-జన్మదినం సందర్బంగా దేవాలయాల సందర్శన -కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తన జన్మదినం సందర్భంగా ఇంద్రకీలాద్రి పైన కనకదుర్గ అమ్మవారిని, శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం లో వినాయక స్వామిని ఆయన సతీమణి జానకి లక్ష్మీ, తల్లి ప్రసూన్నాంబతో కలిసి శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. ఎంపి కేశినేని శివనాథ్ కు కనకదుర్గమ్మ ఆలయ ఈ.వో కె.ఎస్ రామారావు స్వాగతం …
Read More »Daily Archives: August 3, 2024
పశ్చిమ లో ప్రజారోగ్యానికి పెద్దపీట
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు హెచ్ బి కాలనీ,చిట్టినగర్, ల లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సిన్ నిల్వ లు, పలు రికార్డులను ఆయ న తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిధిలో గర్భిణుల వివరాల నమోదు, ఓపీ తదితర విషయాలను సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. పశ్చిమ లోని ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు సిబ్బంది కూడా తప్పని సరిగా హాజరు కావాలని …
Read More »పశ్చిమలో చౌక దుకాణాల ఆకస్మిక తనిఖీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు 44 వ డివిజన్ చెరువు సెంటర్ లోని చౌక దుకాణాలను శనివారం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తనిఖీ చేశారు. రేషన్ షాపుల పనితీరు నిత్యవసర సరుకుల నాణ్యతను పరిశీలించి రేషన్ డీలర్ కోట గురునాధరావు తో ముఖాముఖి చర్చించారు. క్షేత్రస్థాయిలో చౌక దుకాణాల పనితీరుపై ప్రత్యేక పరిశీలన చేస్తున్నామన్నారు. పశ్చిమ లోని 120 చౌక డిపోల ద్వారా పదివేల మంది లబ్ధి పొందుతున్నారని అర్హులైన ప్రతి ఒక్కరికి …
Read More »పరిమితి మించి పిల్లలు తీసుకెళ్తున్న 50 ఆటోలపై కేసులు నమోదు
-సుమారు మూడు లక్షల అపరాధ రుసుము వసూలు -డి టి వో కృష్ణా రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత 2024 విద్యా సంవత్సరము ప్రారంభము కావడంతో స్కూల్ పిల్లలు వారికి సంబందించిన స్కూల్ ఆటోలలో పరిమితికి మించి ప్రయాణించడం జరుగుతున్నదని , అటువంటి వారిపై 50 కేసులు నమోదు చేయడమే కాకుండా సుమారు 3 లక్షల రూపాయల అపరాధ రుసుము వసూలు చేసినట్లు జిల్లా రవాణా అధికారి కె ఎస్ ఎమ్ వి. కృష్ణారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. …
Read More »స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి…
-ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల పై శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చెయ్యాలి -అధికారులు సమన్వయంతో విధులను నిర్వర్తించాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15వ తేదీన స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుపుకోనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత శోభాయమానంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి జిల్లా అధికారులు ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించిన సమీక్షా సమావేశం …
Read More »శిరస్త్రాణం ధారణ పట్ల నిర్లక్ష్య వైఖరి వద్దు
-ఉభయ గోదావరి జిల్లాల్లో హెల్మెట్ ధారణ చేసి మాత్రమే వాహనాలు నడపండి -డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాహన చోదకులు హెల్మట్ ధారణ పట్ల నిర్లక్ష్య వైఖరీ అత్యంత ఆవేదనా కలిగించే అంశం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు, హై కోర్టు వారు శిరస్త్రాణం (హెల్మెట్), సీటు బెల్ట్ ధారణ పై ఎన్ని రకాలుగా చైతన్యం …
Read More »కుల వృత్తుల జీవనం సాగించే వారి ఆర్థిక సాధికారత లక్ష్యం గా పి ఎమ్ విశ్వ కర్మ యోజన
-క్షేత్ర స్థాయిలో గతంలో ఎటువంటి లబ్ది పొందని లబ్దిదారుల గుర్తింపు చేపట్టాలి -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కులవృత్తులు చేసుకుని జీవనం సాగించే వారి భద్రత, ఆర్థిక సాధికారికత స్వభావాన్ని పెంపొందించే విధంగా పి ఎమ్ విశ్వ కర్మ్స్ యోజన లబ్ధిదారుల ఎంపిక ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎం విశ్వకర్మ యోజన నోడల్ ఆఫీసర్ల సమావేశంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ …
Read More »అటల్ మారథాన్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ర్యాంకు
-500 ఉత్తమ ప్రాజెక్టుల్లో 35 స్థానాలు మన రాష్ట్రానివే -రెండో ర్యాంకు సాధించిన తక్కువ ఖర్చుతో సెలైన్ అలారం (Empty Saline Remainder)ప్రాజెక్టు రూపొందించిన శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి ఉన్నత పాఠశాల విద్యార్థులు -అభినందించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీతి ఆయోగ్ వారి అటల్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న అటల్ మారథాన్ లో భాగంగా 2023-24 సంవత్సరానికి గానూ ఆన్ లైన్ ప్రాజెక్టు పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ర్యాంకు దక్కిందని సమగ్ర …
Read More »బుద్ధి కుశలత తో మెరుగైన పాలన సాధ్యం అంశంపై అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన విజయవాడ ఎ .కన్వెన్షన్ సెంటర్లో బుద్ధి కుశలత తో మెరుగైన పాలన సాధ్యం అంశంపై కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ విభాగం ప్రతినిధి పద్మజ తెలిపారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజా పిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఆఫ్ రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యం …
Read More »పేదలందరికీ పక్కా ఇంటి కల సాకారం చేస్తాం
-హామీ మేరకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు -ఇంటి పట్టాల పేరుతో స్కాములకు పాల్పడ్డారు -నిర్మాణానికిచ్చే సొమ్ములో కూడా జగన్ రెడ్డి కక్కుర్తి చాటుకున్నాడు -కేంద్రం ఇచ్చే సొమ్మును తానిస్తున్నట్లు డ్రామాలాడాడు -ఏడాదిలో పక్కా ఇళ్లు అందించాలని అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు పక్కా ఇంటి కల సాకారం చేసి తీరాల్సిందేని రాష్ట్ర గనులు, భూగర్భ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు మచిలీపట్నంలోని …
Read More »