Daily Archives: August 3, 2024

పరిశుభ్రంగా ఉంచడంలో ఆదర్శంగా ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్నిపరిశుభ్రంగా ఉంచడంలో ఆదర్శంగా ఉండాలని, నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ అధికారులను ఆదేశించారు. శనివారం డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, మేనేజర్ ప్రసాద్ లతో కలిసి జిఎంసి ప్రధాన కార్యాలయాన్ని, పార్కింగ్ పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిఎంసి ప్రధాన కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ఇతర కార్యాలయాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. ఇప్పటికే వినియోగంలో లేని బీరువాలు, బల్లలు సూపర్వైజరి అధికారుల పర్యవేక్షణలో వెహికిల్ …

Read More »

త్రాగునీటి సరఫరా సమయంలో శ్యాంపిల్స్ తప్పనిసరిగా తీయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : త్రాగునీటి సరఫరా సమయంలో శ్యాంపిల్స్ తప్పనిసరిగా తీయాలని, ఎక్కడైనా కలుషిత నీటి సరఫరా జరిగితే యుద్దప్రాదిపదికన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం సిడిఎంఏ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిఎంసి పరిధిలో వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శులు ప్రతి రోజు త్రాగునీటి సరఫరా సమయంలో …

Read More »

ప్రభుత్వ ఆసుపత్రులకు నమ్మకంతో వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రులకు నమ్మకంతో వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో రూ.4 కోట్ల విలువ గల సిటీ స్కాన్ యంత్రాన్ని ఓ.పి విభాగంలో గుండె జబ్బులను నిర్ధారించే ట్రెడ్ మిల్ యంత్రాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , రాష్ట్ర …

Read More »

గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి బ్యాంకులు సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన 20 ఏసీలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి బ్యాంకులు సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన 20 ఏసీలను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ , జిల్లా కలెక్టర్ ఎస్ . నాగలక్ష్మీ శనివారం సాయంత్రం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి కి అందించారు. ఇటీవల జరిగిన జిల్లా బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి రాష్ట్రంలోని పేద ప్రజలకు అత్యున్నతమైన వైద్య …

Read More »

ప్రభుత్వ వైద్యుల పట్ల ప్రజల్లో గౌరవ భావం మరింత పెరిగే విధంగా కృషి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ వైద్యుల పట్ల ప్రజల్లో గౌరవ భావం మరింత పెరిగే విధంగా కృషి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్యా శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం జీజీహెచ్ లోని సుశ్రుత సమావేశ మందిరంలో వివిధ విభాగాల ఆచార్యులతో జరిగిన సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్యా శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ , …

Read More »

నూతన జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వరం

-బట్టీ విధానానికి స్వస్తి.. సృజనాత్మకత పెంపొందించడం, ప్రతి ఒక్కరూ చదువుకునేలా చేయడం నూతన విద్యా విధానం ప్రధాన ఉద్దేశం -విద్యార్థి దశలోనే నైపుణ్య శిక్షణ, తద్వారా స్వయం ఉపాధితోపాటు చదువుకునే వెసులుబాటు -భారతదేశ అభివృద్ధిలో నూతన జాతీయ విద్యా విధానం పాలసీది కీలక పాత్ర -కొత్త విద్యా విధానం అమల్లో కొన్ని సమస్యలు, సవాళ్లు ఉన్న మాట వాస్తవమే.. అధిగమిస్తాం -గత పాలకులు సరైన విద్యా విధానం, ఆర్థిక విధానం తీసుకురావడంలో విఫలం -గత ఐదేళ్లల్లో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైన మాట …

Read More »

ఉత్తమ సేవలకు కేంద్రం గుర్తింపు

-దేశంలో తొలిసారి జీవన్‌ధాన్‌ అవార్డు అందుకున్న ఏపీ -ఢిల్లీలో అవార్డు స్వీకరించిన రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ కె.రాంబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజలకు జీవన్‌ధాన్‌ పధకంపై అవగాహన, అవయువాలు దానాన్ని ప్రోత్సహిస్తున్న ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే జాతీయ అవయువదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఢిల్లీలోని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సమావేశ మందరంలో ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వానికి లభించిన జీవన్‌ధాన్‌ అవార్డును రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.రాంబాబు స్వీకరించారు. రాష్ట్ర విభజన తర్వాత …

Read More »

రెండున్నరేళ్ల‌లో మ‌హానాడు రోడ్డు నుంచి నిడ‌మానురు రైల్వే బ్రిడ్జ్ ఫై ఓవ‌ర్ నిర్మాణం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఆమోదం తెలిపిన కేంద్ర జాతీయ ర‌హ‌దారి మంత్రిత్వ‌శాఖ‌ -రెండు నెలల్లో టెండ‌ర్లు..సిద్ధంగా వున్న డిపిఆర్ -ఫై ఓవ‌ర్ రూ.800 కోట్లు…తూర్పు బైపాస్ కి 2,500 కోట్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి గా గెలిచిన ద‌గ్గ‌ర నుంచి మ‌హానాడు రోడ్డు నుంచి నిడ‌మానురు రైల్వే బ్రిడ్జ్ ఫ్లై ఓవ‌ర్ పైనే దృష్టి పెట్టడం జ‌రిగింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషి ఫ‌లితం మ‌హానాడు రోడ్డు నుంచి నిడ‌మానురు రైల్వే బ్రిడ్జ్ వ‌ర‌కు ఆరులైన్ల ఫ్లైఓవ‌ర్ కి, తూర్పు బైపాస్ కి కేంద్ర …

Read More »

అంధ‌, బధిర విద్యార్ధుల మ‌ధ్య ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) బ‌ర్త్ డే వేడుక‌లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ శ‌నివారం గుణ‌ద‌లలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రేమ‌దాన్ మ‌ద‌ర్ థెరిస్సా ఆశ్ర‌మంలో , విజ‌య‌మేరీ అంధుల పాఠ‌శాల లో , మడోన్నా ఇన్ స్టిట్యూట్స్, మ‌డోన్నా హై స్కూల్ ఫర్ ది డెఫ్ స్కూల్ కి అవ‌స‌ర‌మైన నిత్యావ‌స‌ర సరుకులు, కంప్యూట‌ర్ ప్రింట‌ర్, 25 సీలింగ్ ఫ్యాన్స్ అంద‌జేశారు. కేశినేని శివ‌నాథ్ మిత్ర‌బృందం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ …

Read More »

ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల ప‌రిష్కరానికి కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివనాథ్

-బుద్ధావెంక‌న్న కార్యాల‌యంలో ఘ‌నంగా ఎంపి బ‌ర్త్ డే వేడుక‌లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌శ్చి మ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌,రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరాతో క‌లిసి ప‌రిష్కరించేందుకు కృషి చేస్తాన‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న కార్యాల‌యంలో శ‌నివారం ఎంపి కేశినేని శివ‌నాథ్ పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఎంపి కేశినేని శివ‌నాథ్ కేక్ క‌ట్ చేయ‌గా, బుద్దా వెంక‌న్న‌, నాగుల్ మీరా …

Read More »