విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భువనేశ్వర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు గురువారం నిర్వహించిన ‘విగ్రహ ప్రతిష్ట’ ‘మహా సంప్రోక్షణ’, ‘ఆవాహన’ శుభ కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఇతర హిందూ మత పెద్దల సమక్షంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కల్యాణోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News