నేటి పత్రిక ప్రజావార్త :
Read More »Daily Archives: November 2, 2025
సీఎం చంద్రబాబు దంపతులకు లండన్ లో ఘన స్వాగతం
-వ్యక్తిగత పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు -ఐఓడి సంస్థ నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోనున్న నారా భువనేశ్వరి -సోమవారం వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… సతీమణి భువనేశ్వరితో కలిసి ఆదివారం లండన్ చేరుకున్నారు. విమానాశ్రయంలో లండన్ తెలుగు కుటుంబాలు సీఎం చంద్రబాబు దంపతులకు ఘన స్వాగతం పలికాయి. తమకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని చంద్రబాబు దంపతులు ఆత్మీయంగా పలకరించారు. …
Read More »పంట నష్ట నమోదు జాబితాలను గ్రామ స్థాయిలో ప్రదర్శన లో ఉంచి సామాజిక తనిఖీ చేపట్టండి
-వ్యవసాయ అధికారులను ఆదేశించిన సంచాలకులు డా.మనజీర్ జిలానీ సమూన్ ఐఏఎస్. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : * సామాజికతనిఖీలో బాగంగా ఫిర్యాదుల ,విజ్ఞప్తులను స్వీకరించాలి. * వాటిని నిర్దేశిత సమయంలో మార్గదర్శకాలకు అనుగుణముగా పరిష్కరించాలి . * పంట నష్టపోయిన ప్రతి రైతు వివరాలు జాబితాలో నమోదు అయ్యేటట్లు చూడాలి . * సామాజిక తనిఖీ ,తదనంతరం జాబితాల పునఃపరిశీలన వెనువెంటనే చేపట్టాలి . * పంట నష్ట నమోదు ప్రక్రియ,సామాజిక తనిఖీ,విజ్ఞప్తుల స్వీకరణ, విజ్ఞప్తుల పరిష్కారం ,జాబితా వాస్తవికత పై ఉన్నతాధికారుల …
Read More »బాధిత కుటుంబాల వెన్నంటే ప్రభుత్వం… మీ కోసం మేమున్నాం
– బాధిత కుటుంబాలకు ధైర్యం నింపిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు – మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేంద్ర–రాష్ట్ర మంత్రులు – టెక్కలి నియోజకవర్గంలో మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల చొప్పున చెక్కుల అందజేత – పలాస ఆసుపత్రిలో క్షతగాత్రులకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం పంపిణీ – సమగ్ర విచారణకు ప్రభుత్వం సిద్ధం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు- మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి/శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : “మేమున్నాం… మీకేం …
Read More »జిల్లా పార్టీకార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి కింజరపు ఎర్రంనాయుడు 13 వ వర్ధంతి కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పార్టీకార్యాలయంలో ఈరోజు మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్రమంత్రి, కీర్తిశేషులు కింజరపు ఎర్రంనాయుడు 13 వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎర్రం నాయుడు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నేప్రసాద్ (అన్న),రాష్ట్ర బీసీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ లు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. గన్నేప్రసాద్ (అన్న),శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ అన్న నందమూరి తారకరామారావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తర్వాత …
Read More »4న పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ రాక
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర శాసనసభా పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఈ నెల నాలుగవ తేదీన గుంటూరు జిల్లాలో పర్యటించనుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగవ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కమిటీ చేరుకుంటుందని చెప్పారు. 11 గంటల నుండి రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ,రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, రాష్ట్ర వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ …
Read More »లండన్ చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ కు ఘన స్వాగతం
అమరావతి/లండన్, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు యునైటెడ్ కింగ్డమ్ లో జరుగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM) – 2025 లో పాల్గొనేందుకు లండన్ కు చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ కు స్థానిక హీత్రో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. లండన్ లోని ఎన్ఆర్ఐ జన సైనికులు జనసేన జెండాలతో స్వాగతం పలికారు. అనంతరం వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రదర్శన -2025 కు సంబంధించిన ప్రోగ్రాం షెడ్యూల్ ను టూరిజం కన్సల్టెంట్లు …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …
Read More »జాతీయ లోక్ అదాలత్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే డిసెంబర్ నెల 13 వ తేదీన రెండవ శనివారం జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు పూర్వపు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని న్యాయస్థానాల పరిధిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా సివిల్, కాంపౌండబుల్, క్రిమినల్ కేసులతో పాటు అన్ని రకాల కేసులు పరిష్కరిస్తామన్నారు. కావున ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని …
Read More »ఈ నెల 3వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 3వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …
Read More »
Prajavartha Online Telugu News