Monthly Archives: August 2024

అన్న క్యాంటీన్లో భోజనం చేసిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం మధ్యాహ్నం మచిలీపట్నంలోని మూడు స్తంభాల సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా క్యూలో నిలబడి వారి సతీమణి, తండ్రికి కలిపి మూడు టోకెన్లను కొనుగోలు చేసి వారితో కలిసి భోజనం చేశారు. భోజనం రుచిగా ఉందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్న క్యాంటీన్ ను …

Read More »

మన కృష్ణా జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా..!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 28 వ తేదీన అనగా బుధవారం,10AM కి CWC Godowns pamarru road gudivada(Varun motors) దగ్గర మీనీ జాబ్ మేళా జిల్లా ఉపాధి కార్యాలయం మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మినీ బాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు ఒక ప్రకటన లో తెలియజేశారు. ఈ జాబ్ మేళా ను ఉమ్మడి కృష్ణ జిల్లా అండ్ ఎన్టీఆర్ జిల్లా నిరుద్యోగ యువతీ,యువకులు సద్వినియోగపరుచుకోవాలని …

Read More »

62వ డివిజన్ LBS నగర్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ LBS నగర్ కదరమ్మ కొట్టు సెంటర్ నందు సోమవారం శ్రీకృష్ణ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని స్వయంగా ఉట్టి కొట్టడం జరిగినది… ఈ సందర్భంగా  బోండా ఉమ మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు, కృష్ణ జన్మాష్టమి హిందూ మతంలో అత్యంత …

Read More »

ఈ పంట నమోదుకు చివరి తేదీ సెప్టెంబర్ 15

-గ్రామస్థాయి రెవిన్యూ వ్యవసాయ అధికారులు పెండింగ్ ప్రమాణీకరణ పూర్తి చేయాలి -రైతుల ఖాతాలకు చెందిన ఖాతాల ప్రమాణీకరణ సమాంతరంగా చేపట్టాలి -టెలి కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాగు విస్తీర్ణం ఈ క్రాప్ నమోదు, జాయింట్ ల్యాండ్ ప్రోపర్టీ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని, ఇందుకు డివిజన్, మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ …

Read More »

సహజ సిద్ధ ప్రకృతి రమణీయత గల ప్రాంతం పిచ్చుకలంక

-రాష్ట్రంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా టూరిజం అభివృద్ధి చేస్తాం. -పిచ్చుకులంక పర్యాటక రంగ అభివృద్ధిపై ఒబెరాయ్ ప్రతినిధులతో చర్చించిన.. -మంత్రి.. కందుల దుర్గేష్ ఆత్రేయపురం,(పిచ్చుకలంక), నేటి పత్రిక ప్రజావార్త : సహజ సిద్ద ప్రకృతి రమణీయత గల ప్రాంతంగా విరాజిల్లుతున్న పిచ్చుకలంక లో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఒబెరాయ్ ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పర్యాటక రంగ అంశాలపై సమీక్షించడం అభినందనీయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక గ్రామంలో పర్యాటక …

Read More »

ప్రజలకు అందుబాటులో ఇసుక వివరాలు

-గనులు, ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు రాష్టంలో ఉన్న ఇసుక వివరాలను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని గనులు, ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో 62 స్టాక్‌యార్డుల ద్వారా వియోగదారులకు ఇసుక సరఫరా అవుతుండగా, జూలై 8 నుండి సోమవారం వరకు 21,47,883 మెట్రిక్ టన్నుల ఇసుక కొనుగోలు దారులకు చేరిందన్నారు. సీఎం సూచనల మేరకు బుకింగ్ కేంద్రాలను ప్రాత్యేకంగా నిర్వహిస్తున్నామని …

Read More »

ఇంజనీరింగ్ తుది, మూడవ విడతలో 5707 సీట్లు భర్తీ

-సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు గణేష్ కుమార్ -ఇంకా మిగిలి ఉన్న సీట్లు 23,155 విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈఎపిసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా సోమవారం తుది, మూడవ విడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. విధ్యార్ధులు ఆగస్టు 26 నుండి 30వ తేదీ లోపు తమకు నిర్దేశించిన కళాశాలల్లో ఆన్ లైన్ రిపోర్టింగ్ తో పాటు, వ్యక్తిగతంగా కళాశాలలో నమోదును …

Read More »

న‌గ‌రంలో శ్రీకృష్ణ ఆల‌యాన్ని స‌మిష్టిగా నిర్మిస్తాం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఇస్కాన్ విజ‌య‌వాడ టెంపుల్ లో కృష్ణాష్ట‌మి వేడుక‌లు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌ర‌వాసుల క‌ల శ్రీకృష్ణ ఆల‌య నిర్మాణం. ఆ ఆల‌యాన్ని ఇస్కాన్ విజ‌య‌వాడ వారితో క‌లిసి స‌మిష్టిగా న‌గ‌రంలో నిర్మించేందుకు స‌హ‌కారం అందిస్తాన‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా కృష్ణ‌లంక‌లోని ఇస్కాన్ విజ‌య‌వాడ టెంపుల్ లో జ‌రిగిన కృష్ణాష్ట‌మి వేడుకల‌కి ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. ఆల‌య నిర్వ‌హ‌కులు ఎంపి కేశినేని శివ‌నాథ్ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం జ‌గ‌న్నాధుడికి ఎంపి కేశినేని శివ‌నాథ్ తో ప్ర‌త్యేక …

Read More »

త్వ‌ర‌లోనే నందిగామ‌, కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక : ఎంపి కేశినేని శివ‌నాథ్

-నందిగామ ఎమ్మెల్యే కార్యాల‌యంలో ఎంపి వెల్ల‌డి నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ‌, కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నికకు సంబంధించి ఎన్నిక‌ల అధికారుల‌ను క‌లిసి మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక ప్ర‌క్రియ త్వ‌ర‌గా పూర్తిచేయాల్సిందిగా కోర‌తామ‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. నందిగామ ప‌ట్ట‌ణంలోని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాల‌యానికి ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు నెట్టెం ర‌ఘురామ్, జ‌గ్గ‌య్య పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాత‌య్య తో క‌లిసి ఎంపి కేశినేని శివ‌నాథ్ సోమ‌వారం విచ్చేశారు. ఈ సంద‌ర్బంగా ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, …

Read More »

పత్రికా రంగానికి పూర్వవైభవం రావాలి!

-ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి -సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు -మిజోరం గవర్నర్ కంభంపాటిని కలిసి సత్కారం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఓవైపు సోషల్ మీడియా దూసుకెళ్తుండగా, మరోవైపు సమస్యలతో పత్రికా రంగం కునారిల్లుతోందని, ప్రభుత్వాలే సహకరించి ఆదుకోవాలని సీనియర్ జర్నలిస్ట్, ఎపియుడబ్ల్యుజె ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి (1990-2001) నిమ్మరాజు చలపతిరావు కోరారు. రాజ్యాంగంలో నాలుగో స్తంభమైన పత్రికా రంగ పూర్వవైభవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనిచ్చేలా సహకరించాలని మిజోరం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబుకు విజ్ఞప్తి చేశారు. …

Read More »