Breaking News

Telangana

గోపాలపురం మండలస్థాయి వైసీపీ సమావేశం నిర్వహించిన హోంమంత్రి తానేటి వనిత

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం వ్యాప్తంగా అందరూ జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గోపాలపురం స్థానిక కేఎస్ రెడ్డి కళ్యాణ మండపంలో గోపాలపురం మండల స్థాయి వైఎస్సార్సీపీ విస్తృత సమావేశం హోంమంత్రి అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో 2024 ఎన్నికల్లో వైసీపీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గ ఆడపడుచు తానేటి వనితను గెలిపించుకుని …

Read More »

న‌గ‌ర‌పాల‌క సంస్థ కార్యాల‌యంలో ఘ‌నంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు

-భారత రాజ్యాంగం పట్ల ప్ర‌తి పౌరుడు అవగాహన కలిగియుండాలి – కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ -నగరాన్ని మరింతగా అభివృద్ధి పరచుకోవాలి – నగర మేయర్ రాయన బ్యాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలలో కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, నగరపాలక సంస్థ జెండాను న‌గ‌ర మేయ‌ర్ రాయన భాగ్య‌ల‌క్ష్మి ఎగురవేసారు. ముందుగా గాంధీజీ మరియు భారత రాజ్యంగ …

Read More »

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : పోతిన వెంకట మహేష్

-స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం -అప్పులు అవినీతి అరాచకాలు ఏపీలో జగన్ రెడ్డి రాసిన రాజ్యాంగం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం వద్ద 75 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పశ్చిమ నియోజికవర్గ ఇంచార్జ్ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్  జండా వందనం చేసారు . ఈ సందర్భంగా మహేష్ గారు మాట్లాడుతూ నగర ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రాజ్యాంగం …

Read More »

రాజ్యాంగ విలువల పరిరక్షణకు కృషి

-జర్నలిస్టులకు చందు జనార్ధన్ పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర దినోత్సవ వేడుక శుక్రవారం  ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద ఘనంగా నిర్వహించారు . ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు . ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విజయవాడ యూనిట్, ప్రెస్ క్లబ్ కార్యవర్గాలను అభినందించారు .డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రచించిన భారత రాజ్యాంగంలో పొందుపర్చిన ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల …

Read More »

విజయ కిలాద్రి దివ్య క్షేత్రం ఫై గణతంత్ర దినోత్సవ వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయ కిలాద్రి దివ్య క్షేత్రం ఫై జనవరి 26 “75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు” అంగరంగ వైభవంగా జరిగాయి. ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమం జరిగినది. దేశ ప్రగతికి రాబోవు తరాలు ఎంతో ముఖ్యమైనవో , దేశ భక్తి ప్రతి భారతీయుని మనసులో చిరస్థాయిగా నిలవాలని, ఏ దేశమేగినా ఎందుకాలిడేనా మన దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని శ్రీమాన్ మధుసూదనాచార్య స్వామి విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో …

Read More »

ఢిల్లీ  పబ్లిక్‌ స్కూల్‌ విజయవాడలో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ  పబ్లిక్‌ స్కూల్‌ విజయవాడలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముందుగా పాఠశాల డైరెక్టర్‌ కడియాల ప్రవీణ్‌కుమార్‌ జాతీయ జెండాను ఎగురవేసారు. అందరూ జాతీయ గీతాన్ని ఆలపించారు. సోషల్‌ హెడ్‌ ఆఫ్‌ ద డిపార్ట్మెంట్‌ జాన్‌ గణతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని గురించి ఉపన్యాసించారు. భిన్నత్వంలో ఏకత్వం లాగా జాతీయ గీతాలను పిల్లలు ఆలపించి పాఠశాల ఆవరణం మొత్తం దేశభక్తితో నింపారు. ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనలు మరియు అందరిని ఆకట్టుకునే జిమ్నాస్టిక్‌ చర్యలతో విద్యార్థుల …

Read More »

జాతీయస్థాయిలో థర్డ్ ఫ్రంట్ నిర్మాణం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ప్రజలకు 75 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐపీసీ రాష్ట్ర అధ్యక్షులు యుఎస్‌ఎస్‌ఎ థర్డ్‌ ఫ్రంట్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు దేవరపల్లి మహేష్‌ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. యూనియన్‌ స్టేట్స్‌ ఆఫ్‌ సోషలిస్ట్‌ అలియాన్స్‌ థర్డ్‌ ఫ్రంట్‌ నిర్మాణాన్ని జాతీయ స్థాయిలో చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని అందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లేలా కార్యాచరణను కూడా సిద్ధం చేస్తున్నామని ఆయన తెలియజేశారు. థర్డ్‌ ఫ్రంట్‌ ప్రణాళిక గణతంత్ర దినోత్సవం రోజున విడుదల చేయాలని …

Read More »

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు, ముఖ్య నాయకులు, జన …

Read More »

‘పద్మవిభూషణ్’ పురస్కారాలకు ఎంపికైన చిరంజీవికి, వెంకయ్య నాయుడుకి అభినందనలు… : పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న అన్నయ్య చిరంజీవి ని ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య చిరంజీవి చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా చిరంజీవి కి …

Read More »

సబ్సిడీ ధరలకు గోధుమలు అమ్మకాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బహిరంగ మార్కెట్‌లో గోధుమలు ధరలను స్థిరీకరించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్-డొమెస్టిక్ ద్వారా, భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియుప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ నిర్ణయించిన సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను (గోధుమలను) ఇ-వేలం ద్వారా అందిస్తోంది. ఈ పథకం కింద, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇ-వేలం ద్వారా ప్రాసెసర్‌లు/అట్టా చక్కి/ఫ్లోర్ మిల్లర్లకు మాత్రమే గోధుమ ఉత్పత్తులను అందిస్తుంది (వ్యాపారులు / పెద్దమొత్తంలో కొనుగోలుదారులు అనుమతించబడరు). ఒకే ఇ-వేలంలో అన్ని …

Read More »