Daily Archives: August 31, 2024

భారీ వర్షాల నేపధ్యంలో మంత్రి వంగలపూడి అనిత పర్యవేక్షన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, రెవెన్యూ(విపత్తుల నిర్వహణ) శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా, సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌ జి.జయలక్ష్మి, సీఎల్‌ఏ సెక్రటరీ ఎన్ ప్రభాకర్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది డైరెక్టర్ కృష్ణాతేజ, విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి నిరంతరం …

Read More »

వినాయక చవితి ఉత్సవాలను అన్ని శాఖల సహకారంతో సమన్వయంతో నిర్వహించాలి

-నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాలను పకడ్బందీగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సజావుగా నిర్వహించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. శనివారం ఉదయం స్థానిక తుదా సమావేశ మందిరంలో రానున్న వరసిద్ధి వినాయక ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం కార్యక్రమాల నిర్వహణపై నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ, నిర్వాహకులు తదితరులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

జలమయ ప్రాంతాలను పరిశీలించిన మంత్రి కొలుసు పార్ధ సారధి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లా నూజివీడు పట్టణానికి సమీపంలో మొగలు చెర్వు, పోతిరెడ్డి పల్లి ఊర చెర్వు,అన్నవరం పెద్ద చెర్వు గట్లు భారీ వర్షాలుకు తెగి పడి పోవడంతో నూజివీడు పట్టణ సమీపంలోని వెలంపేట తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ ప్రాంతాలను రాష్ట్ర గృహా నిర్మాణం,సమాచార పౌర సంభందాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి పరిశీలించి ప్రజలను, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలను నూజివీడు జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ కుతరలిస్తున్నారు. …

Read More »

గిరిజన విద్యార్థుల అస్వస్థత పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డుంబ్రిగుడ మండలం, కొర్రాయి పంచాయతీ జాముగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రి పాలైన విద్యార్థులు ఆరోగ్యం పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరా తీసారు.జిల్లాకలెక్టర్ దినేష్ కుమార్ తో ఫోన్ లో పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.అరకు కు ఎంతదూరం అనే విషయాలతో పాటు మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా అని కలెక్టర్ ను అడిగారు. ఎందువల్ల అస్వస్థత కు గురయ్యారు …

Read More »

ఘరానా మోసం చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలి…

-గ్రూప్స్ అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో పరిగణన, స్థలాల పేరిట కోట్ల రూపాయల ఘరానా మోసం చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని, హోమ్ మంత్రిని కోరిన పురందరేశ్వరి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి వారధి కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి ప్రజలనుండి పలు వినతులను స్వీకరించి, పరిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థలాల పేరిట ప్రజలనుండి కోట్ల రూపాయలను వసూలు చేసి మోసం చేసిందని పలువురు బాధితుల వినతుల మేరకు దుర్గాదేవి అనే మహిళపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర …

Read More »

తుఫాను,భారీ వర్షాలపై తాడేపల్లి కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి సిఎస్ సమీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తుఫాను,భారీ వర్షాలపై శనివారం తాడేపల్లి లోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి సిసిఎల్ఏ జి.జయలక్ష్మి తదితర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారి శనివారం రాత్రికి విశాఖపట్నం-కళింగపట్నాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు అందురూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని …

Read More »

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఉదయం నుంచి నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : • అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలపై సమీక్షిస్తున్న సిఎం. • మరో సారి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సిఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డివోలు, డిఎస్పీలతో మాట్లాడి తాజా పరిస్థితిపై సమీక్షించిన సిఎం. • సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణం విడుదల చేయాలని సిఎం ఆదేశం • భారీ వర్షాల కారణంగా 8 మంది చనిపోయినట్లు వివరించిన అధికారులు – బాధిత కుటుంబాలకు …

Read More »

కొండచర్యలు విరిగిపడిన స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో గత 24 గంటలుగా ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మొగల్రాజపురం ఏరియాలో కొండచర్యలు విరిగి పడినట్లు సమాచారం అందిన వెంటనే పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. సంఘటనా స్థలానికి చేరుకుని  సహయక చర్యలు అందించాలని  ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎన్. డి. ఆర్. ఎఫ్ ; ఎస్. డి. ఆర్. ఎఫ్, పోలీసులు, రెవిన్యూ మరియు మున్సిపల్ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టి శిధిలాలను తొలగించి, మృతదేహాలను వెలికితీసి, క్షతగాత్రులను …

Read More »

నగరంలో ఘనంగా శారద విద్యా సంస్థల ‘ఫ్రెషర్స్‌ డే’ సందడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఘనంగా శారద (ఇంటర్మీడియట్‌) విద్యా సంస్థల 10 వసంతాల ‘ఫ్రెషర్స్‌ డే’ వేడుకలు జరిగాయి. శనివారం బందరురోడ్డులోని ఎ ప్లస్‌ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కె.జి.వి. సరిత మాట్లాడుతూ నేటి సమాజానికి విలువలతో కూడిన విద్య అవసరమని, శారద విద్యా సంస్థలు చక్కటి విలువలతో కూడిన విద్యను అందిస్తుందని అభినందించారు. విద్యార్థి ఉజ్జ్వల భవిష్యత్తును రూపొందించే కేంద్రాలుగా ఉన్నటువంటి కళాశాలలను ప్రతి …

Read More »

కొండచరియలు విరిగి నలుగురు మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

-మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందడం పై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలపై అధికారులతో సీఎం మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా …

Read More »