదవోలు లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ ను వేద మంత్రోచ్ఛరణల మధ్య వేదపండితులు ఆశీర్వదించారు. అనంతరం మంత్రి దుర్గేష్ ప్రజలతో కలిసి న్యూ ఇయర్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు శాఖల ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది తదితరులు మంత్రి దుర్గేష్ కు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ తో కరచాలనం చేసిపలువురు ఫోటోలు దిగారు. పలువురు అభిమానులు మంత్రి దుర్గేష్ తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలుపుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని అధికారులు, నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్వరలోనే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలు చూస్తారని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా న్యూ ఇయర్ క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలు, పలువురు అభిమానులు తమ అభిమాన నేత మంత్రి దుర్గేష్ ను కలిసామని ఆనందం వ్యక్తం చేస్తూ మురిసిపోయారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *