అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించేందుకు హెచ్‌సీఎల్ కంపెనీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ విషయమై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో హెచ్‌సీఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్‌తోపాటు ప్రతినిధుల బృందం సమావేశమైంది. కాగా, ఏపీలో హెచ్‌సీఎల్‌కు శంకుస్థాపన వేసింది.. సీఎం చంద్రబాబు నాయుడేనన్న సంగతిని నారా లోకేష్ గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో హెచ్‌సీఎల్ ప్రారంభం కాగా.. 4500 మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. ఈ భేటీ వివరాలను మంత్రి నారా లోకేష్ …
Read More »Daily Archives: August 20, 2024
ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు ప్రతినిధులతో సీఎం భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ విజన్ పై ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు ప్రతినిధులతో చర్చలు జరిపినట్టు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. భవిష్యత్ రాజధాని అమరావతిలో భాగస్వామ్యం కావాల్సిందిగా రెండు బ్యాంకులను ఆహ్వానించినట్టు వెల్లడించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటాయించింది. కాగా, ప్రపంచ బ్యాంకు సహకారంతో ఆ నిధులను సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ …
Read More »నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పై రివ్యూ చేశారు. కొత్త పాలసీపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్థేశం చేశారు. సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయని …వాటిని సద్వినియోగం చేసుకుంటే దేశంలోనే సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి ఎపి అతిపెద్ద కేంద్రం అవుతుందని సిఎం అన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీలో 2014- 2019 మధ్య కాలంలో దేశంలోనే …
Read More »గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు…పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేస్తాం
-ఒక ఇంటికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి ఏమి అవసరమో గుర్తిస్తాం…సదుపాయాలు కల్పిస్తాం -వచ్చే జనవరి నుండి జన్మభూమి 2.0 కార్యక్రమం..గ్రామాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తాం -పంచాయతీ రాజ్ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష -పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.990 కోట్లు, జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర వాటా రూ.500 కోట్లు విడుదల చేస్తున్నామన్న సీఎం -సమీక్షకు హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అధికారులు -పంచాయతీరాజ్ శాఖలో తీసుకుంటున్న నిర్ణయాలు, సంస్కరణలను సీఎంకు వివరించిన డిప్యూటీ …
Read More »గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ప్రాజెక్టు పనులు ఆలస్యం
-అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఆ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే చర్యలు చేపట్టాం -అధికారుల అంచనా మేరకు రెండేళ్లు కాకుండా సంవత్సరంలోనే పనులు పూర్తి చేసేందుకు చర్యలు -ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలంటే దాదాపు రూ.4 వేల కోట్లు అవసరం -జలవరుల అభివృద్దికి తమ హయాంలో రూ.68 వేల కోట్లు వెచ్చిస్తే, గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.19 వేల కోట్లు మాత్రమే వెచ్చించడం జరిగింది -రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలి
-ప్రభుత్వ లక్ష్యసాధనకు అనుగుణంగా అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలి -ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం -దివ్యాంగులకు ఉచితంగా బ్యాటరీ సైకిల్లు ఇచ్చేందుకు కృషి చేస్తాం -బోగస్ పింఛన్లకు అడ్డుకట్ట వేయాలి, అర్హులైన చివరి వ్యక్తి వరకు పింఛను అందించాలి -మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, ప్రభుత్వ లక్ష్యసాధనకనుగుణంగా అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర సాంఘిక …
Read More »దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో మహిళా పారిశ్రామిక వేత్తల పాత్ర కీలకం
-చిన్న మధ్య తరహ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -మహిళా పారిశ్రామికవేత్తల కున్న సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది -ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తల స్ఫూర్తికి ప్రభుత్వం మద్దతునిస్తుంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చిన్న మధ్య తరహ పారిశ్రామిక రంగంలో మహిళల పాత్ర కీలకమని, పారిశ్రామిక రంగ స్వరూపాన్ని మార్చడంలో మహిళా పారిశ్రామికవేత్తల కున్న సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతుందని చిన్న మధ్య తరహ పరిశ్రమల శాఖ మంత్రి …
Read More »తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి టి.జి భరత్
-రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళతాం.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని పారిశ్రామికరంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అహర్నిశలు కష్టపడతామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. మంగళవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉందని కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమన్నారు. ముఖ్యమంత్రి …
Read More »స్థానిక సంస్థలకు రూ.1,452 కోట్ల నిధుల విడుదల
-స్థానిక సంస్థల బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -సీఎం చంద్రబాబు సూచనల మేరకు నిధులు విడుదల -గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే.. మేం బలోపేతం చేస్తున్నాం -ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అని మహాత్మ గాంధీ ఆశయాలను పాటించే ప్రభుత్వం మాది. స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులను గత ప్రభుత్వం …
Read More »సెప్టెంబరు 14 న జాతీయ లోక్ అదాలత్
-రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ ఎమ్.బబిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల 14 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని న్యాయ స్థానముల ఆవరణములలో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంటర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) ఎమ్.బబితా తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ …
Read More »