Breaking News

Andhra Pradesh

వై.యస్.ఆర్. జీవిత సాఫల్య పురస్కారాలు…

-నగరంలో అవార్డుల ప్రధానోత్సవ వేదిక ఏర్పాట్ల పరిశీలన… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేయనున్న వైఎస్ఆర్ జీవిత సాఫల్య,వైఎస్ ఆర్ సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమ ఏర్పాట్లను నగరంలోని ఏ1 కన్వెన్షన్ హాలును గురువారం రాత్రి ప్రభుత్వ సలహాదారు జి వి డి కృష్ణమోహన్,ముఖ్యమంత్రి కార్యదర్శిలు ప్రవీణ్ ప్రకాష్,రేవు ముత్యాలరాజు, ప్రోటోకాల్ డైరెక్టర్ యం.సుబ్రహ్మణ్య రెడ్డి, జిల్లా కలెక్టరు జె.నివాస్, ఎపిటిఏ సీఈవో విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్లు డా.కె.మాధవిలత, కె.మోహన్ కుమార్,సబ్ …

Read More »

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి

-వైఎస్ ఆర్ జీవన సాఫల్య పుర్కస్కార ప్రధానోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించిన సిఎం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం రాజ్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు భారతీ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డిలు గవర్నర్ దంపతులు సుప్రవ హరిచందన్, బిశ్వ భూషణ్ హరిచందన్ లతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నవంబరు ఒకటిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ …

Read More »

పురాతన జ్ఞాన సంపద వల్లే ప్రపంచ వేదికపై విశ్వగురుగా భారతదేశం…

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -ఘనంగా శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక పరిస్థితులు, జ్ఞానం, బోధనల ఫలితంగా భారతదేశం ప్రపంచ వేదికపై విశ్వగురుగా గౌరవించబడుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గొప్ప వారసత్వం, సహజ వనరులు, సైనిక బలం ఫలితంగా భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్‌గా ఆవిర్భవించిందన్నారు. తిరుపతి వేదికగా గురువారం నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవంలో గవర్నర్ కీలకోపన్యాసం చేసారు. విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ …

Read More »

ముఖ్యమంత్రికి అభినందలు తెలిపిన దేవాదాయ శాఖ మంత్రి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి సత్రాలు, అన్నదాన సత్రాలను ఆర్యవైశ్యులకే అప్పగించే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెల్పడంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హర్షాన్ని వ్యక్తంచేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి అభినందలు తెలిపారు. గురువారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారంటూ ఆనందాన్ని వ్యక్తంచేశారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆర్యవైశ్యుల దేవాలయాల నిర్వహణ …

Read More »

1.50 కోట్లతో పైప్ లైన్ పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులపై దృష్టి కేంద్రీకరించి ఆయా సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రతినిదిగా తన ముఖ్య బాధ్యతని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పంపుల చెరువు హెడ్ వాటర్ వర్క్స్ నుండి శారదానగర్ లోని ఓవర్ హెడ్ ట్యాంక్ వరకు 1 కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో రెండున్నర …

Read More »

నగరపాలక సంస్థ APCOS ఇంటర్వ్యూలకు 401 మంది హాజరు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలోని గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ కొత్త బిల్డింగ్, ఐ.వి.ప్యాలస్ గవర్నర్ పేట మొదటి అంతస్తు మరియు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం (యోగా హాలు) లలో జరుగుతున్న APCOS ఇంటర్వ్యూలు మరియు సర్టిఫికెట్స్ వెరిఫీకేషన్ ప్రక్రియను నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ స్వయంగా పరిశీలించారు. ఇంటర్వ్యూ కొరకు వచ్చు వారికీ కల్పిస్తున్న వసతి సదుపాయాలు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేసారు. గాంధీజీ మున్సిపల్ స్కూల్ నందు చీఫ్ ఇంజనీర్ …

Read More »

గెడ్డం శ్రీను మరణం హత్యే అనే అభిప్రాయానికి కమిషన్ వొచ్చింది…

-రిటైర్డ్ ఏఎసైఐ ఎమ్.శ్యాం సుందర్ కేసు మాఫీ చేసేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది… -ఛైర్మన్ ఎమ్. విక్టర్ ప్రసాద్ తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : గెడ్డం శ్రీను వంటి మరణాలు, ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే కమిషన్ కోరుకుంటోంద ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్. సి. కమి షన్ ఛైర్మన్ ఎమ్. విక్టర్ ప్రసాద్ పే ర్కొన్నారు. గురువారం మలకపల్లి లో గెడ్డం శ్రీను మృతి పై ప్రజల నుంచి ఎస్సి కమిషన్ సభ్యులు చెల్లమ్ ఆనంద్ ప్రకాష్, బసవరాజులతో కలిసి ఆ …

Read More »

పౌష్టికాహారాన్ని అందిస్తూ తల్లిబిడ్డల సంరక్షణకు సేవలందిస్తున్న అంగన్ వాడీ సిబ్బంది సేవలు అభినందనీయం…

-యంపీడీవో గద్దే పుష్పరాణి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిబిడ్డల సంరక్షణకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రజల ఆరోగ్యవంతమైన జీవన విధానానికి అంగన్ వాడీ కేంద్రాల సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని యంపీడీవో గద్దే పుష్పరాణి అన్నారు. స్థానిక ఎన్జీవో హోమ్ లో మహిళాఅభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆమె ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లి బిడ్డలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ వారిని సంరక్షించే భాద్యతను అంగన్ …

Read More »

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బాణసంచా దుకాణాలు ఏర్పాటు చెయ్యాలి…

-లైసెన్సులేకుండా బాణ సంచా దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం… -బైపాస్ రోడ్ నందు గల ఖాలీ స్థలంలో బాణసంచా దుకాణాలకు అనుమతి… -ఆర్డీవో శ్రీనుకుమార్ -డిఎస్పీ సత్యానందం గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా దుకాణాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులకు సూచించారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో దీపావళి బాణసంచా దుకాణాలు ఏర్పాటు, లైసెన్సులు తదితర అంశాలపై స్థానిక డిఎస్పీ ఎన్.సత్యానందం, పట్టణ పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, స్థానిక దుకాణదారుల యజమానులతో అర్డీవో …

Read More »

సామాన్యునికి మెరుగైన వైద్యం అందించటమే ప్రభుత్వ లక్ష్యం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద తీసుకుని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందాలని ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే దాదాపు 2 కోట్ల 40 లక్షల రూపాయలతో అర్బన్ హెల్త్ క్లినిక్స్ ని నిర్మిస్తున్నారు అని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గంలోని 3,11వ డివిజన్ డివిజన్లో గంగిరెద్దుల దెబ్బ మరియు …

Read More »