విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోనసీమ కు అంబేడ్కర్ జిల్లా గా మార్చి నందుకు అమలాపురం లో జరుగుతున్న సంఘటనల వెనుక రాజకీయ దుష్ట శక్తులు ఉన్నాయని ఏపీ ఏపీ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ మద్దుల రామకృష్ణ అన్నారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాలకు, ఫోటోలకు వేస్తారని వెనకనుంచి దళితులపై దాడులు చేస్తారని వాపోయారు. ప్రశాంతమైన కోనసీమ ప్రాంతాన్ని అందరూ రాజకీయ లబ్ధి కోసం విధ్వంసం సృష్టిస్తున్నారు అని అన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టినందుకు దానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. దీన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని కోరారు. అంబేడ్కర్ పేరును కొనసాగించాలని చంద్రబాబు నోరు కూడా విప్పిడం లేదని అన్నారు. భారతదేశం మొత్తం అంబేద్కర్ ను గౌరవిస్తుందని తెలిపారు. ఈ అల్లర్లలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకొని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కాపు నాయకులు దొడ్ల రాజా మాట్లాడుతూ అంబేద్కర్ ఏ కులానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిని కొనియాడారు. అటువంటి వ్యక్తి పేరుపై జిల్లా ను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయం అని అన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని రాజకీయం చేయవద్దని సూచించారు. ఈ సమావేశంలో దళిత సత్తా నాయకులు కనకరాజు, ఎస్ కే రాజా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News