Daily Archives: August 31, 2024

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

-ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి -మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. అత్యవసరం అయితే తప్పించి ఎవరూ బయటకు రావొద్దు. జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో రోడ్డు,రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ, యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడిన చోట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలి. వర్షాలకు ఉధృతంగా ప్రవహించే వాగుల …

Read More »

నాబార్డు జిల్లా స్థాయి ఎఫ్‌పిఓ సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి శనివారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో నాబార్డు వారి ఆద్వర్యంలో జిల్లా స్థాయి ఎఫ్‌పిఓ సమావేశం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ సంస్థలచే స్పాన్సర్ చేయబడిన 30 FPO లు పాల్గొని క్రింది అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిడిఎం సునీల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1. FPOలతో వివిధ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల పథకాల వినియోగం 2. FPOలకు జారీ చేయబడిన లైసెన్స్‌ల స్థితి, ఇన్‌పుట్ లైసెన్స్‌ల జారీకి సంబంధించి …

Read More »

తక్షణ సహాయ చర్యలలో ఆర్ పి సిసోడియా

-రోజంతా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి వ్యక్తిగత పర్యవేక్షణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తుఫాను నేపధ్యంలో రాష్ట్రం అతాకుతలం అవుతుండగా విపత్తుల నిర్వహణ (రెవిన్యూ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా సహాయక చర్యల కోసం నేరుగా రంగంలోకి దిగారు. అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ఉదయం నుండే అయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేస్తూ వచ్చిన సిసోడియా, శనివారం విపత్తుల నిర్వహణ సంస్ధ కార్యాలయం నుండి పరిస్ధితిని సమీక్షిస్తూ వచ్చారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై జిల్లా …

Read More »

తిరుప‌తి ఎంపీ ప్రశ్నకి కేంద్ర మంత్రి స‌మాధానం…

-తమిళనాడు ఫిషింగ్ బోట్లు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాదేశిక జలాల్లోకి అనధికారిక ప్రవేశం, అక్రమ చేపల వేట గురించి తిరుప‌తి ఎంపీ ప్రశ్నకి కేంద్ర మంత్రి స‌మాధానం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : స‌ముద్రంలో చేప‌లు ప‌ట్ట‌డం ఆయా తీర ప్రాంత రాష్ట్రాల అధికార ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని కేంద్ర మ‌త్స్య‌శాఖ మంత్రి రాజీవ్ రంజ‌న్ సింగ్ పేర్కొన్నారు. తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలోని మ‌త్స్య‌కారులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై లోక్‌స‌భ‌లో ప్రత్యేక అధికరణ 377 కింద తిరుపతి ఎంపీ డాక్టర్ మ‌ద్దిల గురుమూర్తి గత పార్లమెంటు సమావేశాలలో కేంద్ర …

Read More »

భారీ వర్షాలపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం నుంచి కుండ పోతగా కురుస్తున్న భారీ వర్షాలపై పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) శనివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు.తుఫాను నేపథ్యంలో ఎన్టీఆర్ , కృష్ణా,జిల్లాల పరిస్థితులపై జిల్లా కలెక్టర్ సృజన, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర, పశ్చిమ నియోజకవర్గ తాసిల్దార్ ఇంతియాజ్ పాషా, ఇతర అధికారులతో సుజనా చౌదరి మాట్లాడారు. నాగార్జునసాగర్, పులిచింతల, ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి వేయడంతో, ప్రకాశం బ్యారేజీ లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. …

Read More »

ఎమ్మెల్యే సుజనా ఆదేశాలతో కదిలిన కార్యాలయ సిబ్బంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, సుజనా ఫౌండేషన్ సభ్యులు ఎన్డీయే కూటమి నాయకుల సహకారంతో భారీ వర్షంలోనూ శనివారం తమ సేవలను అందించారు.గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమ లోని రాజా రాజేశ్వరి పేట, ఊర్మిళ నగర్, ప్రియదర్శిని కాలనీ, ఇందిరాగాంధీ కాలనీ, హెచ్ బి కాలనీలతోపాటు అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. ఇళ్లలోని ఫర్నిచర్ ఇతర …

Read More »

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు డి ఆర్ డి ఎ-సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.03.09.2024 మంగళవారం నాడు అవనిగడ్డ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మరియు పామర్రు నియోజకవర్గం కురుమద్ధాలి లో గల రూరల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు డి.విక్టర్ బాబు, జిల్లా ఉపాధి కల్పన అధికారి మరియు ఎస్.శ్రీనివాసరావు, …

Read More »

గుడ్లవల్లేరులో హిడెన్‌ కెమెరాల ఘటన

-నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి -నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కన్వీనర్‌ జమీల్‌ అహ్మద్‌బేగ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ గరల్స్‌ హాస్టల్‌లోని వాష్‌ రూమ్‌లలో హిడెన్‌ కెమెరాల ఘటన ఆందోళనకరమైన విషయమని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కన్వీనర్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం లోతుగా విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇటుంటి ఘటనలు జరుగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. విద్యార్థినుల్లో మానసిక …

Read More »

పీఎంశ్రీ పాఠశాలలకు రూ. 8.63 కోట్లు నిధులు విడుదల

-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్రంలోని 855 పీఎంశ్రీ పాఠశాలలకు ఫేజ్ 1, ఫేజ్ 2 వార్షిక గ్రాంట్ల వినియోగం కింద రూ. 8.63 కోట్లు నిధులు ఆమోదం తెలిపినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు  బి.శ్రీనివాసరావు IAS., శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫేజ్ 1 కింద 662 పాఠశాలలకు రూ. 667.75 లక్షలు, ఫేజ్ 2 కింద 193 పాఠశాలలకు రూ. …

Read More »

సార‌్వత‌్రిక విద‌్యతో ఉజ‌్వల భవిష్యత్తుకు బాటలు

-తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి వి శేఖర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార‌్వత‌్రిక విద‌్యతో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చునని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి వి శేఖర్ అన్నారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ తిరుచానూరులో తిరుపతి జిల్లా ఓపెన్ స్కూల్స్ అధ‌్యయన కేంద్రాల సమన‌్వయ కర‌్తలతో అడ‌్మిషన‌్ల ప‌్రక‌్రియపై శనివారం ఒక రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ దరఖాస్తులు ఆన్ లైన్ చేసే సందర్భంలో తరచుగా చోటు చేసుకుంటున్న తప‌్పిదాలను గురించి వివరించారు.ధరఖాస‌్తుతో పాటుగా …

Read More »