Breaking News

ఇంద్రకీలాద్రి పై భోగి పండ్లు కార్యక్రమం

ఇంద్రకీలాద్రి,  నేటి పత్రిక ప్రజావార్త :
భోగి సందర్బంగా సోమ‌వారం దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణం నందు బొమ్మల కొలువు దగ్గరలో విద్యార్థినులచే సంధ్య గొబ్బెమ్మలు ఏర్పాటు చేసి, పూజలు నిర్వర్తించి, గొబ్బి పాటలు పాడి, నృత్యం చేసి, చిన్నారులకు మరియు విధ్యార్థినులకు భోగి పండ్లు పోయు కార్యక్రమం శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది. అనంతరం వీరికి ప్రసాదం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, ఆలయ సిబ్బంది, అర్చక సిబ్బంది,కంచి కామకోటి పీఠం వారి సంప్రదాయ పాఠశాల సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు, చిన్నారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *