Breaking News

Andhra Pradesh

మహిళల ఆర్థికాభివృద్ధికి జగనన్న అమూల్ పాలవెల్లువ పధకం : జేసీ డా. కె. మాధవీలత

ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే జగనన్న అమూల్ పాలవెల్లువ పధకంను పటిష్టంగా అమలు చేసిందేందుకు కృషి చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. కె. మాధవీలత అన్నారు. అగిరిపల్లి మండలం చిన ఆగిరిపల్లిలో జగనన్న పాలవెల్లువ పధకం ప్రగతిపై అధికారులు, మహిళలతో సమీక్షించారు. ఈ సందర్భంగా డా. మాధవీలత మాట్లాడుతూ మహిళా పాడి రైతుల పాలైన జగనన్న అమూల్ పాలవెల్లువ పధకం ఒక వరం వంటిదన్నారు. ఈ పధకం కింద జిల్లాలో తొలివిడతగా 300 గ్రామాలు ఎంపిక …

Read More »

స్విమ్మింగ్ పూల్స్ ఆధునీకరణ పనులు సత్వరమే పూర్తి చేయాలి… 

-న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్రసన్న వెంకటేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా గాంధీనగర్ నందలి సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ మరియు గురునానక్ నగర్ స్విమ్మింగ్ ఫూల్ నందు చేపట్టిన ఆధునీకరణ పనుల యొక్క పురోగతిని పరిశీలిస్తూ, పనులు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయునట్లుగా చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులలో నాణ్యత లోపించకుండా పనులు ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన …

Read More »

జగనన్న సంపూర్ణ భూమి హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోండి…

జంగారెడ్డిగూడెం,  నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ భూమి హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం అందించే ప్రయోజనాల లబ్దిని పొందాలని జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి వై వి ప్రసన్న లక్ష్మీ గురువారం ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ఐదు మండలాలు, ఒక మునిసిపాలిటీ పరిధిలోని 380 లబ్ధిదారులు రూ.31 లక్షల 87 వేల రూపాయల ను వన్ టైమ్ సెట్టిల్మెంట్ నిమిత్తం చెల్లించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో  అమలు చేస్తున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు …

Read More »

ఏపీ సీఎం కప్. 2021

-కొవ్వూరు మండల స్థాయి ఆటల పోటీలు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండలములోని అన్ని గ్రామములకు సంబంధించి ఏపీ సీఎం కప్ 2021 కొవ్వూరు లోని ఎన్టీఆర్ స్టేడియం లో డిసెంబర్ 3 వతేది శుక్రవారం ఉదయం 10. 00 గంటల నుండి నిర్వహించడం జరుగుతోందని డివిజనల్ డెవలప్మెంట్ అధికారి, కొవ్వూరు ఎంపీడీఓ పి. జగదాంబ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పోటీల్లో భాగంగా కబడ్డీ, ఖో -ఖో, వాలీబాల్, షెటిల్, బాల్ బ్యాటమేంటన్ మొదలగు క్రీడల్లో పోటీలు …

Read More »

ఆప్కో విక్రయాల పెంపుకు ప్రణాళిక : సంస్ధ ఛైర్మన్ చిల్లపల్లి

-నూతన షోరూంల కోసం స్ధలాన్వేషణ : ఆప్కో ఎండి నాగరాణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత ఉత్పత్తుల పట్ల సమాజంలో ఉన్న మక్కువ అధారంగా విక్రయాలను మరింత పెంచుకోవలసిన అవశ్యకత ఉందని ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు స్పష్టం చేసారు. విపణి ఆకాంక్షలకు అనుగుణంగా నూతన షోరూమ్ లు ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణ వేగవంతం చేయాలన్నారు. విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్స్ , షోరూం మేనేజర్లు, ఇతర అధికారులతో గురువారం రాష్ట్ర స్దాయి ప్రత్యేక …

Read More »

” అంతంచేద్దాం-అసమానతనల్ని, ఎయిడ్స్ ని, మహమ్మారులని ” …

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులలో హెచ్.ఐ.వి.తో జీవిస్తున్న వ్యక్తుల కోసం ఉచితంగా, స్నేహపూర్వక సేవలను అందిస్తున్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమమరియువైద్య విద్య శాఖ సేవలు అభినందనీయమని సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్ అన్నారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవ కార్యక్రమానికిముఖ్య అతిధిగా విచ్చేసిన శాసన సభ్యులు మాట్లాడుతూ 1988 నుండి డిసెంబర్ 1వ తారీఖుకున ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవముగా పాటించడం జరుగుతున్నదన్నారు.  ఈ ఏడాదినకు …

Read More »

‘‘భారత్‌ గౌరవ్‌’’ రైళ్లను ప్రవేశపెట్టనున్న దక్షిణ మధ్య రైల్వే…

-ప్రధాన చారిత్రాత్మక స్థలాలు, సాంస్కృతిక వారసత్వ స్థలాలు మరియు యాత్రస్థలాల మీదుగా ఇతివృత్త ఆధారిత ప్రత్యేక రైళ్లను ప్రయివేట్‌ సంస్థలు నడిపించే అవకాశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ‘‘భారత్‌ గౌరవ్‌’’ పేరిట ఇతివృత్త ఆధారిత పర్యాటక సర్క్యుట్‌ రైళ్లను ప్రవేశపెట్టడానికి ప్రతిపాదించింది. ఈ రైళ్లను నడిపించే అవకాశాన్ని ప్రయివేట్‌ సంస్థలకు రైల్వే కల్పిస్తుంది. భారత దేశ సాంస్కృతిక మరియు వారసత్వ, ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశాలు మరియు ముఖ్యమైన యాత్ర స్థలాల …

Read More »

విజ‌య‌వాడ సీపీగా కాంతి రాణా టాటా..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2004 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాంతి రాణా టాటా విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మ ఉ‍త్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అనంతపురం డీఐజీగా పని చేస్తున్న కాంతి రాణా గ‌తంలో విజయవాడ డిసిపిగా పని చేశారు.

Read More »

నియోజ‌క‌వ‌ర్గస్థాయి నుంచి స‌మ‌ర్థుల‌కే పెద్దపీట… : చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండ‌ప‌ల్లి టీడీపీ నేత‌ల‌తో ఆ పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఎన్నిక‌ల్లో పోటీచేసిన‌, పనిచేసిన కార్యకర్తలు, నేత‌ల‌కు చంద్రబాబు అభినంద‌న‌లు తెలిపారు. కొండ‌ప‌ల్లి ఎన్నిక‌ల్లో ఎంపీ కేశినేని పాత్రపై చంద్రబాబు ప్రశంస‌లు కురిపించారు. నేత‌లను, కార్యక‌ర్తల‌ను కేశినేని బాగా కోఆర్డినేట్ చేశారని కొనియాడారు. స‌మ‌ర్థులైనవారికి అవకాశం ఇవ్వక‌పోవ‌డం వ‌ల్లే.. కొన్ని చోట్ల న‌ష్టం జ‌రిగింద‌ని చంద్రబాబు అన్నారు. నేటి రాజ‌కీయాలు పూర్తిగా మారిపోయాయన్నారు. ఇక‌పై నియోజ‌క‌వ‌ర్గస్థాయి నుంచి స‌మ‌ర్థుల‌కే పెద్దపీట వేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Read More »