Breaking News

Monthly Archives: November 2025

డిసెంబర్ 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 1వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో …

Read More »

ప్రశాంతంగా ముగిసిన యూపీఎస్సీ ఈపీఎఫ్వో పరీక్ష

-37.25 శాతం హాజరు నమోదు -పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్/అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన ఈపీఎఫ్వో పరీక్ష – 2025 ప్రశాంతంగా ముగిసింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నగరంలో 15 కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్ష నిర్వహించగా 5,860 మంది …

Read More »

ఏపీ ప్రభుత్వంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనను విశాఖ, అమరావతి, రాయలసీమ పేరిట మూడు జోన్‌లుగా విభజించాలని నిర్ణయించింది. విశాఖ జోన్‌లో 9, అమరావతి జోన్‌లో 8, రాయలసీమ జోన్‌లో 9 జిల్లాలు ఉండగా, ఈ ప్రణాళికలను నీతి ఆయోగ్, సింగపూర్ సంస్థల సూచనల ఆధారంగా రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో స్టీరింగ్ కమిటీ వ్యవహారాలను పర్యవేక్షించనుంది. ప్రతి జోన్‌కు సీనియర్ ఐఏఎస్ అధికారిని సీఈవోగా నియమించగా, విశాఖ జోన్‌కు యువరాజ్, అమరావతి జోన్‌కు ముఖేష్ కుమార్ మీనా, రాయలసీమ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్విత్వ తుఫాను కారణంగా రద్దు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే డిసెంబర్ 1వ తేదీ సోమవారం కలెక్టరేట్లో జరగవలసిన మీ కోసం — ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్విత్వ తుఫాను కారణంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ద్విత్వా తుఫాను ముందస్తు జాగ్రత్త పనులలో జిల్లా అధికారులందరూ నిమగ్నమై ఉన్నందున మీకోసం కార్యక్రమం నిర్వహించడం లేదని కలెక్టర్ వివరించారు జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా నగరంలోని కలెక్టరేట్లో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కావున జిల్లా ప్రజలందరూ …

Read More »

పెంచలయ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి… : డివైఎఫ్ఐ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా రాజ్యమేలుతున్నాయాని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న విమర్శించారు. రెండు రోజుల క్రితం నెల్లూరులో డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా యువతను ఏకం చేసి పోరాడిన యువజన నాయకుడు, ప్రజా కళాకారుడు పెంచలయ్యను పట్టపగలు నడి రోడ్డు మీద గంజాయి గ్యాంగ్ అతి కిరాతకంగా నరికి చంపారని, తిరగ రోజు అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసుల పైనే దాడి చేయడం చూస్తుంటే రాష్ట్రంలో …

Read More »

“మీకోసం” వెబ్ సైట్ లో  పి.జి.ఆర్.ఎస్ అర్జీలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మీకోసం వెబ్ సైట్ లో  పి.జి.ఆర్.ఎస్ అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో నేరుగా అందించవచ్చని, అదేవిధంగా అర్జీలను మీకోసం వెబ్ సైట్ లోను సమర్పించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించిన అర్జీల వివరాలను 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి …

Read More »

ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారా…?

-జగన్ పై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ -ఆ 5 ఏళ్లూ బీసీలపై అక్రమ కేసులు, వేధింపులు -కేసుల్లో ఇరుకున్నప్పుడు బీసీ కార్డు ప్రయోగం -రప్పా…రప్పా…అంటూ ప్రజలను రెచ్చగొడుతున్న వైసీపీ శ్రేణులు -రాబోయే ఎన్నికల్లో ఇప్పుడున్న 11 సీట్లు కష్టమే… -టీడీపీతోనే కురబలకు మేలు : మంత్రి సవిత -ఘనంగా గుంటూరు జిల్లా కురుబ సామాజిక నూతన కమిటీ ప్రమాణస్వీకారం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అధికారంలో ఉన్న అయిదేళ్లు ఆయనకు బలహీన వర్గాలు గుర్తుకు రాలేదని, అవినీతి, …

Read More »

సర్జికల్ బ్లేడును లోపలే ఉంచి శస్త్రచికిత్స చేసిన వైద్యుడి సస్పెండ్

-స్టాఫ్ నర్సు కూడా.. -మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం -అధికారుల చర్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ జిల్లా తునిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓ యువకుడికి శస్త్రచికిత్స సమయంలో సర్జికల్ బ్లేడును లోపలే పెట్టి కుట్టేసిన ఘటనలో ఆర్థోపెడిక్ వైద్యుడు సత్యసాగర్, స్టాఫ్ నర్సు పద్మావతిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు సస్పెండ్ ఉత్తర్వులు జారీచేశారు. ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి, …

Read More »

‘హెచ్ఐవీ’ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

-2015-16లో పరీక్షించిన వారిలో 2.34% పాజిటివిటీ -2024-25లో 0.58%కు తగ్గుదల -88.72 శాతంమేర మరణాల తగ్గుదల -గర్భిణుల్లో 0.04%కు తగ్గిన సంక్రమణ -ఒక్కొక్కరి చికిత్సకు ఏడాదికి రూ.35వేల నుంచి రూ.40వేల వరకు వ్యయం -42వేల మందికి పింఛన్లు! -సంపూర్ణ సురక్ష కేంద్రాల ద్వారా నిరంతరం అప్రమత్తం! -వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి -రేపు ప్రపంచ ఎయిడ్స్ దినం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్ఐవీ కేసుల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ …

Read More »

దిత్వా నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

–మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “దిత్వా” తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులతో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంత అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ విద్యుత్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు …

Read More »