Breaking News

Daily Archives: August 24, 2024

ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో బిఎల్ఓలు ఇంటింటి ఓటర్ సర్వే చేస్తున్నారని, కేంద్ర ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజంట్లు సర్వేలో పాల్గొని పరిశీలించవచ్చని తూర్పు ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఈఆర్ఓ) మరియు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఎఎస్ గారు తెలిపారు. శనివారం కమిషనర్ చాంబర్ లో ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. …

Read More »

ఆవులు, పందులను, గాడిదలను యజమానులు తమ ఇంటి పరిసరాల్లోనే కట్టడి చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆవులు, పందులను, గాడిదలను యజమానులు తమ ఇంటి పరిసరాల్లోనే కట్టడి చేసుకోవాలని, రోడ్ల మీదకు వదిలితే వాటిని నగరపాలక సంస్థ సిబ్బంది స్వాధీనం చేసుకుంటారని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో నగర ప్రజలకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రదాన రోడ్లపై ఆవులను సదరు యజమానులు ఇష్టానుసారం వదిలి వేయడం వలన వాహనదార్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, …

Read More »

త్రాగునీటి సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర శివారు ప్రాంతాల ప్రజలకు కూడా తగిన త్రాగునీటి సరఫరా చేసేలా నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ స్వర్ణభారతి నగర్ లోని పలు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా, పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ నగర శివారు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకి సంబందించి ప్రజల నుండి పలు ఫిర్యాదులు అందుతున్నాయని, …

Read More »

సుజనా చౌదరి ఔదార్యం

-కార్యకర్తకు ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్యంతో మరణించిన బిజెపి కార్యకర్త పిళ్లా దుర్గారావు కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో శనివారం ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది 48 వ డివిజన్ బిజెపి అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ తో కలిసి పరామర్శించారు. నిరుపేద అయినటువంటి పిళ్ళ దుర్గారావు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని హరి ప్రసాద్ ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే తమ కార్యాలయ సిబ్బందికి మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేయాలని …

Read More »

4 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్

ప్రకాశం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం మారెళ్లలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ను శనివారం ప్రారంభించారు. ఓర్సీహెచ్ సంస్థ నిర్వహణలో ఈ ప్లాంట్ రూపుదిద్దుకుంది. సుమారు 18 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్ ను కేవలం 80 రోజుల్లోనే పూర్తి చేశారు. ఈ సోలార్ ప్లాంట్ నుంచి విద్యుత్ మారెళ్ల సబ్ స్టేషన్ కు అనుసంధానం చేశారు. అనంతరం ఇది గ్రిడ్ కు కనెక్ట్ అవుతుందని అధికారులు తెలిపారు. …

Read More »

జిల్లాలో డిటీసీ ద్వారా ఇసుక రవాణా కోసం అనుమతి పొందిన 134 వాహనాలు

-ఇసుక రవాణా కు వాహనాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి -ఇతర జిల్లాల వాహనాల పేర్లు రిజిస్ట్రేషన్ ఆయా జిల్లాల్లో తప్పనిసరి -ఇక్కడ కూడా వారి ఐచ్ఛికత మేరకు రిజిస్ట్రేషన్ చేపట్టాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక రవాణా చార్జీలు వసూలు చేసేందుకు జిల్లా స్థాయి కమిటీలో ఆమోదించిన ధరలను అనుసరించి స్లాట్ నమోదు చేసే సమయంలొ రవాణా చార్జీలను వసూళ్లు చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ ఆర్డీఓ కొవ్వూరు, …

Read More »

“యూత్ ఫెస్టివల్ 2024”

-యువతలో హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన -29 ఆగస్టు – మారథాన్ రెడ్ రన్ & క్విజ్ పోటీలు -డా ఎన్ వసుంధర రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు, మార్గదర్శకాలతో జిల్లాలో యువతలో హెచ్.ఐ.వి. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆద్వర్యంలో యూత్ ఫెస్టివల్ కార్యక్రమమును ఆగస్టు 29 న నిర్వహించడం జరుగుతున్నదని తూర్పు గోదావరి జిల్లా లేప్రసి,ఎయిడ్స్ మరియు టిబి అధికారిణి డా. ఎన్ .వసుంధర …

Read More »

కాలుష్య రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

-చెత్త నియంత్రణ  ఇంటి నుంచే ప్రారంభం కావాలి -పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న శానిటేషన్ కార్మికులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. -ద్విచక్ర వాహనదారులందరూ  తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలి. -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిశుభ్రత కాలుష్య రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో చెత్త నియంత్రణ దిశగా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. శనివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా …

Read More »

పొట్టీలంక నుంచి కడియపు లంక వరకూ బోటు విహారం

-కలెక్టర్ ప్రశాంతి కడియం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇకో టూరిజం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పొట్టిలంక గ్రామం నుంచి కడుపు లంక కడియపులంక వరకు కెనాల్ లో బోటింగ్ విహారం చేసే విధానం లో భాగంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం ఉదయం పర్యాటకశాఖ అధికారులతో కలిసి కడియం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి , జిల్లా పర్యటక అధికారులకు సూచనలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటకపరంగా మరింత అభివృద్ధి …

Read More »

నెలటూరు రైతు సేవా కేంద్రాన్ని (ఆర్ ఎస్ కె) తనిఖి చేసిన జెసి చిన్న రాముడు

చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో మౌలిక సదుపాయాలు, రికార్డుల నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శనివారం ఉదయం చాగల్లు మండలం నెల్లటూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని పౌర సరఫరాలు మార్కెటింగ్ , రెవెన్యు అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు …

Read More »