Daily Archives: August 1, 2024

కుశల ప్రశ్నలతో వృద్ధులకు పింఛన్లు అందజేసిన జిల్లా కలెక్టర్

పెడన, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఉదయం పెడనలో 16వ వార్డు మచిలీపట్నం రోడ్డు సచివాలయం పరిధిలో వృద్ధురాలు పిచ్చుక మల్లికాంబ గృహం సందర్శించి, ఆమె ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు అడిగి ఆమెకు 4000 రూపాయల వృద్ధాప్య పింఛను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ఆగస్టు నెలకు 2,40,939 మంది లబ్ధిదారులకు రూ 102.16 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఇళ్ల వద్ద అందజేయుటకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. …

Read More »

మచిలీపట్నం, చిన్నాపురంలో పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం మచిలీపట్నంలో 49వ డివిజన్ నారాయణపురం యానాదుల కాలనీలో, బందరు మండలం చిన్నాపురం గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక నారాయణపురంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక కష్టాలున్నా పేదలకు ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. పేదల పెన్నిది, ఆత్మ బంధువు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని మంత్రి అన్నారు. చిన్నాపురంలో …

Read More »

ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం (గిలకలదిండి), నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఉదయం గిలకలదిండిలో రూపుదిద్దుకుంటున్న ఫిషింగ్ హార్బర్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సంబంధించిన పురోగతి పనుల వివరాలను ఆయన సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రూ. 422 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో డ్రెడ్జింగ్, నార్త్, సౌత్ బ్రేక్ వాటర్ పనులు చురుకుగా సాగుతున్నాయని, మొత్తం మీద 50 శాతం మేర పనులు పూర్తయినట్లు ఆంధ్రప్రదేశ్ మారిటైం ఇన్ఫ్రా …

Read More »

తల్లిపాలే బిడ్డకు అమృతం మరియు ప్రథమటీకా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వరకు అవగాహన కార్యక్రమ ప్రారంభ సందర్భంగా నేటి ఉదయం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు  జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ తల్లిపాల వారోత్సవాలకు సంబంధించిన గోడ ప్రతులను, బ్యానర్లను, కరపత్రములను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ ,డాక్టర్ జి. గీతాబాయి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని ,డాక్టర్ శ్రావణ్ కుమార్ జిల్లా కోఆర్డినేటర్ ఫర్ ఆరోగ్య …

Read More »

ఆధునిక చర్యలతో దోమల నియంత్రణ

-కాలువలను ట్రక్సర్ ద్వారా పరిశుభ్రపరచుట, డ్రోన్ ద్వారా యం.ఎల్ ఆయిల్ స్ప్రే -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దోమల వల్ల కలుగు వ్యాధులను నివారించడానికి దోమల లార్వను కాలువల్లో నియంత్రించేందుకు ఆధునిక పద్ధతులను అనుసరించాలని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం రామకృష్ణాపురంలోని, బుడమేరు కాలువ పరిశీలిస్తూ, నిరంతరం వ్యర్ధాలు పేరుపోకుండా ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగించేందుకు ట్రక్సర్ మెషిన్ ద్వారా …

Read More »

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీల పరిశీలన

-రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఐఏఎస్ గురువారం 30వ డివిజన్, రామకృష్ణాపురం మధ్య కట్ట నందు తానే స్వయంగా లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకొని, వారితో మాట్లాడి, ప్రతి నెల పెన్షన్ వస్తుందా లేదా? ఇంటి వద్దనే పెన్షన్ ఇస్తున్నారా లేదా? ఎంత పెన్షన్ ఇస్తున్నారు? అని లబ్ధిదారులను …

Read More »