అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదార్లు,గ్యాస్ పైపులైన్ల నిర్మాణం,రైల్వే ప్రాజెక్టులు,అమృత్-2.0 వంటి ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లి నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వీడియో సమావేశం ద్వారా సమీక్షిస్తున్నారు. ఈసమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్,రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్,టిఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి కాంతాలాల్ దండే,జె.నివాస్, హరి నారాయణ,గంధం చంద్రుడు,తదితర అధికారులు పాల్గొన్నారు.
Read More »Daily Archives: August 28, 2024
మంజూరైన గృహాలను నిర్మించకుంటే రద్దయ్యే అవకాశం.
-రానున్న జూన్ నాటికీ మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి. -గృహానిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయండి. -కాలనీలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం -జిల్లా కలెక్టర్ డా.జి. సృజన జి కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : పేదవానికి సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై పథకం ద్వారా పక్కా గృహాలను మంజూరు చేయడం జరిగిందని లబ్ధిదారులు మంజూరైన ఇళ్ల నిర్మాణం చేపట్టి రానున్న జూన్ మాసం నాటికీ పూర్తి చేయకుంటే నిధులు విడుదలయ్యే అవకాశం ఉండదని …
Read More »రానున్న మార్చి నాటికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం…
-కుదప వద్ద శరవేగంగా జరుగుతున్న కృష్ణా జలాల ప్రాజెక్టు పనులు.. -ఎ.కొండూరుతో పాటు మరో మూడు మండలాలలో నీటి శాంపిళ్లను పరీక్షిస్తాం.. -అవసరమైన అన్ని ఆవాసాలకూ సురక్షిత కృష్ణా జలాలను సరఫరా చేస్తాం.. -వ్యాధి ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. -వ్యాధి బారిన పడిన వారికి పూర్తి వైద్య సహాయం అందిస్తాం.. -జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎ.కొండూరు పరిసర ప్రాంతాల గ్రామాలకు సురక్షిత కృష్ణా జలాలను అందించేందుకు రూ.50 కోట్లతో వ్యయంతో చేపట్టిన …
Read More »ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్ ల ఏర్పాటు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్ ల ఏర్పాటుకు అనువైన స్థలాల గుర్తింపుకు నగరపాలక సంస్థ, అదనపు కమిషనర్, సిటి ప్లానర్, సూపరిండెంట్ ఇంజినీర్ల ఆధ్వర్యంలో 3 కమిటీలను ఏర్పాటు చేశామని, వీధి వ్యాపారులు కూడా ఆయా జోన్లకు వెళ్లడానికి సమాయత్తం కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న జనాభా, వాహనాల ట్రాఫిక్ …
Read More »అంగన్వాడి కేంద్రాలకు అవసరమైన కందిపప్పు సరఫరా టెండర్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం
-జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా కొనుగోలు కమిటీ చైర్మన్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలోని 12 ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ లోని 2492 అంగన్వాడి కేంద్రాలకు అవసరమైన కందిపప్పు (1Kg ప్యాక్) సప్లమెంటరీ న్యూట్రీషన్ ప్రోగ్రామ్ ద్వారా సరఫరా చేయుటకు ఆసక్తి గల ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ నందు రిజిష్టర్డ్ అయిన Millers/Wholesalers/Govt. Agencies వ్యాపారస్తులు నుండి టెండర్ కోరనైనది. టెండరు అమ్మకం ప్రారంభ తేది: 29.08.2024 ఉ:10గం. టెండరు అమ్మకం చివరి తేది: 04.09.2024 …
Read More »వనమహోత్సవం 2024 పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా అటవీ శాఖ అధికారి సతీశ్ రెడ్డి మరియు సంబంధిత అధికారులతో కలిసి వన మహోత్సవ కరపత్రాలు మరియు వన మహోత్సవం 2024 పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ వన మహోత్సవం 2024 కరపత్రాలు మరియు పోస్టర్ ను సంబంధిత అటవీ శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా …
Read More »పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు తప్పకుండా పరిశ్రమల యాజమాన్యాలు అమలు చేయాలి
-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ -పరిశ్రమల్లో సెక్యూరిటీ ప్లాన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధంగా ఉండాలి: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు తప్పకుండా పరిశ్రమల యాజమాన్యాలు అమలు చేయాలని,పరిశ్రమల్లో సెక్యూరిటీ ప్లాన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు వివిధ హజర్డస్ పరిశ్రమల ప్రతినిధులతో, పరిశ్రమల శాఖ, పోలీస్ తదితర సంబంధిత …
Read More »తిరుపతి ప్రభుత్వ గర్ల్స్ హోమ్ ను పరిశీలించిన ఏపి ఎస్సీసీపీసీఆర్ సభ్యులు సీతారాం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని సరోజిని దేవి రోడ్ లోగల ప్రభుత్వ బాలికల హోమ్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఇటీవల ఈహోమ్ కు చెందిన విద్యార్థినిపై లైంగిక దాడి జరగడంపై సీతారాం ఆరా తీశారు,హోమ్ సూపరింటెండెంట్ సి.నయోమి తోను ఇతర సిబ్బందితో మాట్లాడి సంభందిత వివరాలు అడిగి తెలుసుకున్నారు,హోమ్ పర్యవేక్షకుల నిర్లక్ష్యమా,లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా అన్నదానిపై పూర్తి సమగ్ర నివేదిక ఆంధ్ర ప్రదేశ్ …
Read More »అబద్ధాల పునాదులపై జగన్ రాజకీయం
-వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం -జగన్ కు మంత్రి బహిరంగ లేఖ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వెలువరించిన తీర్పు తరువాత కూడా గుణపాఠం నేర్చుకోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అబద్ధాల పునాదులపై ప్రజా వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన జగన్మోహన్ రెడ్డికి బుధవారం బహిరంగ లేఖ రాశారు. ఈ ఏడాది మేలో జరిగిన …
Read More »తూర్పు పశ్చిమ గోదావరీ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు సెప్టెంబర్ మూడులోగా ఫారం 19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
-డిఆర్వో నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎలక్ట్రోరల్ రోల్స్ నందు నమోదు కొరకు CEO/ECI వారు షెడ్యూల్ జారి చేసియున్నారని జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సదరు షెడ్యూల్కు అనుగుణంగా ఓటరు నమోదుకు అర్హత తేదీగా 01.11.2024ని సూచించినారనితెలిపారు. ఇందుకు ప్రభుత్వ మరియు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో , జూనియర్ కళాశాలలో , ఉన్నత విద్య సంస్థలలో ఆరు సంవత్సరాల లోపు కనీసం …
Read More »