విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించడమే కాదు, స్వతంత్ర అభ్యర్థులకు కష్టం నష్టం జరగకుండా చూసుకున్నప్పుడే దేశం బాగుపడుతుందని థర్డ్ ఫ్రంట్ అధ్యక్షులు దేవరపల్లి మహేష్ అన్నారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు ఎన్నికలలో ఎంపిగా పోటీచేసి, స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకోలేకపోయామన్నారు. పవిత్రమైన రాజ్యాంగ బద్ధ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, ఎన్‌టిఆర్ జిల్లా 12-విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలు, ఎపి 80-విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలని 2024 సార్వత్రిక ఎన్నికలు …
Read More »Daily Archives: August 16, 2024
ప్రజలకు సంతృప్తికర స్థాయిలో వైద్య సేవలు అందించేలా ఆసుపత్రుల ప్రక్షాళన
-ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో మెరుగైన సేవలకై 30 అంశాల కార్యాచరణ ప్రణాళిక అమలు -దశల వారీగా స్వల్ప, మధ్య, దీర్ఝకాలిక ప్రణాళికలు అమలు చేసేందుకు చర్యలు -ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఎటు వంటి అంతరాయం ఉండబోదు, ఇప్పటికే రూ.200 కోట్లు చెల్లించాం మరో రూ.300 కోట్లు త్వరలో చెల్లిస్తాం -గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకవతకలపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది -రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు …
Read More »అన్నా క్యాంటీన్లతో పేదల కళ్లల్లో ఆనందం
– ప్రజాప్రభుత్వం హయాంలో క్యాంటీన్ల పునరుద్ధరణ ఎంతో సంతోషాన్నిస్తోంది. – విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) – పేదలకు పట్టెడన్నం పెట్టే బృహత్తర కార్యక్రమమిది – శాసనసభ్యులు గద్దె రామమోహన్, బొండా ఉమామహేశ్వరరావు, యలమంచిలి సుజనా చౌదరి – పండగ వాతావరణంలో వేడుకగా అన్నా క్యాంటీన్ల ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడంతో పేదల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని విజయవాడ ఎంపీ …
Read More »జాతీయ చేతిరాత పోటీల్లో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు
-విజేతలుగా నిలిచిన అర్జున్, లక్ష్మి కావ్య, దన్విక్, ముకుంద ప్రియ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయి చేతిరాత పోటీల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ కెప్టెన్ గా విశాఖ జిల్లా కలెక్టర్ కుమారుడు ఏ. అర్జున్ సీనియర్ లెవెల్ లో గెలుపొందారు. ఎన్ఆర్ఐ నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ, అమ్మ ఒడి హ్యాండ్ రైటింగ్ , అఖిల భారత హ్యాండ్ రైటింగ్ ట్రైనర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జూలై 14వ తేదీ ఆన్ …
Read More »19 నుండి ఇంజనీరింగ్ తుది, మూడో దశ ప్రవేశాల ప్రక్రియ
-నోటిఫికేషన్ విడుదల చేసిన కన్వీనర్ గణేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఎపి ఈఎపిసెట్ 2024 తుది, మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 19 ప్రారంభం అవుతుందని సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ గణేష్ కుమార్ తెలిపారు. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియను విద్యార్ధులు ఆగస్టు 19 నుండి ఆగస్టు 21 లోపు పూర్తి చేయవలసి ఉంటుందన్నారు. ఆగస్టు 19 నుండి ఆగస్టు 22 వరకు …
Read More »రైతుల అగ్రిబిజినెస్ కన్సార్టియం ప్రోత్సహం అందించే ప్రక్రియ చేపట్టాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ”ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్” రైతులు, చిన్న రైతుల అగ్రిబిజినెస్ కన్సార్టియం (SFAC) ప్రోత్సహం అందించే ప్రక్రియ చేపట్టాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ వి వి ఎస్ మూర్తి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో ఎఫ్ పి వో ల ప్రమోషన్ కోసం సహాయాన్ని అందించే ప్రక్రియ పై సమన్వయ శాఖల అధికారు లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వక్తలు మాట్లాడుతూ, వ్యవసాయ రంగం, రైతు ఉత్పత్తిదారుల సంస్థ పురోగతి లక్ష్యంగా …
Read More »నగర అభివృద్దే లక్ష్యంగా వంద రోజులు కార్యాచరణ ప్రణాళిక..
– ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను చేపట్టి అమలు చేయడం జరుగుతుంది. – తొలి దశలో మూడు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. -ప్రతి ఇంటికి త్రాగునీటి కొళాయి లక్ష్యంగా ఇంటింటి సర్వే చేపట్టాం. -2027 లో జరుగునున్న గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికులకు సౌకర్యాలు కల్పన దిశగా కార్యాచరణ. -నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర అభివృద్దే లక్ష్యంగా వంద రోజులు కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను చేపట్టి అమలు చేయడం జరుగుతుందని నగరపాలక …
Read More »12 అంశాల ప్రాతిపదికన అభివృద్ది సామర్ధ్య ప్రణాళిక
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సందర్భంగా సిపివో/ జాయింట్ డైరెక్టర్ ఎల్. అప్పలకొండ మాట్లాడుతూ, వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 దిశగా 2024-29 జిల్లా కార్యాచరణ ప్రణాళిక మేరకు 12 అంశాల ప్రాతిపదికన అభివృద్ది సామర్ధ్య ప్రణాళికలను సిద్ధం చేసుకుని అమలు దిశగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. రాష్ట్ర స్థాయి లో జరిగిన వర్క్ షాప్ లో ఆమేరకు రాష్ట్ర స్థాయి లో అమలు చెయ్యాలి వాటిపై అవగాహన కల్పించటం జరిగిందన్నారు. అదే విధంగా జిల్లా స్థాయిలో కూడా ఆయా శాఖలు నివేదిక …
Read More »ప్రతి నెల చివరి శనివారం పౌర హక్కుల దినం సందర్శన ఉండాలి
-ఎస్సీ ఎస్టీ కేసుల పై కేసులవారీగా నివేదిక అందజేయాలి -పోస్టుల భర్తీల విషయంలో రోస్టర్ పాయింట్ ను కచ్చితంగా పాటించాలి -త్వరలో ప్రజాప్రతినిధులతో డివిఎంసి కమిటీ సమావేశం నిర్వహిస్తాం – కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : పి ఓ ఏ యాక్ట్ అమలు , మహిళల భద్రత ప్రాధాన్యత – ఎస్పికిషోర్ ఎస్సి ఎస్టీ లపై అఘాయిత్యాల నివారణ చట్టం అమలు చేస్తున్న తీరు, పెండింగ్ అంశాల పై కేసుల వారీగా సమగ్ర వివరాలు అందచేయాలని జిల్లా విజిలెన్స్ …
Read More »కొవ్వూరు లో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
-2014 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చే ఆన్నా క్యాంటీన్ల శ్రీకారం -నేడు ఐదేళ్ళ తరవాత మళ్లీ ప్రారంభించుకుంటున్నాం కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి పేదవానికి కూడు , గూడు, గుడ్డ కల్పించాలనే ఉద్దేశ్యంతో పార్టీ స్థాపించి, రూ.2 కిలో బియ్యం పథకం ప్రారంభించడం జరిగిందని, ఎన్టీఆర్ సిద్ధాంతంతో 2014-2019 సంవత్సరాల మధ్యలో అన్నా క్యాంటీన్ల పేరుతో పేదల కడుపు నింపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కొవ్వూరు బస్టాండ్ సమీపంలో …
Read More »