Daily Archives: August 20, 2024

క్రిటికల్ కేసుల విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

-వైద్య సేవలు అందించిన వాటి వివరాలు కేర్ షీట్ లో నమోదు చెయ్యాలి -మరణాలు సంభవించ కుండా నివారించే ముందస్తు వైద్యపరమైన జాగ్రత్తలు పాటించాలి -సరైన చికిత్సా అందించే ఆసుపత్రికి సిఫార్సు చెయ్యండి -జిల్లాలో మాతృ, శిశు మరణాలపై ఆర్డీవో తో విచారణ చేపట్టడం జరుగుతుంది -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మాతృ, శిశు మరణాలు నివారణలో క్లినికల్ పరిశీలనలు, సిఫార్సు లు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయని జిల్లాలో కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. హైరిస్క్ కేసుల …

Read More »

స్టెల్లా కళాశాలలో బాస్కెట్ బాల్ టోర్నమెంట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల లో బ్లేస్డ్మే మేరీ ఆఫ్ ద ప్యాషన్ మెమోరియల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ఘనం గా ప్రారంభం అయ్యాయి. ఈ టోర్నమెంట్ కి ముఖ్య అతిథి గా Dr పి.అంకమ్మ చౌదరి, జాయింట్ సెక్రటరీ బ్యాడ్మింటన్ అసోసియషన్ విచ్చేశారు. ఈ పోటీలను కళాశాల కరస్పాండెంట్ dr సిస్టర్ లీనా క్వద్రస్, గౌరవ అతిథి GSC బోస్, ఎన్టీఆర్ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, శ్రీ చక్రవర్తి బాస్కెట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ …

Read More »

ప్రపంచ దోమల దినోత్సవం బ్యానర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

-పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చును: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ ఆవరణలో జిల్లా వైద్యాధికారులతో కలిసి ప్రపంచ దోమల దినోత్సవ బ్యానర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడుతూ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి జ్వరాలు వ్యాప్తి చెందుతాయని, ప్రతి …

Read More »

కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఎలక్ట్రో కాస్టింగ్ లిమిటెడ్ వారు చేపడుతున్న ప్రజోపయోగ కార్యక్రమాలు అభినందనీయం

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ -సిఎస్ఆర్ కింద ఈఎస్ఎల్ కంపెనీ వారు చేపట్టిన పలు శిక్షణ కార్యక్రమాల లబ్ధిదారులకు, విద్యార్థినీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, కుట్టు మిషన్లు, సైకిల్ తదితరాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ సామాజిక బాధ్యతగా (CSR) ఎలక్ట్రో కాస్టింగ్ లిమిటెడ్ వారు చేపడుతున్న ప్రజోపయోగ కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం శ్రీకాళహస్తి సమీపంలోని ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ వారు సిఎస్ఆర్ కింద …

Read More »

వెలిగొండ ప్రాజెక్ట్ పై మాట్లాడే అర్హత జగన్ కు లేదు: మంత్రి గొట్టిపాటి రవి కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం గురించి మాట్లాడే కనీసం అర్హత కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టును వెలుగొండ ప్రాజెక్టును అనార్థరైజ్డ్ ప్రాజెక్టు గా చూపించే ప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి చేశారని అన్నారు. అయితే నాడు చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు అంతా దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి ఆథరైజ్డ్ ప్రాజెక్టుగా గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించామని గుర్తు చేశారు. అధికారంలో …

Read More »

కంకిపాడు మండల హౌసింగ్ గోదామును మంత్రి తనిఖీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ వచ్చే 2029 సంవత్సరం నాటికి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. మంగళవారం కంకిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలోని కంకిపాడు మండల హౌసింగ్ గోదామును మంత్రివర్యులు తనిఖీ చేశారు. గోదాములో ఉన్న గృహ నిర్మాణ సామాగ్రి నిల్వ రిజిస్టర్లు, పంపిణీ రసీదులు, తదితర రికార్డులు పరిశీలించారు. గోదాముకు ఎన్ని సిమెంట్ బస్తాలు వస్తున్నాయి, …

Read More »

రెండు రోజుల‌ పలు జిల్లాల్లో వర్షాలు..

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ఈ ఆవర్తనం నుంచి కొమోరిన్‌ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. దీని ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా, …

Read More »