Breaking News

ప్రపంచ దేశాలకు ఆదర్శనీయుడు అంబేద్కర్

-సామాజిక సమతా సంకల్పం మానవహారం
-అంబేద్కర్ స్ఫూర్తితో  లో పాల్గొన్న నగర ప్రజలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కుల మతాలకు అతీతంగా అన్నివర్గాల వారి హక్కుల కోసం, అభ్యున్నతి కోసం పాటుపడిన అంబేద్కర్ అందరివాడని జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారి   యం. సందీప్ అన్నారు. విజయవాడలో ఈనెల 19న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ, స్మృతివనం ప్రారంభిస్తున్న సందర్భంగా సామాజిక సమతా సంకల్పం  జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా .. శనివారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా    ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారి   యం. సందీప్  మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  స్ఫూర్తిదాయకంగా  భవిష్యత్ తరాలకు వారి జీవిత గాధను  తెలియజేసే విధంగా మానవహారం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లాలాచెరువు మున్సిపాల్ హైస్కూల్ నందు 10వ తరగతి చదువుచున్న విద్యార్థి చిరంచివి యస్, దనప్ కుమార్ అనే విద్యార్థి డా.బి.ఆర్. అంబేడ్కర్ వేశధారణ కార్యాక్రమానికి అకర్షనగా నిలిచింది. మరియు మున్సిపల్ కార్యాలయములో పనిచేయుచున్న సిబ్బంది కోరుకొండ మురళీ కృష్ణ కుమారై  కుమారి సంకల్పిత నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగినదన్నారు. కార్యక్రమంలో  దళిత నాయకులు  దారా యేసు రత్నం, కోరుకొండ చిరంజీవి, తాళ్లురి బాబు రాజెంద్ర ప్రసాదు, .పి. ప్రశాంతి, జార్జ్ అంటోని,యల్.వి. ప్రసాద్, దొండపాటి సుధాకర్, కె. కె. సంజీవరావు. జి. అనంతరావు, కె.వి.రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *