-సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి -ఘనంగా నిర్వహించిన ‘నేషనల్ స్పేస్ డే’ కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ్ఞాన ప్రయోగాల విషయంలో అన్ని దేశాల కంటే భారతదేశాన్ని ముందు ఉంచాలని సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ప్రాచీన కాలంలో ఖగోళశాస్త్రంపై ఆర్యభట్ట, భాస్కరాచార్య వంటి ఎందరో మహానీయులు ప్రయోగాలు చేశారని, ఆధునిక కాలంలో డా ఏపీజే అబ్దుల్ కలాం, విక్రం సారాభాయ్, కల్పనా చావ్లా వంటి వారిని ఆదర్శంగా తీసుకొని భావితర శాస్త్రవేత్తలగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను …
Read More »Monthly Archives: August 2024
యూనియన్ బ్యాంకు ‘‘యూ’’ జీనియస్ జాతీయ స్థాయి క్విజ్ పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జోనల్ ఆఫీస్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ మేరిస్ స్టెల్లా కళాశాల ఆడిటోరియలో ‘‘యూ’’ జీనియస్ పేరుతో జాతీయ స్థాయి క్విజ్ పోటీలను నిర్వహించినట్లు యూబీఐ చీఫ్ మేనేజర్ కె.జయశ్యామ్ తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ క్విజ్ పోటీలల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 450 పాఠశాలల్లో ఎనిమిది నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 1200 మంది పాల్గొన్నారన్నారు. స్పెషల్ క్విజ్ మాస్టర్ వివిధ రౌండ్ల ద్వారా విద్యార్థులను ఫిల్టర్ చేసి …
Read More »అక్రమ ఇసుక తవ్వకాలే అన్నమయ్య డ్యాం పాలిట శాపం
-ఇసుక దోపిడి కోసమే డ్యాం గేట్లు ఎత్తలేదు -డ్యాం ప్రమాదానికి ముమ్మాటీకీ మానవ తప్పిదమే కారణం -నాడు అధికారం లేకున్నా అన్నమయ్య డ్యాం బాధిత ప్రజలకు అండగా నిలిచాం -అధికారంలోకి వచ్చాక నష్టాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకున్నా.. -మీ కష్టంలో మేమున్నామని భరోసా ఇచ్చేందుకే వచ్చాను -వరద ప్రభావిత గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ తో పున: పరిశీలన -ఉప ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో వరద నష్టంపై నివేదిక -నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం -అన్నమయ్య డ్యాం వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ …
Read More »సహకార అర్బన్ బ్యాంకుల సేవలు అమోఘం
– సహకార శాఖ విశాఖ జిల్లా అధికారిణి ప్రవీణ – సామాన్య మధ్యతరగతి వర్గాలకూ రుణ సదుపాయం – బ్యాంకు చైర్మన్ వేమూరి వెంకట్రావు – విశాఖలో గాంధీ అర్బన్ బ్యాంక్ శాఖ ప్రారంభం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సహకార రంగంలో అర్బన్ బ్యాంకుల పాత్ర, సేవలు అమోఘమైనవని విశాఖ జిల్లా సహకార శాఖాధికారి టి.ప్రవీణ ప్రస్తుతించారు. ప్రధానంగా వ్యాపారాలు, గృహ నిర్మాణాలకే కాకుండా అత్యవసర సమయాల్లోనూ ప్రజలకు ఈ బ్యాంకులు అండగా నిలుస్తున్నాయని ఆమె అన్నారు. విజయవాడ ప్రధాన కేంద్రంగా …
Read More »జాతీయ అంతరిక్ష దినోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారిస్ స్టెల్లా కాలేజ్ చంద్రయాన్ III విజయాన్ని పురస్కరించుకొని జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు 23, 2024న ఘనంగా నిర్వహించింది. ISRO యొక్క చారిత్రాత్మక చంద్రయాన్ III ల్యాండింగ్ యొక్క మొదటి వార్షికోత్సవం సందర్భంగా, కాలేజ్ ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, విద్యార్థులకు అంతరిక్ష సాంకేతికతపై ఆసక్తిని పెంపొందించేందుకు పలు పోటీలు నిర్వహించారు. విజయ Y, భారతదేశపు 100 మహిళా శాస్త్రవేత్తలలో ఒకరు, ఈ కార్యక్రమంలో “యువతను ప్రేరేపించడం: LEOS యొక్క చంద్రయాన్ III …
Read More »విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠ్యపుస్తకాలు సిద్ధం కావాలి!
-అనకాపల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు -నవంబర్ లో మెగా పేరెంట్–టీచర్ సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి -ఏ స్థాయిలో ప్రశ్నాపత్రాలు లీకైనా కఠిన చర్యలు తీసుకుంటాం -పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం …
Read More »నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక్ కార్యాచరణ
-టంగుటూరి జయంతి వేడుకలలో చేనేత, జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి సునీత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనుందని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత తెలిపారు. బాపట్ల జిల్లా ఐలవరం గ్రామంలోని ఖాధీ గ్రామోద్యోగ సంఘం ఆవరణలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సునీత మాట్లాడుతూ నేత కార్మికులకు చేతినిండా పని …
Read More »షెడ్యూల్డ్ కులాలు సంక్షేమం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమించాను
-3 ఏళ్ల పదవీ కాలంలో పార్టీలు, వర్గాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశా -ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి ఇకపై ప్రజల్లోనే, ప్రజల కోసం పనిచేస్తాను -తనకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు, ప్రజలకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మూరుమూడి విక్టర్ ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూడేళ్ల పదవీ కాలంలో షెడ్యూల్డ్ కులాల ప్రజలకు అండగా నిలవడం సంతృప్తినిచ్చిందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మూరుమూడి విక్టర్ ప్రసాద్ …
Read More »కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన ప్రతిపాదన పంపడం జరుగుతుంది…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రా పేపర్ లిమిటెడ్, రాజమహేంద్రవరంలో పెండింగ్‌లో ఉన్న కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి తగిన ప్రతిపాదన పంపడం జరుగుతుందని రాష్ట్ర పర్యటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి లు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో పేపర్ యూనియన్ యాజమాన్యాల 10 యూనియన్ల ప్రతినిధులు ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ పి …
Read More »బదిలీలలో ఉద్యోగుల అభ్యర్థను పరిగణంలోకి తీసుకోవాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని సవరించిన నేపథ్యంలో బదిలీలలో ఉద్యోగుల అభ్యర్థనను పరిగణంలోకి తీసుకోవాలని అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల అభ్యర్థనకు ప్రాధాన్యత నివ్వాలని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు సంయుక్త రవాణా కమిషనర్ ఎన్ శివరామ ప్రసాద్ ను కోరారు. నగరంలోని రవాణాశాఖ కార్యాలయంలో రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు కార్యదర్శి కెవివి నాగమురళి శుక్రవారంనాడు సంయుక్త రవాణా కమిషనర్ ఎన్ శివరామ ప్రసాద్ …
Read More »