Daily Archives: August 30, 2024

కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన పోస్టర్లను దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం  సచివాలయం లో ఆవిష్కరించారు. బ్రాహ్మో త్సవాలను భక్తులమనోభావాలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించాలని కోరారు. చిత్తూర్ జిల్లాకు చెందిన వేద పండితులు, నాయకులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7 నుంచి 27 వ తేదీవరకు కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. దక్షిణాది నాలుగు భాషల్లో పోస్టర్లు రూపొందించారు. ఈ కార్యక్రమలో కమీషనర్ సత్యనారాయణ, పూత్తలపట్టు ఎమ్మెల్యే మురళి మొహన్, …

Read More »

ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా అధికారులను ఆదేశించారు. కంచికచర్ల మండలం కీసర ఇసుక స్టాక్ పాయింట్ వద్ద శుక్రవారం జాయింట్ కలెక్టర్ నిధి మీనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంపిణీ విధానాన్ని,స్టాక్ పాయింట్ వద్ద రిజిస్టర్ పరిశీలించారు. స్టాక్ పాయింట్ వద్ద బుకింగ్ అవకాశం ఉండకూడదన్నారు. నూతన పాలసీ అమలులోకి వచ్చే వరకు యెటువంటి విమర్శలకు, లోటుపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేయాలని జాయింట్ …

Read More »

ఎటువంటి లోటు పాట్లు లేకుండా యూపీఎస్సి పరీక్షలను పక్కాగా నిర్వహించాలి

-అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా యేర్పాట్లు చేయండి -డిఆర్ఓ వి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం నిర్వహించనున్న యూపీఎస్సి పరీక్షలను ఎటువంటి లోటు పాట్లు లేకుండా నిర్వహించాలని డిఆర్ఓ వి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సి ) ద్వారా నిర్వహించే పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో వెన్యూ సూపర్వైజర్లు, లైజన్ కం ఇన్స్పెక్టింగ్ అధికారులతో డిఆర్ఓ వి. శ్రీనివాసరావు సమావేశంనిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీని విజ‌య‌వంతం చేయండి

– ఈ నెల 31వ తేదీనే పూర్తిస్థాయిలో పంపిణీకి కృషి చేయండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన పంపిణీ చేసే ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీని ఒకరోజు ముందుగానే ఈనెల 31వ తేదీన శనివారం ఉదయం ఆరు గంట‌ల‌కు ప్రారంభించి, ఒక్క‌రోజులోనే పూర్తిస్థాయిలో పంపిణీకి కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం డీఆర్‌డీఏ అధికారులు, ఎంపీడీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లతో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. …

Read More »

డిగ్రీ విద్యార్థుల‌కు ఆర్‌బీఐ క్విజ్ పోటీలు

-స‌ద్వినియోగం చేసుకోవాలి: క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్‌బీఐ నిర్వ‌హించే క్విజ్ పోటీల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అన్నారు. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా దేశవ్యాప్తంగా డిగ్రీ విద్యార్థుల‌కు క్విజ్ పోటీల‌కు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన గోడ ప‌త్రిక‌ను క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా త‌దిత‌రుల‌తో క‌లిసి శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో ఆవిష్క‌రించారు. ఈ క్విజ్ పోటీల‌కు ప్ర‌తి …

Read More »

ప్ర‌కృతి సేద్యానికి చేయూత‌..

– ఔత్సాహిక రైతుకు డీఆర్‌డీఏ ద్వారా ఆర్థిక స‌హ‌కారం – క‌లెక్ట‌ర్ డా. జి.సృజన ద్వారా చెక్కు పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్య‌క‌ర జీవ‌నానికి స్వ‌చ్ఛమైన ఉత్ప‌త్తులు అందించ‌డంతో పాటు ప‌ర్యావ‌ర‌ణానికీ కొండంత మేలు చేసే ప్ర‌కృతి సేద్యం దిశ‌గా క‌దిలి, త‌మ ఆలోచ‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టి ప‌దిమందికీ ఆద‌ర్శంగా నిలుస్తున్న రైతుల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయ‌స‌హ‌కారాలు అందించ‌డం జ‌రుగుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అన్నారు. నాన్ పెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ (ఎన్‌పీఎం) దుకాణం ఏర్పాటు ద్వారా క‌షాయాలు, విత్త‌నాలు, లింగాక‌ర్ష‌క …

Read More »

ఇసుక స్టాక్‌ యార్డ్‌ల వద్ద గట్టి నిఘా పెట్టండి..

-ఇసుక సరఫరాలలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించం.. -యార్డ్‌లలో టోకెన్లు లేని వాహనాలను గుర్తిస్తే సీజ్‌ చేయండి.. -కీసర స్టాక్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌ సస్పెన్షన్‌.. జెసిబి కాంట్రాక్ట్‌ రద్దు.. -జిల్లా కలెక్టర్‌ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక సరఫరా విధానంలో అత్యంత పారదర్శకతను పాటించాలని స్టాక్‌ యార్డ్‌ల వద్ద గట్టి నిఘా పెట్టాలని ఎటువంటి అవకతవకలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, టోకెన్లు లేని వాహనాలు స్టాక్‌ యార్డ్‌లలో గుర్తిస్తే తక్షణమే స్వాదీనం చేసుకుని స్టాక్‌ యార్డ్‌ ఇన్‌చార్జులపై చర్యలు తీసుకోవాలని …

Read More »

హరితాంధ్ర కోసం అడుగేద్దాం పచ్చని భవితకు బాట వేద్దాం…

-అమ్మ కోసం మొక్క (ఏక్ పెద్ మా కే నామ్) నినాదంతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి… -జిల్లా కలెక్టర్ డా.జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ పదానికి కార్యరూపందాల్చేలా ఒక్కరు హరితాంధ్ర కోసం అడుగులు వేసి భవితకు పచ్చతోరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.జి. సృజన పిలుపునిచ్చారు. వన మహోత్సవం 2024 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బిషప్ అజరయ్య …

Read More »

సహేతుక కారణాలు లేని మాతా శిశు మరణాలకు భాధ్యత వైద్యాధికారులదే…

-మాతా శిశు మరణాలలో లోపాలు గుర్తిస్తే సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకుంటాం.. -ప్రాణాపాయ పరిస్థితి వరకు ఉపేక్షించి జిజిహెచ్‌కు పంపడం సరికాదు. -ప్రభుత్వ వైద్యులకు జవాబుదారితనం ఉండాలి.. -జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సహేతుక కారణాలు లేని మాతా శిశు మరణాలకు వైద్యాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మరణాలలో వైద్యుల లోపం గుర్తిస్తే చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని మాతా శిశు ఆరోగ్యం ప్రాణాపాయ పరిస్థితి వరకు తీసుకువచ్చి చివరి దశలో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి పంపడం …

Read More »

మారథాన్ (5K రన్) 2024

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థాయిలో కళాశాల విద్యార్థులు, రెడ్ రిబ్బన్ క్లబ్ సభ్యులతో కూడిన యువతీ యువకులతో మారథాన్ (5K రన్) 2024 నిర్వహించనున్నామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎ. సిరి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ వారి సలహా మేరకు సెప్టెంబర్ 3న మారథాన్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. ఉదయం 6 గంటలకు BRPS రోడ్, …

Read More »