విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ప్రతిష్టాత్మకమైన సంస్థగా పేరుగాంచిన ‘అలెన్’ విద్యా సంస్థ బ్రాంచ్‌ను రాష్ట్రంలో విజయవాడ, విశాఖలో నెలకొల్పడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలోని వివాంత హోటల్లో జరిగిన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై సంస్థ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి ప్రభుత్వం బలంగా నమ్ముతోందన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావడంలో రాష్ట్రం ముందంజలో ఉందని పేర్కొన్నారు. వివిధ జాతీయ అంతర్జాతీయ సంస్థలు తమ బ్రాంచ్లను …
Read More »Daily Archives: November 7, 2025
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి రూ.7,500 కోట్ల ఆర్థిక సహకారం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా జరిగేలా “నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్(NaBFID) సంస్థ” రూ.7,500 కోట్ల రుణాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(ఏపీ సిఆర్డిఏ)కు మంజూరు చేసింది. ఈ రుణం ద్వారా రాజధాని నగరంలోని ముఖ్యమైన నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. రుణం మంజూరుకు సంబంధించిన పత్రాలను శుక్రవారం అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్(NaBFID) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సామ్యూల్ జోసెఫ్, …
Read More »“గ్రీవెన్స్ డే”లో అర్జీలు స్వీకరించిన GRM నోడల్ అధికారి పి.జయశ్రీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం తుళ్లూరులోని సిఆర్డిఏ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. పలువురు రాజధాని ప్రాంతవాసులు, రైతుకూలీలు తమ అర్జీలను గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మేనేజ్‌మెంట్(GRM) నోడల్ అధికారి పి.జయశ్రీ గారికి అందజేశారు. అర్జీదారులు అందజేసిన అర్జీలను పరిష్కరిస్తామని నోడల్ అధికారి గారు హామీ ఇచ్చారు. సిఆర్డీఏలోని వివిధ విభాగాల అధికారులు గ్రీవెన్స్ డేకు హాజరై అర్జీదారులు తెలియజేసిన ఫిర్యాదులలో పలు ఫిర్యాదులను పరిష్కరించారు. మిగిలినవి వెంటనే పరిష్కరించాలని, సమస్యలు పరిష్కరించటంలో …
Read More »జాతీయ సమైక్యతకు స్ఫూర్తి సర్ధార్ వల్లభాయ్ పటేల్
-ప్రజలంతా జాతీయ ఐక్యతా భావంతో మెలగాలి -31 అక్టోబర్ నుంచి నవంబర్ 25 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమం, మై భారత్ పశ్చిమ గోదావరి జిల్లా మై భారత్, యువజన అధికారి సుంకర రాము జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్ధార్ @ 150 లో భాగంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద ప్రచార యాత్ర డిజిటల్ దశను ప్రారంభించటం గర్వంగా ఉందని కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమం, భారత్, జిల్లా యువజన అధికారి …
Read More »ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం..
-ప్రతి వారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తాం.. -నగరంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బృందావన థియేటర్ పక్కన గల నియోజకవర్గ టీడీపి కార్యాలయంలో మంత్రి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల …
Read More »శభాష్ కైవల్య
-వ్యోమగామి శిక్షణకు నిడదవోలు యువతి కైవల్య రెడ్డి ఎంపికపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం -కైవల్య రెడ్డికి మంత్రి దుర్గేష్ అభినందనలు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికాలో ప్రతిష్టాత్మక వ్యోమగామి శిక్షణకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచల కైవల్య రెడ్డి ఎంపికపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్షంలోకి అడుగుపెట్టే తన కలను సాకారం చేసుకునే దిశగా కీలక మైలురాయిని దాటిందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాల అధిరోహించాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. ఏపీకి చెందిన నిడదవోలు …
Read More »తిరుపతిలో నూతన నవోదయ విద్యాలయ ఏర్పాటు
-కేంద్రం పరిశీలనలో ఎంపీ గురుమూర్తి ప్రతిపాదన తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంట్ పరిధిలో జవహర్ నవోదయ విద్యాలయ స్థాపనకు తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మద్దిల గురుమూర్తి లేఖకు కేంద్ర విద్యా శాఖ నుండి సానుకూల స్పందన లభించింది. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి పంపిన లేఖలో ఎంపీ ప్రతిపాదనను గుర్తిస్తూ, నవోదయ విద్యాలయ సమితితో చర్చించి విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం, ఒక జిల్లాలో ఇప్పటికే నవోదయ విద్యాలయ ఉన్నచోట కొత్తగా …
Read More »అన్నక్యాంటీన్లలో శుభ్రత, సేవా ప్రమాణాలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే లక్ష్యంతో నడుస్తున్న అన్నక్యాంటీన్లలో శుభ్రత, సేవా ప్రమాణాలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ చుట్టగుంట సమీపంలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించి, భోజనం తీసుకుంటున్న వారితో మాట్లాడి ఆహారం నాణ్యత, రుచిపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పరిసరాల శుభ్రతను పరిశీలించి, శుభ్రతను కాపాడాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించడంలో ఎటువంటి …
Read More »మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలు మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ప్రధానంగా డ్రైనేజి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధ్యాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ జిటి రోడ్ లో పారిశుధ్యం, నల్లపాడు రోడ్ లోని శ్రీనివాస కాలనీలో డ్రైనేజి సమస్య ఉన్న ప్రాంతాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత నల్లపాడురోడ్ లోని శ్రీనివాస …
Read More »అవయవ దానం ద్వారా పునర్జన్మ పొందినట్లే…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అవయవ దానం ద్వారా పునర్జన్మ పొందినట్లేనని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రజా ఆలోచన వేదిక ఆధ్వర్యంలో నేత్ర, అవయవ, దేహదానాలపై వివరణాత్మకంగా ప్రచురించిన కరపత్రాలను శుక్రవారం కమిషనర్ తమ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల కళ్లు, అవయవ దానాలు చేయటం ద్వారా అనేక మంది అవసరార్థులకు పునర్జన్మ ప్రసాదించవచ్చునన్నారు. మరణానంతర దేహదానం వైద్య వృత్తిలో విద్యార్థుల పరిశోధనలకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. నిరంతరం సామాజిక …
Read More »
Prajavartha Online Telugu News