Daily Archives: August 1, 2024

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీలను ఎ,బి,సి,డిలుగా వర్గీకరించాలన్నదే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) గతం నుండీ చెబుతోంది. సిపిఐ జాతీయ స్థాయిలో ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏకాభిప్రాయంతో ఉంది. ఇన్నేళ్ల తదుపరి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపట్ల సిపిఐ హర్షం వ్యక్తం చేస్తోంది. దశాబ్దాల …

Read More »

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ జి.సృజన, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, విజయవాడ మున్సిపల్ …

Read More »

త‌ల్లిపాలు బిడ్డ‌కు ఆరోగ్య ప్ర‌దాయిని

– ఆగ‌స్టు 1న ప్రారంభ‌మైన ప్ర‌పంచ త‌ల్లిపాల వారోత్స‌వాలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిపాలు బిడ్డకు ఆరోగ్య ప్రదాయిని అని.. బిడ్డ‌కు తల్లిపాల‌ను మించిన శ్రేయస్కరం మ‌రొక‌టి లేద‌ని పేర్కొంటూ గురువారం ప్రారంభ‌మైన ప్ర‌పంచ త‌ల్లిపాల వారోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అన్నారు. గురువారం ప్ర‌పంచ త‌ల్లిపాల వారోత్స‌వాలు (ఆగ‌స్టు 1-7) ప్రారంభ‌మైన సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న మాట్లాడుతూ అంత‌రాల‌ను పూరించి త‌ల్లిపాల సంస్కృతిని ప్రోత్స‌హిద్దాం.. ఇతివృత్తంతో …

Read More »

ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ పై అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్ఆర్ఆర్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డ్రగ్ రహిత ఆంధ్ర ప్రదేశ్ పైన అవగాహన సదస్సును స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విజయవాడ వెస్ట్ వారు ఎస్ఆర్ఆర్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి డ్రగ్ రహిత ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంతో, యువత మేలుకో, భవితను మలుచుకో, డ్రగ్స్ ను వదులుకో, డ్రగ్స్ రహిత సమాజం-సంక్షేమానికి సాంకేతం అని అసిస్టెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో …

Read More »

ప్ర‌త్యేక కౌంట‌ర్ల‌లో స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లో నాణ్య‌మైన స‌రుకులు

-రైతు బ‌జార్లు, పెద్ద సంస్థాగ‌త రిటైల్ దుకాణాల్లోనూ అందుబాటు -జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రివ‌ర్యుల ఆదేశాల‌ను అనుస‌రించి జిల్లాలో రైతుబ‌జార్లు, పెద్ద సంస్థాగ‌త రిటైల్ దుకాణాల్లో స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లో నాణ్య‌మైన నిత్యావ‌స‌ర స‌రుకులు అందుబాటులో ఉన్న‌ట్లు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉషోద‌య‌, మెట్రో, రిల‌య‌న్స్‌, డీమార్ట్ త‌దిత‌ర పెద్ద రిటైల్ దుకాణాల్లో ప్ర‌త్యేక కౌంట‌ర్ల ద్వారా స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు …

Read More »

ఉపాధి కొరకు గల్ఫ్‌ వెళ్ళే వారికి ముందస్తు ప్రయాణ అవగాహన కల్పించండి…

-ఓంకాప్‌ జియం బిఆర్‌ క్రాంతికుమారి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి కొరకు గల్ఫ్‌ దేశాలకు వెళ్ళేవారికి ప్రయాణ జాగ్రత్తలు ఉద్యోగ మెళుకవులు పై శిక్షణ కల్పించి గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా మాత్రమే గల్ఫ్‌ దేశాలలో ఉద్యోగ అవకాశాలు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ బిఆర్‌ క్రాంతి కుమారి తెలిపారు. ఉపాధి అవకాశలు పొందేందుకు గల్ఫ్‌ వర్క్‌ర్లకు అందించాల్సిన శిక్షణపై ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ బిఆర్‌ క్రాంతి కుమారి …

Read More »

ఆత్మీయ ప‌ల‌క‌రింపుతో ఎన్‌టీఆర్ భ‌రోసా

-పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న -క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌, శాస‌న‌స‌భ్యులు గ‌ద్దె రామ‌మోహ‌న్‌ -ఓ మంచి కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్న క‌లెక్ట‌ర్‌ -పేద‌ల‌ప‌ట్ల నిజ‌మైన ప్రేమ‌తో ప్ర‌భుత్వం ప‌నిచేస్తోందన్న శాస‌న‌స‌భ్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ల‌బ్ధిదారుల‌ను ఆత్మీయంగా ప‌ల‌క‌రిస్తూ వారి ఇళ్ల‌వద్ద‌కే వెళ్లి ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల మొత్తాన్ని అందించే కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు గ‌ద్దె రామ‌మోహ‌న్.. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి పాల్గొన్నారు. విజ‌య‌వాడ య‌న‌మ‌ల‌కుదురు రోడ్డు, కృష్ణాన‌గ‌ర్‌లో గురువారం …

Read More »

బాల్య వివాహాలను ఉపేక్షించేది లేదు..

-టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి సమాచారం అందించండి, వివరాలు గోప్యంగా ఉంచుతాం .. జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బాల్యవివాహాలను ఉపేక్షించేది లేదని, జిల్లాలో బాల్య వివాహాలు జరిగితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఐసిడిఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల్యవివాహాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో …

Read More »

రైతు బజార్లలో కందిపప్పు బియ్యం ధరల తగ్గింపు

-దేశవాళీ కందిపప్పు కేజీ రు. 160 నుండి 150 కి తగ్గింపు -స్టీమ్ రైస్ కేజీ రు.49 నుండి 48 కి , రా రైస్ కేజీ రు.48 నుండి 47 కు తగ్గింపు -వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి -జాయింట్ కలెక్టర్ మచిలీపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : పెరుగుతున్న నిత్యావసరాల ధరల నియంత్రణలో భాగంగా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రొత్త ప్రభుత్వం అధికారంలోకి …

Read More »

రక్తహీనత నివారణకు చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గర్భిణీ స్త్రీలు, కౌమార బాలికల్లో రక్తహీనత (అనీమియా) నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమై అమలు చేస్తున్న వివిధ పథకాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రస్తుత పరిస్థితుల్లో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం …

Read More »