Breaking News

న‌గ‌ర‌పాల‌క సంస్థ కార్యాల‌యంలో ఘ‌నంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు

-భారత రాజ్యాంగం పట్ల ప్ర‌తి పౌరుడు అవగాహన కలిగియుండాలి – కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్
-నగరాన్ని మరింతగా అభివృద్ధి పరచుకోవాలి – నగర మేయర్ రాయన బ్యాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలలో కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, నగరపాలక సంస్థ జెండాను న‌గ‌ర మేయ‌ర్ రాయన భాగ్య‌ల‌క్ష్మి ఎగురవేసారు. ముందుగా గాంధీజీ మరియు భారత రాజ్యంగ రూపకర్త డా.బి.ఆర్ అంబేద్కర్ గార్ల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎన్.సి.సి. విద్యార్ధుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.

నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ ముందుగా ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత రాజ్యాగం అన్నింటి కన్నా ఉన్నతమైనదని, దీనిని లిఖించుటలో ముఖ్య పాత్ర పోషించిన డా.బి,ఆర్.అంబేద్కర్ వంటి మహానుభావులు చిరస్మరణీయులు అని, భారత దేశ పౌరునిగా మనకు గల హక్కులను భాద్యతలను పొందుపరచుట జరిగిందని, ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగియుండాలని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి తెలియపరచడానికి విజయవాడ వారు ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకోదగ్గ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం మ్యూజియం, ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సందర్శించాల్సిన ప్రదేశమన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2023 లో ఆరో ర్యాంకు రావడం ఎంతో గొప్ప విషయమని, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రోగ్రాం,  మేయర్ రాయన భాగ్యలక్ష్మి సహకారాలతో కొత్త ఆలోచనలతో కొత్త ఒరవడితో స్వచ్ఛ సర్వేక్షన్ లో అవార్డుని సాధించమన్నారు. నగర ప్రజల సహకారంతో అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికులందరి కృషితో నగరాన్ని అభివృద్ధి పరచుట జరిగిందని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన నగరంలో పారిశుధ్య నిర్వహణలో నిరంతరం ప్రజలతో మమేకమై శానిటరీ సిబ్బంది నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుటలో కృషి చేస్తున్నారని పేర్కొంటు పారిశుధ్య సిబ్బందికి అభినందలు తెలియజేసారు. రాబోవు రోజులలో కూడా మన నగరం జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాదించే దిశగా ప్రతి ఒక్కరి సమిష్టి కృషితో అభివృద్ది పరచుకోవాలని ఆశాభావం వ్యక్తపరిచారు.

ఈ సందర్భంలో మేయ‌ర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్వేచ్చ స్వతంత్రం సాదించుటకై ప్రాణ త్యాగాలను చేసిన ఎందరో మహానుభావులైన సమరయోధులను స్మరించుకొనుచూ దేశానికి వారు చేసిన త్యాగాలను నేటి యువతకు తెలియజేస్థూ, ప్రజలలో దేశ భక్తిని పెంపొందించుకొని స్వాతంత్య్ర‌ ఉద్యమ స్పూర్తితో ముందుకు పయనించాలని అన్నారు.
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులలో మూడుసార్లు టాప్ టెన్ లో విజయవాడ నగరపాలక సంస్థ ఉండటం, మెట్రో నగరాలకు దీటుగా అవార్డుని సాధించడం ఎంతో గొప్ప విషయమన్నారు. దానికి ముఖ్య కారణం మన అధికారులు ప్రజలు సిబ్బంది అన్నారు. ఘన చరిత్ర కలిగిన విజయవాడ నగరం రాబోయే కాలంలో కూడా అందరూ కలిసి సమిష్టి కృషితో ముందుకు తీసుకువెళ్లాలి అన్నారు. నగరం అభివృద్ధి చెందిందని. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  సహకారంతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చెందుతుందని రాభోవు రోజులలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికులు అందరు ఒకే కుటుంబములా సమిష్టి కృషితో అనేక అవార్డులను సాధించుట జరిగిందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరాన్ని మరింత అభివృద్ధి పరచుకొని ప్రజలకు ఉత్తమ సేవలను అందించాలని ఆకాంక్షించారు.

న‌గ‌ర పాల‌క సంస్థ నందు విధి నిర్వహణలో వివిధ విభాగములలో 13 సఖదిపతులు కాకుండా ఉత్తమ సేవలు అందించిన 99, మంది అధికారులు, సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికులకు ప్రశంసాపత్రములను అందించారు. మరియు 15 మంది సిబ్బంది ఎన్టీఆర్ జిల్లా స్థాయి లో కలెక్టర్ యస్.డిల్లి రావు గారి చేతుల మీదుగా అందుకోన్నునారు. విజయవాడ నగరపాలక సంస్థ యం.కె బేగ్ స్కూల్, పటమట వి.యం.సి స్కూల్, గాంధీజీ మున్సిపల్ హై స్కూల్, నుండి విద్యార్ధులు ఎన్.సి.సి మార్చ్ పాస్ట్ చేసి జాతీయ గీతాలను ఆలపించారు.

డెస్క్టాపు క్యాలెండరు ఆవిష్కరించిన నగర మేయర్
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని, విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధి పరిచిన విజయవాడ నగర అందమైన చిత్రాలతో కూడిన డెస్క్ టాప్ క్యాలెండర్ ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో డిప్యూటి మేయ‌ర్ బెల్లం దుర్గ‌, కార్పొరేటర్లు బొయి స‌త్య‌బాబు అదనపు కమిషనర్ (జనరల్) కె. శకుంతల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, చీఫ్ ఇంజనీర్ య, ప్రభాకర్, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి రత్నావళి, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ)డి వెంకట లక్ష్మి, ఇతర అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *