Breaking News

Telangana

అంగరంగ వైభవంగా ముగిసిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ నగరపాలక సంస్థ ఆధ్వ‌ర్యంలో విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర కార్య‌క్ర‌మాన్ని శ‌నివారం జింఖానా గ్రౌండ్స్ గాంధీనగర్ లో నిర్వహించారు. న‌వ‌భార‌త నిర్మాణంలో అమృత‌కాలం విశిష్ట‌త‌, విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర ఔన్న‌త్యంపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ వ‌ర్చువ‌ల్‌గా అందించిన‌ సందేశాన్ని ప్ర‌జ‌లు తిల‌కించారు. ప‌దేళ్ల‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలో కేంద్ర ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌ను తెలిపే వీడియోను ప్ర‌ద‌ర్శించారు. మేరీ క‌హానీ మేరీ జుబానీలో భాగంగా వివిధ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు ప‌థ‌కాల ప్ర‌యోజ‌నంపై త‌మ మ‌నోగ‌తాన్ని ఆవిష్క‌రించారు, …

Read More »

సీఎం  వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల‌మీదుగా డా. బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జ‌న‌వ‌రి 19న నిర్వహించే కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తిచేసే సిద్ధం చేస్తున్నామని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జి జయలక్ష్మి కి వివరించారు. సామాజిక న్యాయస్ఫూర్తికి ప్ర‌తిరూపమైన 125 అడుగుల డా. బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం, స్మృతివ‌నం ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 19న జ‌ర‌గ‌ జరగనున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను శనివారం సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయలక్ష్మి …

Read More »

అంబేద్కర్ స్మృతివనం పరిశీలన

-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 19, 2024 నా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతివనం శనివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ మాట్లాడుతూ జనవరి 19, 2024న ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం విజయవాడ నగరంలో ఒక మైలురాయిగా మారబోతోందని, ఇప్పటికే విజయవాడ నగర ప్రజలకు …

Read More »

రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలో తాత్కాలిక స్ట్రాంగ్ రూం కోసం పరిధిలో న్యాక్ అదనపు భవనం పరిశీలన

– కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి నియోజక వర్గ పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి పంపిణీ, ఈ వి ఎం లు, అనుబంధ యూనిట్స్ భద్రపరిచేందుకు ముందస్తు ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ , రూరల్ తహశీల్దార్ పి. చిన్నారావు తో కలిసి కలెక్టరేట్ ఆవరణలో ఉన్న న్యాక్ అనుబంధ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

పోస్టల్ బ్యాలెట్, ఆబ్సెంటీ ఓటర్ల ఓటింగ్ ప్రక్రియ పై అవగాహన

-ఏ ఎల్ ఎమ్ టి లు శిక్షణ విధుల్లో అత్యంత బాధ్యత కలిగి ఉండాలి -ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పునశ్చరణ చేసుకోవాలి -జిల్లా ఎన్నికల అధికారి /కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగం సాధ్యమైనంత ఎక్కువగా సద్వినియోగం చేసుకునే దిశలో పోస్టల్ బ్యాలెట్, ఆబ్సెంటీ ఓటర్ల విషయం అత్యంత కీలకమైన పాత్ర పోషించాలని, ఆమేరకు సంబంధిత సిబ్బందికి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పూర్తిగా అర్థం అయ్యేలా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ / జిల్లా …

Read More »

అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం సైన్స్ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించే క్రమంలో సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. శుక్రవారం సాయంత్రం సైన్స్ సెంటర్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి సైన్స్ సెంటర్ ప్రాజెక్ట్ అధికారి జే డి రావు సైన్స్ సెంటర్ కి చెందిన పలు అంశాలను తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె . మాధవీలత మాట్లాడుతూ స్థానికంగా పేర్కొన్న …

Read More »

సిలిండర్ల వినియోగములో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డోమెస్టిక్(గృహ) సిలిండర్ల వినియోగములో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎ.సురేష్ బాబు అన్నారు.. శుక్రవారం ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎ.సురేష్ బాబు ఆద్వర్యంలో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం పట్టణములోని హోటల్స్ ఆకస్మి తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలోని రామ్ నగర్ లో గల హోటల్ దేవి టిఫిన్స్ సెంటర్ …

Read More »

ప్రపంచ దేశాలకు ఆదర్శనీయుడు అంబేద్కర్

-సామాజిక సమతా సంకల్పం మానవహారం -అంబేద్కర్ స్ఫూర్తితో  లో పాల్గొన్న నగర ప్రజలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కుల మతాలకు అతీతంగా అన్నివర్గాల వారి హక్కుల కోసం, అభ్యున్నతి కోసం పాటుపడిన అంబేద్కర్ అందరివాడని జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారి   యం. సందీప్ అన్నారు. విజయవాడలో ఈనెల 19న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ, స్మృతివనం ప్రారంభిస్తున్న సందర్భంగా సామాజిక సమతా సంకల్పం  జనవరి 9 నుంచి 18వ …

Read More »

నిరుద్యోగ యువతకు ఆన్లైన్ ద్వారా సేవలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగ యువతకు ఆన్లైన్ ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఉపాధి మరియు శిక్షణ కోసం రూపొందించిన గొడప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లా కు చెందిన నిరుద్యోగ యువతకు, అభ్యర్థులకు onlineలో సేవలు, ఎంప్లాయి మెంట్ సేవలను వెబ్ సైట్ employment. ap.gov.in ద్వారా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం, ద్వారా …

Read More »

సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ రోజున ఒక మంచి కార్యక్రమం చేపట్టనున్నాం

-జనవరి 19 న కులగణన కు శ్రీకారం – మంత్రి వేణుగోపాల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన కార్యక్రమం ప్రారంభించటం జరుగుతుందని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వేణుగోపాలకృష్ణ …

Read More »