Breaking News

Daily Archives: August 21, 2024

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు

-పోలీసు శాఖను పటిష్ట పర్చేందుకు సిఎం సమీక్షలో పలు నిర్ణయాలు -రాష్ట్ర హోమ్ & విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం …

Read More »

ఈనెల 23న గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించండి

-ప్రతి గ్రామ సభకు ప్రత్యేక అధికారిని నియమించాలి -ఉపాధిహామీ పనులపై అవగాహన తోపాటు గ్రామాల్లో కనీస సౌకర్యాలపై చర్చించాలి -సెప్టెంబరు 11 నుండి నూతన ఇసుక విధానం అమలు ప్రారంభం -ఉచిత ఇసుక విధానంపై మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి -ఇసుక రీచ్ ల వారీగా ఇసుక తవ్వకం,రవాణా చార్జీల ధరలను నిర్ధారించండి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈనెల 23న ఒకేరోజు నిర్వహించే గ్రామ సభలను విజయవతంగా నిర్వహించాలని ప్రతి గ్రామ సభకు …

Read More »

వరద నీటిలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయడం రికార్డు

-ఫలితంగా తుంగభద్ర రిజర్వాయరులో 40 టి.ఎం.సి.ల వరద నీటిని కాపాడుకోగలిగాం -రాష్ట్ర రైతాంగం ప్రత్యేకించి రాయలసీమ రైతాంగం తరపున కన్నయ్య నాయుడికి కృతజ్ఞతలు -రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుండగా తుంగభద్ర 19 వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేయడం అనేది భారత దేశ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టమని, అటు వంటి రికార్డును సృష్టించిన ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు కన్నయ్య …

Read More »

కన్నయ్యనాయుడుని సన్మానించిన సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్యనాయుడుకి శాలువా కప్పి జ్ఞాపిక అందించి అభినందించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయ 19వ గేటు కొట్టుకపోయింది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడకు వెళ్లాలని కోరారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించిన కన్నయ్య నాయుడు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ, …

Read More »

ఎంఎల్సిగా బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించిన కౌన్సిల్ చైర్మన్ కె.మోషేన్ రాజు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఇటీవల ఎన్నికైన మాజీమంత్రి బొత్స సత్యనారాయణచే బుధవారం రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు వారి చాంబరులో బొత్సతో ఎంఎల్సిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, సంయుక్త కార్యదర్శి యం.విజయరాజు పాల్గొన్నారు.

Read More »

గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం

-ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నా ఆంధ్ర ప్రదేశ్ -ఆంధ్రప్రదేశ్‌ క్లీన్ ఎనర్జీ సెక్టార్‌లో 5 బిలియన్ల యూ ఎస్ డాలర్ల పెట్టుబడికి బ్రూక్‌ఫీల్డ్ సుముఖం -3500 MW సోలార్ , 5500 MW పవన ప్రాజెక్టులను ఏర్పాటుచేస్తామని ఎవ్రన్ సంస్థ వెల్లడి -పెట్టుబడిదారులకు , ప్రజలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అనుకూల వాతావరణం కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం -పుష్కలంగా సౌర, పవన వనరులతో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ఆంధ్ర ప్రదేశ్ అనుకూలం -ముఖ్యమంత్రి , ఇంధనశాఖామంత్రి ల తో సమావేశమైన బ్రూక్ ఫీల్డ్ …

Read More »

కడప ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సీరియస్

-వరుస ఘటనలపై సీఎండీలతో అత్యవసర సమీక్షా సమావేశం -ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి -సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి -రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టాలని సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కడపలో విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి చెందడంపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస విద్యుత్ ప్రమాదాలపై సీఎండీలతో మంత్రి సచివాలయంలో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. కడప ఘటనపై పూర్తి సమాచారాన్ని వివరించాలని మంత్రి కోరగా… స్పందించిన …

Read More »

ప్రభుత్వం, స్ధిరాస్తి రంగం మధ్య పరస్పర సహకారం అవసరం 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : స్థిరమైన పట్టణాభివృద్ధి ప్రణాళిక అమలులో ప్రభుత్వం, స్ధిరాస్తి రంగం మధ్య పరస్పర సహకారం అవసరమని రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. జాతీయ స్దిరాస్తి అభివృద్ది మండలి (నెరెడ్కో) సెంట్రల్ జోన్ నేతృత్వంలో స్ధిరాస్తి రంగ ప్రముఖులు, అమాత్యులు, పార్లమెంటు, శాసన సభ్యులతో బుధవారం నగరంలోని ఎన్ఎసి కళ్యాణ మండపంలో అత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర విజన్‌ను సాధించే క్రమంలో స్మార్ట్ సిటీలు, మౌలిక సదుపాయాల పెంపు, స్థిరమైన …

Read More »

ఇండి గ్యాప్ పొలంబడి కార్యక్రమ నిర్వహణపై అధికారులకు శిక్షణా కార్యక్రమం 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఖరీఫ్ సీజనులో మండలానికి ఒకటి చొప్పున జిల్లాలోని అన్ని మండలాల్లో ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ నిమిత్తం రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో అనుసంధానించి, మేలైన వ్యవసాయ పద్ధతుల పొలంబడి కార్యక్రమాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ పధకము సమర్ధవంతంగా అమలు చేయాలనే సంకల్పంతో బుధ‌వారం జిల్లా వ్యవసాయ అధికారిణి, సాకా నాగమణెమ్మ ఆధ్వర్యంలో విజయవాడ లోని ఏ .పి .ఏ.ఓ అసోసియేషన్ హాలులో వ్యవసాయశాఖ లోని డివిజన్ మరియు మండల స్థాయిల అధికారులకు శిక్షణా కార్యక్రమము నిర్వహించడం …

Read More »

దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీ పాలసీ రూపొందిస్తాం.

-రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతాం -ఔత్యాహిక పారిశ్రామికవేత్తలకు ఊతమిస్తాం. -సింగిల్ విండో పాలసీన సమర్థవంతంగా అమలు చేస్తాం. -యువతలో నైపుణ్యాలు పెంచేవిధంగా చర్యలు తీసుకుంటాం. -పాలసీ రూపకల్పనలో అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. -యువతకు ఉపాధి కల్పన పై దృష్టిపెడతాం. -నేటి యువత టెక్నాలజీ అందిపుచ్చుకునే విధంగా నైపుణ్య శిక్షణ అందిస్తాం. -పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తాం. -కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాల శాఖామాత్యులు. విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ ఆంధ్రప్రదేశ్ …

Read More »