Breaking News

Andhra Pradesh

తూర్పు గోదావరి జిల్లాలో జాతీయ రహదారుల పై కలెక్టర్ సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా తూర్పు గోదావరి జిల్లా ఏర్పడిన తదుపరి జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారుల సమగ్ర సమాచారం పై సమీక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలిసి పిడి (ఎన్.హెచ్) డి సురేంద్ర నాథ్ తో చర్చించారు..ఈ సందర్భంగా , జిల్లాలో ఎన్ హెచ్ 16 రాజానగరం నుంచి గుండుగొలను వెళ్ళే రహదారి జిల్లా పరిధిలో దుబచేర్ల వరకు, …

Read More »

వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పులివెందుల కేంద్రంగా భీమ్ రావ్ జిల్లా ఏర్పాటు చేయాలి… : పోతిన వెంకట మహేష్

-సీఎంను ఒప్పించే బాధ్యత సీనియర్ మంత్రులు తీసుకోవాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుని వివాదాల్లోకి లాగి రాజకీయంగా వాడుకుంటూ ఆ మహనీయుని ఖ్యాతిని తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. నిజంగా వైసీపీ ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్  పట్ల చిత్తశుద్ధి ఉంటే కడప జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. వీలు కాని పక్షంలో 27వ జిల్లాను …

Read More »

ఎపి గ్రామీణాభివృద్ధి శాఖకి దక్కిన మరో అరుదైన గౌరవం

– స్కోచ్ ”స్టార్ ఆఫ్ గవర్నెన్స్” పురస్కారంకు ఎంపిక – వచ్చేనెల 18న ఢిల్లీలో ఇండియన్ గవర్నెన్స్ ఫోరం వేదికగా అవార్డు ప్రధానం – జాతీయ స్థాయిలో గుర్తింపును సాధిస్తున్న సీఎం వైయస్ జగన్ పాలన – గ్రామీణ పాలనలో సీఎం  వైయస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు – ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో సత్ఫలితాలు – పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న గ్రామీణ పాలన -డిప్యూటీ సీఎం (పిఆర్&ఆర్డీ)  బూడి ముత్యాలనాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖకు …

Read More »

ముప్పాళ్ళ యువతికి అండగా ‘మహిళా కమిషన్’

-అత్తింటి వేధింపులపై -మీడియా కథనాన్ని సుమోటోగా స్వీకరణ -చందర్లపాడు పోలీసుల దర్యాప్తు పై నివేదికకు ఎస్పీకి లేఖ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అత్తింటి వేధింపులకు సంబంధించి తనకు న్యాయం జరగలేదని ఎడ్లబండిపై ఢిల్లీకి ప్రయాణం కట్టిన ఓ యువతికి రాష్ట్ర మహిళా కమిషన్ అండగా నిలబడింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామా మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన నవ్యతకు స్థానిక పోలీసు స్టేషనులో అన్యాయం జరిగిందంటూ ఆమె అన్నయ్యతో పాటు ఎడ్లబండిపై ఢిల్లీకి ప్రయాణమైన విషయం గురువారం మీడియాలో రావడంతో మహిళా కమిషన్ …

Read More »

జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం జిల్లాలో పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ సంబంధిత యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటకరీ గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్‌ కోన శశిధర్‌లకు వివరించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాల అమలుపై గురువారం పంచాయతీరాజ్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్‌ కోన శశిధర్‌లు సచివాలయం నుండి రాష్ట్రలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ …

Read More »

జిల్లాలలో భూముల రీసర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేలా చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలలో భూముల రీసర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢల్లీిరావు సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో గురువారం సిసిఎల్‌ఏ ప్రధాన కార్యాలయం నుండి జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకంలో భాగంగా భూముల రీసర్వే ప్రక్రియపై సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టర్‌ …

Read More »

అంబేద్కర్ ఫొటో లకు దండలు… వెనుకనుండి దళితుల పై దాడులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోనసీమ కు అంబేడ్కర్ జిల్లా గా మార్చి నందుకు అమలాపురం లో జరుగుతున్న సంఘటనల వెనుక రాజకీయ దుష్ట శక్తులు ఉన్నాయని ఏపీ ఏపీ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ మద్దుల రామకృష్ణ అన్నారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాలకు, ఫోటోలకు వేస్తారని వెనకనుంచి దళితులపై దాడులు చేస్తారని వాపోయారు. ప్రశాంతమైన కోనసీమ ప్రాంతాన్ని అందరూ రాజకీయ లబ్ధి కోసం …

Read More »

రోగులకు అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగుపరచండి…

-ప్రభుత్వ ఆసుపత్రిపై చులకన భావాన్ని పోగొట్టి ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఉన్నామన్న భావన కల్పించండి… -ఏ సమయంలోనైన ఆకస్మిక తనిఖీ చేస్తా.. నిర్లక్ష్యం వహిస్తే సహించను… -జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రి నందు వైద్యులు సిబ్బంది రోగుల మధ్య స్నేహపూరిత వాతావారణంలో మెలుగుతూ సేవలను మరింత మెరుగు పరచాలని ఏ సమయంలోనైనా తాను ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేస్తానని విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించనని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. విజయవాడలోని …

Read More »

నగరంలో టిడిపి మాలల ఆత్మగౌరవ సభ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ మాలల ఆత్మ గౌరవ సభ కార్యక్రమం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం జరిగింది. కార్యక్రమంలో ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ రేపు జరగబోయే మహానాడు కార్యక్రమానికి అందరూ హాజరై  కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ప్రశాంతమైన కోనసీమ ప్రాంతాన్ని రాజకీయ లబ్ధి కోసం విధ్వంసం సృష్టిస్తున్నారని అన్నారు. కోనసీమ కు అంబేద్కర్ పేరు పెట్టడం అందరూ స్వాగతిస్తున్నారని అన్నారు. ఈ అల్లర్లలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకొని ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలన్నారు. మాలలకు …

Read More »

రాష్ట్ర మహిళా,శిశు, దివ్యాంగుల,వయో వృద్ధుల సంక్షేమ కమిటీ సభ్యులు అరుణాచల ప్రదేశ్ పర్యటన

అరుణాచలప్రదేశ్ (ఇటానగర్), నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనులు, మహిళలు,శిశువులు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమం కొరకు రాష్ట్రంలో మరిన్ని మెరుగైన పథకాలను అమలు పర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర మహిళా,శిశు, దివ్యాంగుల,వయో వృద్ధుల సంక్షేమ కమిటీ అరుణాచలప్రదేశ్ పర్యటనకు వెళ్లింది. రాష్ట్ర మహిళా,శిశు, దివ్యాంగుల,వయో వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్ పెర్సన్ మరియు పాలకొండ శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి నేతృత్వంలో సభ్యులు పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ, నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్ మోహన్ రావు ఈ పర్యటనలో పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ …

Read More »