Breaking News

Daily Archives: August 14, 2024

జాతీయ అవార్డు అందుకున్న సర్పంచ్ కృష్ణకుమారి

-కేంద్ర మంత్రి చేతులమీదుగా అవార్డు అందుకున్న చల్లపల్లి సర్పంచ్ కృష్ణకుమారి -భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిధిగా ఢిల్లీ వెళ్లిన సర్పంచ్ -దేశం మొత్తం మీద ఎనిమిది మంది సర్పంచులకు దక్కిన అరుదైన గౌరవం -స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం, మన కోసం మనం ట్రస్ట్ విస్తృత కృషితో క్లీన్ & గ్రీన్, సింగిల్ యూస్ ప్లాస్టిక్ నియంత్రణ, ఓడిఎఫ్ ప్లస్ లక్ష్యాలు సాధించిన చల్లపల్లి గ్రామ పంచాయతీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓడిఎఫ్ ఫ్లస్ సాధనతో పాటు సింగిల్ …

Read More »

ఏపీని స్టార్టప్ హబ్ గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయండి

-ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ లో అగ్రగామిగా నిలపాలి -ఐటి కంపెనీలను రాష్ట్రంలోకి ఆహ్వానించాలి -ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ శాఖను ఏర్పాటు చేయాలి -డ్రోన్ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించండి -యాప్ ఆధారిత సేవలను ఔత్సాహికులకు అందుబాటులోకి తేవాలి -ఐటీ, ఎలక్ట్రానిక్స్-కమ్యునికేషన్స్ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్ గా తీర్చిదిద్దాల్సి ఉందని, ఆదిశగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ఐటి …

Read More »

నిన్న ప్రజాదర్బార్ లో విన్నపం… నేడు సిఎం చేతులమీదుగా ప్రోత్సాహకం

-అమెరికా యూత్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్ కు ఎంపికైన రాష్ట్ర బాలికలు! -ప్రతిభావంతులైన విద్యార్థినులకు మంత్రి లోకేష్ చేయూత -లక్ష చొప్పున ఆర్థిక సాయం, ల్యాప్ ట్యాప్ ల అందజేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిభకు పేదరికం అడ్డుకారాదన్నది రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సిద్ధాంతం. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాదర్బార్ ద్వారా తమవద్దకు వచ్చే ఎంతోమంది పేద విద్యార్థులకు మంత్రి లోకేష్ ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా అగ్రదేశం అమెరికాలో యూత్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్ కు ఎంపికైన …

Read More »

వెలుగు పనితీరును సమీక్షించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ – వెలుగు కార్యకలాపాలను మెరుగు పరిచి అభివృద్ధి పథంలో పయనింపజేయాలని, అందుకు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ కేంద్ర కార్యాలయంలో అధికారులతో బుధవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. స్వయం సహాయక సంఘాలను ప్రగతిశీలంగా పనిచేసేందుకు తక్షణ చర్యలను చేపట్టి వినూత్నంగా ముందుకు సాగాలని, …

Read More »

ఏపీలో కంపెనీల ఏర్పాటుకు సహకారం అందించండి..

-రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ -మంత్రి టి.జి భరత్ ను కలిసిన ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ సైలాయ్ జాకీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కంపెనీలు ఏర్పాటుచేసేందుకు స‌హ‌క‌రించాల‌ని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ సైలాయ్ జాకీ ను రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ కోరారు. మంగళగిరిలో ఏపీఐఐసీ భవనంలో మంత్రి టి.జి భరత్ ను ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ సైలాయ్ జాకీ తో …

Read More »

మంత్రి జనార్ధన్ రెడ్డిని కలిసిన ఏపీఎస్ఎఫ్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రివర్యులు  బీసీ జనార్ధన్ రెడ్డిని సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎం.డీ(మేనేజింగ్ డైరెక్టర్) దినేష్ కుమార్,ఐఏఎస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్కను మంత్రికి అందించికి అభినందనలు తెలియజేశారు. ఏపీఎస్ఎఫ్ఎల్ లో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై మంత్రి దినేష్ కుమార్ కు పలు సూచనలు చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్ ను తన జేబు సంస్థగా వాడుకుని, ప్రజాధనాన్ని దోపిడీ చేసిందని మంత్రి తెలిపారు. …

Read More »

ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేయండి

-వాడవాడలా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించాలి -స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించండి -జిల్లాల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ పతాకను ఎగురవేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పిలుపు నిచ్చారు.హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంపై బుధవారం విజయవాడ సిఎస్ …

Read More »

హజ్ యాత్ర -2025 కు దరఖాస్తు చేసుకోండి

-దరఖాస్తులన్నీ ఆన్లైన్ లోనే స్వీకరణ -సెప్టెంబర్ 9వ తేదీ వరకు గడువు -ఏపీ మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2025 కు ఆన్‌లైన్ దరఖాస్తు నమోదును ఈనెల 13వ తేదీ నుండి ప్రారంభించిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ,న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు.హజ్ దరఖాస్తుల ఫారమ్‌లను పూరించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 9వ తేదీ వరకు కేంద్ర …

Read More »

తీరనున్న బందరు వాసుల చిరకాల కోరిక

-మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైన్‌కు మార్గం సుగమం -దశాబ్దాల బందరు వాసుల ఆకాంక్షలను నెరవేర్చండి -ప్రజా రవాణాతో పాటు వాణిజ్య పరంగానూ లాభసాటిగా ఉంటుంది -రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కొల్లు రవీంద్ర వినతి న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ప్రజల దశాబ్డాల కోరిక అయినటువంటి మచిలీపట్నం – రేపల్లె మధ్య 45 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను పూర్తి చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ …

Read More »

మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని కలిసిన డ్రోన్ కంపెనీ యజమానులు

– ప్రభుత్వశాఖల్లో డ్రోన్ టెక్నాలజీపై మంత్రికి వివరణ – ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని చెప్పిన మంత్రి జనార్ధన్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ రంగంలోని రోడ్లు మరియు భవనాల శాఖ మరియు పారిశుధ్య నిర్వహణ, తదితర విషయాల్లో డ్రోన్ టెక్నాలజీ వల్ల ఉన్న ఉపయోగాలను డ్రోన్ కంపెనీల యజమానులు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డికి సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం కలిసి వివరించారు. హైదరాబాద్ కు చెందిన WINGS & …

Read More »