Daily Archives: August 27, 2024

సుజనా చౌదరి ఔదార్యం

-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్యంతో మరణించిన టిడిపి కార్యకర్త ఎర్ర రాజు కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో మంగళవారం ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది 51 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు యండి జాహీద్ తో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిరుపేద అయినటువంటి ఎర్ర రాజు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని జాహీద్ ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే తమ కార్యాలయ సిబ్బందికి మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక …

Read More »

బిజెపిలో చేరిన వైసిపి కార్పొరేటర్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో వైసిపి కి మరోసారి షాక్ తగిలింది. 39 వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ మంగళవారం బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) సమక్షంలో గాయత్రి నగర్ లోని పురందేశ్వరి నివాసంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే పశ్చిమ లోని వైసిపి కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, హర్షద్, మైలవరపు మాధురి లావణ్య, టిడిపి ఎంపీ కేశినేని చిన్ని సమక్షంలో టిడిపి …

Read More »

ఏపీలో సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు స్వస్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. ఏపీలో సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బ్రిటీష్ కాలపు రాచరికపు పోకడలకు స్వస్తి పలకనున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ , స్టాంపులు, రిజిస్టషన్ల శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా ప్రతిపాదనలు సిద్దం చేసారు. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్ల సీటింగ్ ఉండేలా చర్యలు ప్రారంభించారు. సబ్ రిజిస్ట్రార్లు …

Read More »

నేత్రదానంతో మరికొందరికి చూపు

-వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మనిషి మరణానంతరం తన నేత్రదానంతో మరికొందరికి చూపు రప్పించవచ్చని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్, జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్ పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకూ నిర్వహిస్తున్న జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ప్రచార పోస్టర్, కరపత్రాన్ని ఆయన సోమవారం మంగళగిరి ఎపిఐఐసి భవన సముదాయంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో దాదాపు 1,312 …

Read More »

గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి

-అర్బన్, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చెయ్యండి -స్థానికంగా వేడుకలు నిర్వహించే నిర్వాహక కమిటీలతో సమావేశం నిర్వహించాలి -గణేష్ పందిళ్ళు కు అర్బన్ లో మునిసిపల్ కమిషనర్, మండల స్థాయిలో తహసీల్దార్ చే అనుమతులు జారీ -పెండాల్సు భధ్రత అత్యంత ప్రాధాన్యత -సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలి -సేఫ్టీ ధ్రువపత్రాలు జారీ చేసిన చోట్ల మాత్రమే పందిళ్ళు ఏర్పాటుకు అనుమతి -పర్యావరణ పరిరక్షణ దిశగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి -ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడవద్దు -రూట్ మ్యాప్ ప్రకారం నిమజ్జనం సమయాలు …

Read More »

ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ లో స్తబ్దత గా ఉంటే ఎలా?

-కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక రూపొందించడం ద్వారా గృహ నిర్మాణ పనులు చేపట్టి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం పి ఎమ్ ఏ వై – గృహ నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గృహ నిర్మాణ లక్ష సాధనలో నిర్ణాయక పాత్ర, సరైనా ప్రణాళికా బద్ధంగా పనులు చేపట్టడం ద్వారా మాత్రమే సాధ్యం …

Read More »

ఇసుక రవాణా చేసే వాహనాలు జాయింట్ కలెక్టర్ ఆమోదం తప్పనిసరి

-ట్రక్కు షీట్ లో డెలివరీ చిరునామా సమగ్ర వివరాలు తప్పనిసరి -పీజీఆర్ఎస్ పెండింగ్ అర్జీల పై ప్రతివారం ఆడిటింగ్ నిర్వహిస్తా .. మండల స్థాయిలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చెయ్యండి -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక కోసం రీచ్ లకి వొచ్చే వాహనాలకు స్లాట్ కేటాయింపు చేసి ట్రక్కు షీట్ జారీ చెయ్యాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం డివిజన్ మండల స్థాయి అధికారులతో ఇసుక రవాణా, పి జి …

Read More »

పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల్లో ప్రాణ ఆస్తి నష్ట నివారణకు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కంపెనీ యాజమాన్యాలను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. సమావేశానికి ముందు కలెక్టర్ జిల్లాలోని పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆయా కంపెనీలు పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కంపెనీ వారి కార్మికులు …

Read More »

ప్రతి రైతు భూమికి సరైన సరిహద్దులతో కూడిన సర్వే ధ్రువీకరణ పత్రం అందించాలి

-త్వరలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సిద్ధపడాలి -రెవిన్యూ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలి -రెవిన్యూ కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవిన్యూ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ మీకోసం మీటింగ్ హాల్లో రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించి రెవెన్యూ శాఖకు సంబంధించి గ్రీవెన్స్, నీటి తీరువా, నాలా పన్ను వసూళ్లు, మ్యూటేషన్స్, సిసిఆర్సి కార్డుల జారీ, జిల్లాలో …

Read More »

39 వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ : డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించనున్న సందర్భంగా నేటి మంగళవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ సచివాలయం లో నేత్రదాన పక్షోత్సవాల పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా చూడాలని, నేత్రదానం చేసి అంధులకు చూపు ఇవ్వాలని కోరారు. మరణానంతరం మీ కళ్ళు నశించిపోకుండా, ఇద్దరు కార్నియా అంధులకు చూపును …

Read More »