-పుట్టిన బిడ్డకు చనుబాలుకు మించిన ఔషదం మరోకటి లేదు.. -తల్లిదండ్రులు నమ్మకం కలిగేలా అంగన్‌వాడీలను తీర్చిదిద్ధుతాం.. -ప్రైవేట్ ప్లేస్కూల్స్‌కి ధీటుగా అంగన్‌వాడీలలో మౌలిక వసతులు -జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పుట్టిన నాటి నుండి తల్లి పాలుఇవ్వడం బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అని చనుబాలుకు అవసరమైన ఔషదం మరోకటి లేదని తల్లిపాలుపై అవగాహన కల్పించేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రైవేట్ ప్లేస్కూల్స్‌కి ధీటుగా మౌలిక వసతులు కల్పించి ప్రతి …
Read More »Daily Archives: August 2, 2024
సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన కలక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాల్లో మౌలిక వసతులు, అడ్మిషన్లు, అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాలు, సమస్యలపై ఆయన సంబంధిత అధికారులతో చర్చించారు. …
Read More »మహనీయుల జీవితాలు మనకు ఆదర్శం కావాలి -కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమరయోధుడు కీ.శే. పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య మన జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, జాతీయ జెండా రూపశిల్పిగా పింగళి వెంకయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో ఇన్చార్జి శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
Read More »మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను వసూళ్లు, శానిటేషన్ మెరుగుపరచాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను వసూళ్లు, శానిటేషన్ మెరుగుపరచాలని, పట్టణాభివృద్ధి పథకాల కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో మినీ కాన్ఫరెన్స్ హాలులో పంచాయతీరాజ్, పురపాలక పట్టణాభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు అన్ని మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను వసూళ్లు మున్సిపాలిటీల వారీగా సమీక్షించారు. పట్టణాభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర పథకాల కింద, అమృత్ స్కీం క్రింద చేపట్టిన …
Read More »విద్యాంజలి పోర్టల్ లో పాఠశాలకు అవసరమైన సేవలు అప్లోడ్ చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాంజలి పోర్టల్ లో పాఠశాలకు అవసరమైన సేవలు అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పనుల పురోగతి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాంజలి పోర్టల్ లో జిల్లాలోని అన్ని పాఠశాలలకు సంబంధించిన ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రధానోపాధ్యాయుల ద్వారా అప్లోడ్ చేయాలన్నారు. …
Read More »గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ ఎంహెచ్ఓ మధుసూదన్, మేనేజర్ ప్రసాద్ లతో కలిసి జిఎంసి ప్రధాన కార్యాలయాన్నిపరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిఎంసి ప్రధాన కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచాలని, వినియోగంలో లేని బీరువాలు, ఇతర సామగ్రిని తొలగించాలన్నారు. వ్యర్ధాలను ఆఫీస్ పరిసరాల్లో వేయకుండా డస్ట్ బిన్ లను ఏర్పాటు చేయాలన్నారు. …
Read More »ఔట్ ఫాల్ డ్రైన్లలో మురుగునీరు నిల్వకుండా పక్కాగా చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఔట్ ఫాల్ డ్రైన్లలో మురుగునీరు నిల్వకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా సిల్ట్ ఉంటే సదరు కాంట్రక్టరే తీసేలా ఇంజినీరింగ్ అధికారులు సమన్వయం చేసుకోవాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి లక్ష్మీపురం, జిటి రోడ్, సంపత నగర్, నల్లచెరువు ప్రాంతాల్లో నగరానికి ప్రధాన ఔట్ ఫాల్ డ్రైన్ అయిన పీకలవాగుని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …
Read More »ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందేందుకు గిరిజన యువతి యువకులకు ఐ టి డీ ఏ రంపచోడవరం లో శిక్షణ
-ఆగస్ట్ 3 నుంచి ఆగష్టు,9 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం -జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జ్యోతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బిఇడి/డిఇడి మరియు టెట్ పాసైన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గిరిజన యువతి యువకులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందేందుకు ఐ టి డీ ఏ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె యన్ జ్యోతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం ఐటీడీఏ ఏడు మండలాల్లోని, కాకినాడ …
Read More »జిల్లాలో 104 ప్రత్యేక కౌంటర్ల ద్వారా తగ్గింపు ధరకు బియ్యం, కంది పప్పు
-ఇంఛార్జి జెసి నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం వారు వినియోగదారులకు తక్కువ ధరకు బియ్యం మరియు కందిపప్పు అందించాలనే ఉద్దేశ్యంతో రైతు బజార్లు, స్పెషల్ కౌంటర్లు యందు మరోసారి కందిపప్పు మరియు బియ్యం ధరలు తగ్గించి యున్నారు. “సరసమైన ధరలలో నాణ్యమైన సరుకుల అమ్మకం” అను బ్యానర్ అన్ని రైతుబజార్లు మరియు స్పెషల్ కౌంటర్లు యందు ప్రదర్శించవలసిందిగా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మిల్లర్లతో ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ సమావేశం …
Read More »అగ్రికల్చరల్ స్టాటిస్టికల్ సర్వే పై అర్హత పరీక్ష కోసం శిక్షణ
-ఆగస్టు 2 నుంచి 8వ తేదీ వరకు శిక్షణ తరగతులు -హాజరైన రెవిన్యూ జూనియర్ అసిస్టెంట్స్, గ్రేడ్-1 గ్రామ రెవిన్యూ అధికారులు -సిపివో ఎల్. అప్పలకొండ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని రెవిన్యూ శాఖలో గల జూనియర్ అసిస్టెంట్స్, గ్రేడ్-1 గ్రామ రెవిన్యూ అధికారులకు పంట కోత అంచనా సర్వే మరియు వ్యవసాయ గణన అతయ పరీక్ష లకోసం ముందస్తు అవగాహన అంశములపై ఆగస్టు 2 నుంచి 8వ తేదీ వరకు శిక్షణ నిర్వహిస్తున్నామని జిల్లా అర్థ గణాంక అధికారి (సి.పి.ఓ) …
Read More »