Daily Archives: August 19, 2024

త్వరలో నూతన ఏపీ టెక్స్ టైల్ పాలసీ

-రాష్ట్ర చేనేత మరియు జౌళి, బీసీ సంక్షేమ శాఖామాత్యులు ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో నూతన ఏపీ టెక్స్ టైల్, అపెరల్ మరియు గార్మెంట్స్ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర చేనేత మరియు జౌళి, బీసీ సంక్షేమ శాఖామాత్యులు శ్రీమతి ఎస్.సవిత గారు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర, రాష్ట్రేతర పెట్టుబడుదారులతో మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేస్తోందన్నారు. ముఖ్యంగా టెక్స్ టైల్ రంగంలో నూతన పరిశ్రమల …

Read More »

అనాథాశ్రమంలో కలుషిత ఆహారంతో నలుగురు విద్యార్థుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

-అస్వస్థతకు గురైన ఇతర విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కలుషిత ఆహారంతో అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న వారిలో జాషూవా, భవాని, శ్రద్ధ, నిత్య అనే విద్యార్థులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. నర్సీపట్నం, …

Read More »

వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు

-కెమేరా చేతపట్టి స్వయంగా ఫోటో జర్నలిస్టులను ఫోటోలు తీసిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సిఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి చేతిలో కెమేరాను తీసుకుని స్వయంగా సిఎం ఫోటోలు క్లిక్ మనిపించారు. మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ఈ రంగంలో …

Read More »

సీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పార్టీ మహిళా నేతలు మాజీ మంత్రి పీతల సుజాత, జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ డ్వాక్రా-అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, కంభంపాటి శిరీష, పలువురు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం వారికి ధన్యవాదాలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

మమతానురాగాల బంధమే రక్షాబంధన్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోదర, సోదరీ మణులు అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి పండుగ అని ఐజ గ్రూప్‌ చైర్మన్‌ మైనార్టీ నాయకులు షేక్‌ గయాసుద్దీన్‌ ఐజ పేర్కొన్నారు. సోమవారం షేక్‌ గయాసుద్దీన్‌ ఐజ కార్యాలయంలో రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అభిమానులు, సోదరీమణులు, అక్కా, చెల్లెళ్ళు ఈ వేడుకలో పాల్గొని ఆయనకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటా అప్యాయతలు పెంపొందించే పండుగ రాఖీ పండుగ అని …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 101 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, దేవేంద్ర రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిప్యూటీ క కలెక్టర్లు రామ్మోహన్, దేవేంద్ర రెడ్డి లు కలిసి వివిధ …

Read More »

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇప్పుడు సమయం వచ్చింది

-శ్రీ సిటీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ కు ఇండస్ట్రీయల్ జోన్ కావాలి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -తిరుపతి జిల్లా శ్రీసిటీలో వివిధ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు -శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు -శ్రీసిటిలో 7 పరిశ్రమలకు శంకుస్థాపన, మరో 5 కంపెనీలతో రూ.1,213 కోట్ల పెట్టుబడికి ఒప్పందాలు -రూ.900 కోట్ల పెట్టుబడితో 2,740 మందికి ఉపాధి అవకాశాలు.. -మొత్తంగా 15,280 మందికి ఉపాధి అవకాశాలు -శ్రీసిటీలో ఫైర్ స్టేషన్ ప్రారంభం, పోలీస్ స్టేషన్ కు శంకుస్థాపన …

Read More »

రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన నేపధ్యంలో బాగంగా వినూత్న కార్యక్రమాలు

-ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్ ఆదేశముల మేరకు సోమవారం ఆర్.టి.ఏ జంక్షన్ వద్ద ట్రాఫ్ఫిక్ నియమ నిభందనలు మరియు హెల్మెట్ ధరించడం వలన కలుగు ఉపయోగాలపై అవగాహనా కార్యక్రమము చేపట్టినారు. ఈ నేపధ్యంలో పోలీస్ అధికారులు మరియు ఎన్.జి.ఓ. ల ఆధ్వర్యంలో ఈ రోజు రక్షాబంధన్ సందర్భంగా హెల్మెట్ ధరించి బైకులను నడిపిన వారిని, సీట్ బెల్ట్ ధరించిన వాహనదారులను, యూనిఫాం ధరించిన ఆటోలను నడుపు వారిని మరియు మోటారు …

Read More »

వినాయక చవితి పండుగను పర్యావరణ కాలుష్యము లేకుండా నిర్వహించుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబరు 7 న నిర్వహించుకునే వినాయక చవితి పండుగను పర్యావరణ కాలుష్యము లేకుండా నిర్వహించుకోవాలని, పందిళ్ళు ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు, డీ ఆర్వో జి. నరసింహులు ఇతర అధికారులతో కలిసి కుల ధ్రువపత్రాలు, ఎస్సి ఎస్టీ కుల ధ్రువపత్రాలు, గణేష్ ఉత్సవాలు, సిసిఆర్సీ కార్డులు, రెవెన్యు అంశాలు, …

Read More »

ఆధునిక‌త‌కు అనుగుణంగా నూత‌న పారిశ్రామిక విధానం

-ఏపీ ఐడీపీ (2024-29) రూప‌క‌ల్ప‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు -ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపుగా పారిశ్రామికరంగం వెళ్లాల్సిన అవసర‌ముంద‌న్న ముఖ్య‌మంత్రి ఆకాంక్ష‌లకు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం నూత‌న పారిశ్రామిక విధానం (2024-29) రూప‌క‌ల్ప‌న‌కు క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించ‌నున్న నేప‌థ్యంలో ప‌రిశ్ర‌మ‌ల శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా వివిధ పారిశ్రామిక …

Read More »