Breaking News

Monthly Archives: August 2024

క్రీడల్లో రాణించాలంటే కఠోర శ్రమ, అంకితభావం అవసరం .. జిల్లా కలెక్టర్

-అవనిగడ్డలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడల్లో రాణించేందుకు కఠోర శ్రమ, అంకితభావం ఎంతో అవసరమని, ఆ దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు సూచించారు. భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా గురువారం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి …

Read More »

వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి

-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయలు కీర్తించిన తెలుగు భాషను.. గ్రాంథికం నుంచి వాడుకకు తీసుకొచ్చిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి అని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవహార భాషా ఉద్యమ కర్త గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనం నందు గురువారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు భాష …

Read More »

ప్రభుత్వం ఫుడ్‌పాయిజన్‌, ఇండస్ట్రీలలో, కాలేజీల్లో, ఫ్యాక్టరీల్లో భద్రతాచర్యలపై మరియు పెరిగిపోతున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి

-నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ, ఏపీ స్టేట్‌ కన్వీనర్‌ జమీల్‌ అహ్మద్‌బేగ్‌ వినతి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలలుగా ప్రభుత్వ, ప్రైవేటు- వసతి గృహాలలో జరుగుతున్న ఫుడ్‌ పాయిజన్‌పైన దృష్టి పెట్టాలని కోరుతున్నట్లు- నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కన్వీనర్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ తెలిపారు. అలాగే ఇండస్ట్రీలు, కాలేజీలు, స్కూళ్లలోని ల్యాబ్‌లలో సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో జరుగుతున్న అనర్థాలపైన దృష్టి సారించి కట్టు-దిట్టమైన భద్రతా చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు- తెలిపారు.. …

Read More »

“తపాలా అదాలత్”

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా సేవలకు సంబంధించి వినియోగదారుల యొక్క ఫిర్యాదులు మరియు సమస్యలు పరిష్కరించు నిమిత్తము తేది: 03/09/2024 మధ్యాహ్న 3:00 గంలకు, డి.యస్.వి.ఆర్. మూర్తి (IPOS), పోస్ట్ మాస్టర్ జనరల్, విజయవాడ రీజియన్, విజయవాడ వారిచే రీజనల్ తపాలా అదాలత్ నిర్వహించబడును. తపాలా సేవలకు సంబంధించిన ఫిర్యాదులు మరియు సమస్యలు ఈ అదాలత్ నందు పరిష్కరించబడును. తపాలా వినియోగదారులు తమ సమస్యలు మరియు ఫిర్యాదులు తేది: 02/09/2024 లోగా “తపాలా అదాలత్” శీర్షికతో …

Read More »

అరుదైన గౌరవం

-డాక్టర్ రఘు రామ్‌కి లభించిన ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సర్జరీ గౌరవ ఫెలోషిప్ – -122 సంవత్సరాల చరిత్రలో భారత ఉపఖండం నుండి ఈ ప్రతిష్టాత్మక సర్జికల్ ఆర్గనైజేషన్ నుంచి ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకున్న అతి పిన్న వయస్కుడు, మొదటి & ఏకైక సర్జన్ -ఈ గుర్తింపును తన తల్లి & మాతృభూమికి అంకితం చేసిన డాక్టర్ రఘు రామ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ రఘు రామ్ పిల్లరిశెట్టి, కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ …

Read More »

పిఠాపురంలో ఎస్.ఎల్.ఆర్.ఎం. ప్రాజెక్టుకు శ్రీకారం

-ప్రాజెక్టును ప్రారంభించిన శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘వ్యర్థాలను సక్రమ పద్ధతిలో వినియోగించగలిగితే గ్రామాల పరిశుభ్రతతో పాటు పంచాయతీలకు సిరుల పంట పండించవచ్చ’ని జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బుధవారం పిఠాపురం నియోజకవర్గం ఫకృద్దీన్ పాలెంలో సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్ మెంట్ ప్రాజెక్టును ప్రారంభించారు. చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు. తడి చెత్త, పొడి చెత్తను సేకరించేందుకు వీలుగా …

Read More »

వరలక్ష్మీ వ్రతం చేసుకునే ఆడపడుచులకు 12 వేల చీరలు పంపించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

-వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురంలో 30వ తేదీన జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతాలు పూజా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను ఎమ్మెల్సీ  పిడుగు హరిప్రసాద్ పర్యవేక్షించారు ఆలయ సంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఆఖరి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చే మాతృమూర్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేయమని ఈవో భవానీ ఆలయ …

Read More »

పోలవరానికి నిధులు కేటాయించిన కేంద్రానికి కృతజ్ఞతలు

-రాష్ట్రానికి ఇదొక సుదినం…శుభపరిణామం -2027 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే లక్ష్యం -కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి నిధుల కేటాయించడం సంతోషదాయం -ఆ రెండు ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా లక్ష ఉద్యోగాల కల్పన -జగన్ లాంటి వ్యక్తి రాజకీయ పార్టీ నడపడం సమాజానికి చేటు -త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం. -మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి …

Read More »

సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ

-సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి నెలా 1వ తేదీన “ పేదల సేవలో” కార్యక్రమం క్రింద పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం, ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం …

Read More »

రాష్ట్ర మంత్రిమండ‌లి స‌మావేశం నిర్ణయాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో బుధవారం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి ఈ-కేబినెట్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. 2014-2019 మధ్య కాలంలో నిర్వహించిన …

Read More »