Breaking News

Daily Archives: August 29, 2024

గంజాయిపై ఉక్కుపాదం మోపండి

-రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు సవిత -మంత్రిని కలిసిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జేఏసీ -సెబ్ రద్దుపై ధన్యవాదాలు తెలిపిన జేఏసీ సభ్యులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి సాగు, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులను గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత ఆదేశించారు. గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్బ్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవితను తాడేపల్లిలోని ఆమె క్యాంపు కార్యాలయంలో …

Read More »

మరో నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 

-జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా పేద క్రీడాకారులకు సహాయార్థం విరాళం ప్రకటించిన మంత్రి -ఇదివరకే రాజధాని నిర్మాణానికి మొదటి నెల జీతం అందజేశారు  విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన నెల జీతం జీతాన్ని ₹3,16,000/- రూపాయలను పేద క్రీడాకారుల అవసరాలకు నిమిత్తం అందజేస్తున్నట్లుగా తెలిపారు. ఇదివరకే తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర …

Read More »

తెలుగు భాషను పరిరక్షించుకుందాం

-రాష్ట్ర బీసీ, ఈడబ్య్లూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాతృ భాషతోనే మానవ జాతి మనుగడ సాధ్యమవుతుందని, తెలుగు భాషను తెలుగు ప్రజలంతా ఐక్యంగా పరిరక్షించుకుందామని రాష్ట్ర బీసీ, ఈడబ్య్లూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తో కలిసి గురువారం తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాలు వేసి తెలుగు భాషాదినోత్సవం జరుపుకున్నారు. తెలుగు భాషోద్యమ నాయకుడు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి …

Read More »

ఎం.పి. కేశినేని శివనాథ్ కి వినతి పత్రం అందించిన ఐ.ఎఫ్.టి.యు. నాయకులు

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారుల వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకులు ఎం.పి కేశినేని శివ నాథ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో గురువారం కలవటం జరిగింది .అధిక మొత్తం లో విధిస్తున్న చలానాల నుంచి, సీజ్ చేసిన ఆటో లను విడిపించాల్సిందిగా కోరారు..ఆటో నాయకులు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించారు.సంబంధిత అధికారులతో …

Read More »

ప్రమాద రహిత సమాజం కోసం యువత కృషి చేయాలి: ఎం.పి.కేశినేని శివ నాథ్

-వికలాంగులకు హైడ్రాలిక్ ప్రోస్థేటిక్ లెగ్స్ పంపిణీ -సుదీక్షన్ ఫౌండేషన్, రోడ్ సేఫ్టీ ఎన్.జీ.వో సంస్థ సంయుక్త నిర్వహణ విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : యువత, విద్యార్థులు అతి వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడి వికలాంగులుగా మారి, తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చుతున్నారని ఎం.పి కేశినేని శివనాథ్ అన్నారు. సుదీక్షన్ ఫౌండేషన్, రోడ్ సేఫ్టీ ఎన్.జీ.వో సంయుక్తంగా విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్.టి.ఆర్ భవన్ లో గురువారం నిర్వహించిన హైడ్రాలిక్ ప్రోస్థేటిక్ లెగ్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుదీక్షణ్ …

Read More »

రాజకీయాలలో గెలుపోవటములు సహజం… : దేవినేని అవినాష్

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాలలో గెలుపోవటములు సహజమని తమ తప్పులు సరిదిద్దుకుంటూ వైసీపీ బలోపేతానికి మరింత కష్టపడి పని చేస్తామని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చిరస్థాయిగా ఉండిపోతాయని అన్నారు.. ఏ కష్టం వచ్చినా వైసిపి కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 12వ డివిజన్ అయ్యప్ప నగర్ లో వైసిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది.. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం …

Read More »

క్రీడ‌ల‌ను మరింత ప్రోత్స‌హిందుకే స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్ర‌దానం…..

-ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ భానుమూర్తి రాజు -దేశంలోనే మొట్ట మొద‌టిసారిగా జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్త‌మ స్కూళ్ల‌కు అవార్డులు అంద‌జేత‌ -రాష్ట్రస్థాయిలో నున్నహైస్కూల్‌కు రెండోస్థానం, ఎన్‌టీఆర్ జిల్లాస్థాయిలో ప్ర‌థ‌మ‌స్థానం విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : ఎవ‌రికైనా క్రీడ‌లలో రాణించ‌టం ద్వారానే మంచి గుర్తింపు ల‌భిస్తుంద‌ని ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ (ఐపీఈ), స్కూల్ గేమ్స్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎప్ఐ) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జీ భానుమూర్తి రాజు అన్నారు. ఒక క్రీడాకారుడి గెలుపు అతని కుటుంబానికే కాకుండా, గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి, …

Read More »

రాష్ట్రంలో క్రీడారంగానికి మంచిరోజులొచ్చాయి

– క్రీడాకారులు, కోచ్‌లు, స్పోర్ట్స్ అకాడ‌మీల‌కు శుభ‌దినాలు – అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై రాణించేందుకు శాప్ ద్వారా క్రీడాకారుల‌కు ప్రోత్సాహం – పేద క్రీడాకారుల‌కు స‌హాయం అందించేందుకు ప్ర‌త్యేక కార్ప‌స్ ఫండ్ ఏర్పాటు దిశ‌గా కృషి – ముఖ్య‌మంత్రి గ‌తంలో చేసిన కృషి వ‌ల్లే అంత‌ర్జాతీయంగా తెలుగుతేజాలు రాణిస్తున్నారు – రాష్ట్ర ర‌వాణా, యువ‌జ‌న‌, క్రీడాశాఖ మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్‌రెడ్డి విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : గౌర‌వ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుగారు క్రీడ‌ల‌కు అత్యంత ప్రాధాన్య‌మిస్తున్నార‌ని.. ఇప్పుడు రాష్ట్రంలో క్రీడారంగానికి మంచిరోజులొచ్చాయ‌ని రాష్ట్ర …

Read More »

లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు గురువారం ఉదయం నగర పరిధిలోని 45వ సానిటరీ డివిజన్ ఏరియాలో రోటరీ నగర దగ్గర గల ఐరన్ స్క్రాప్ వ్యాపారస్తులకి రెండుసార్లు 15 రోజుల వ్యవధిలో నోటీసి ఇచ్చి ట్రేడ్ లైసెన్స్ తీసుకోమని అనేక పర్యాయములు చెప్పినప్పటికీ వారు ఎటువంటి చర్యలు తీసుకొని కారణంగా కరీముల్లా ఐరన్ స్క్రాప్ బిజినెస్ వారికి ద్వారకా వీధిలో గల నేత్ర ఎంటర్ప్రైజెస్ …

Read More »

రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన సంయుక్త వ్యవసాయ సంచాలకులు మరియు e-పంట నోడల్ అధికారిణి విజయ భారతి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి గురువారం వ్యవసాయ కమీషనరు వారి కార్యాలయం నుండి సంయుక్త వ్యవసాయ సంచాలకులు మరియు e-పంట నోడల్ అధికారి విజయ భారతి  రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లి రైతు సేవా కేంద్రం తనిఖీ చేశారు. తనిఖీ లో భాగంగా మండలం లోని రైతు సేవా కేంద్రాల సిబ్బంది అందర్నీ కలిసి e- పంట యాప్ లో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల నమోదు చేసే విధానాన్ని పరిశీలించారు మరియు e- పంట నమోదులో ఏమైనా సమస్యలు ఉన్నాయా …

Read More »