Daily Archives: August 14, 2024

అన్నార్తులకు అండగా అన్న క్యాంటీన్లు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేద, మధ్య తరగతి ప్రజలకు భరోసా కల్పిస్తూ రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునః ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రేపు స్వాతంత్ర దినోత్సవం నాడు గుడివాడలోని రామబ్రహ్మం మున్సిపల్ పార్కులో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన అన్న క్యాంటీన్ లు పేద మధ్య తరగతి ప్రజల ఆదరణ పొందాయి. సమస్యల పరిష్కారం కోసం రకరకాల పనుల కోసం, మారుమూల గ్రామాల …

Read More »

మంచినీటి సమస్యను పరిష్కరిస్తాం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం మండలం కొండపావులూరులోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ లో మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉన్నతాధికారులకు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వివిధ జిల్లాల కలెక్టర్లతో విభజన చట్టం ద్వారా రాష్ట్రంలో నెలకొల్పిన జాతీయ సంస్థలలో మౌలిక సదుపాయాల కల్పన పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి గన్నవరం మండలం కొండపావులూరులోని జాతీయ విపత్తు …

Read More »

పెద్ద ఎత్తున హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పెద్ద ఎత్తున హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ గుడివాడ పట్టణంలోని మునిసిపల్ కార్యాలయ నుండి జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై గూగుల్ మీట్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా …

Read More »

అమర జీవుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం లభించింది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎందరో అమర జీవుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం లభించిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా పర్యాటక, యువజన సంక్షేమ, క్రీడలు, విద్య శాఖల తోపాటు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో మచిలీపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో బుధవారం స్థానిక కోనేరు సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించి, విద్యార్థులు అధికారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …

Read More »

వ్యర్ధాలు ఖాళీ స్థలలో వేయకుండా నిరంతరం పర్యవేక్షిస్తుండాలి

-అధికారులకు అదేశాలు ఇచ్చిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యర్ధాలను ఖాళీ స్థలాలలో వేయకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ అధికారులు అప్రమత్తంగా ఉంటూ పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిపించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సర్కిల్ వన్ పరిధి లోగల 41,42,43,45 డివిజన్లో గల స్వాతి రోడ్, చర్చ్ జంక్షన్, సితార జంక్షన్, గొల్లపూడి ఎట్కిన్స్న్ రోడ్, ఐరన్ యార్డ్, వెంకటేశ్వర ఫౌండ్రీ రోడ్, హెచ్.బి కాలనీ దర్గా …

Read More »

నగర కమిషనర్ ఆదేశాల మేరకు యనమలకుదురు రామలింగేశ్వర నగర్ పరిశీలించిన అధికారులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు బుధవారం ఉదయం చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి. రత్నవళి,జోనల్ కమిషనర్ 3 ఎస్ శివరామకృష్ణ విజయవాడ సర్కిల్ 3 పరిధిలో గల శివారు ప్రాంతమైన యనమలకుదురు, రామలింగేశ్వర నగర్ పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. శివారు ప్రాంతాలలో పేరుకుపోయిన వ్యర్థాలను సత్వరమే తొలగించాలని, నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిపించాలని, సిబ్బందితో అన్నారు. తదుపరి రామలింగేశ్వర నగర్ లో గల చేపల మార్కెట్ …

Read More »

హర్ ఘర్ తిరంగా అంటూ ర్యాలీలో పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర, సబ్ కలెక్టర్ భవాని శంకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా అంటూ విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి సర్కిల్ వన్ పరిధిలో గల విజయవాడ నగరపాలక సంస్థ నందు, కమిషనర్ ధ్యానచంద్ర, సబ్ కలెక్టర్ భవాని శంకర్ సర్కిల్ టు పరిధిలోగల బి ఆర్ టి ఎస్ రోడ్, సరదా కాలేజ్ నందు, సర్కిల్ 3 పరిధిలోగల విశాలాంధ్ర రోడ్డు నందు జోనల్ కమిషనర్ 3 శివరామకృష్ణ, …

Read More »

సహకార చట్టాన్ని సరళీకృతం చేసిన ఏకైక సీఎం ఎన్టీఆర్

-ఆర్బీఐ డైరెక్టర్ సతీష్ కె.మరాఠే -సహకారభూమి జర్నల్ కార్యాలయ సందర్శన -వైకుంఠ మెహతా చిత్రపటం ఆవిష్కరణ -సహకార సంఘాల సభ్యులతో ఇష్టాగోష్టి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో సహకార వ్యవస్థ ఆశించిన రీతిలో అభివృద్ధి చెందడం లేదనీ, దీనికి ఒకే ఒక్క ప్రధాన కారణం సహకార చట్టమేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డైరెక్టర్, సహకార భారతి పూర్వ అధ్యక్షులు సతీష్ కె.మరాఠే అన్నారు. సహకార భారతి ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యాన ఓ సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన.. …

Read More »