Breaking News

పెన్షన్ దారులకు పెన్షన్ అందించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం అజిత్ సింగ్ నగర్, డాబా కొట్లు పరిసర ప్రాంతాలని పర్యటించి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఆ ప్రాంతాల్లో గల పెన్షన్ దారుల ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్ ) ద్వారా చెక్ చేసి, వారికి పెన్షన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడి వాళ్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రతినెల పెన్షన్ వస్తుందా లేదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా, ఎంత డబ్బులు ఇస్తున్నారు లాంటి ప్రశ్నలు వాళ్ళని అడిగి, ప్రతినెలా ఇస్తున్న పెన్షన్ తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉదయం ఆరింటికల్లా పెన్షన్ పంపిణీ మొదలుపెట్టాలని, పెన్షన్ పంపిణీలో ఎటువంటి అలసత్వం వహించరాదని, పెన్షన్ దారుల ఇంటి వద్దకు వెళ్లి కచ్చితంగా పెన్షన్ అందించాలని అన్నారు. ఈ పర్యటనలో కమిషనర్ తో పాటు ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) వెంకటనారాయణ, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, విఎంసి సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *