-ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి, కోర్లగుంట డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ నగరపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశంలో ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ చైర్మన్ డా పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఎస్ ఐ సి హెచ్ సరస్వతి మాట్లాడుతూ తల్లి, తండ్రి, గురువు, దైవం అంటూ తల్లికి మన పెద్దలు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బిడ్డల సక్రమ పెంపక బాధ్యత తల్లులదన్న విషయం గుర్తించాలి. ఆడపిల్లలు వారికి ఏవైనా ఇబ్బంది …
Read More »Daily Archives: December 5, 2025
ప్రజలు స్పష్టంగా తిరస్కరించిన తీర్పును వైఎస్ జగన్ ఇప్పటికీ అంగీకరించలేని పరిస్థితి…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న ఇచ్చిన మీడియా సమావేశాన్ని పరిశీలిస్తే, ప్రజలు స్పష్టంగా తిరస్కరించిన తీర్పును ఆయన ఇప్పటికీ అంగీకరించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంని జనసేన జిల్లా అధ్యక్షులు, PAC సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. ఈరోజు జరిగిన విలేఖరుల సమావేశంలో హరిప్రసాద్ మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న ఇచ్చిన మీడియా సమావేశాన్ని పరిశీలిస్తే, ప్రజలు స్పష్టంగా …
Read More »మేరీ స్టెల్లా కళాశాలలో మెగా జాబ్ మేళా
-ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మేరీ స్టెల్లా కళాశాలలో ఈ నెల 19వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ తెలిపారు. ఈ జాబ్ మేళాను డాన్ బాస్కో నెట్వర్క్ సంస్థ సౌజన్యంతో నిర్వహిస్తున్నామని బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐ టి రంగం సేల్స్ , మెడికల్ ఫార్మా, మాన్యుఫాక్చరింగ్ రంగాలకు చెందిన కంపెనీలు వస్తున్నారని విజయవాడలోని గ్రాడ్యుయేట్స్ అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పోస్టర్ ను …
Read More »జాబితా 22 ఏ లో ఉండే ఇళ్ల స్థలాలను ఎవరైనా సరే మార్చుకోవాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నిషేధిత భూముల జాబితా 22 ఏ లో ఉండే ఇళ్ల స్థలాలను ఎవరైనా సరే మార్చుకోవాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం మండల కేంద్రమైన అవనిగడ్డ తహసిల్దార్ కార్యాలయం సమావేశం మందిరంలో జీవో నంబర్ 30 ప్రకారం ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్ దస్తావేజుల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి పాల్గొని 40 మంది లబ్ధిదారులకు పట్టాలను …
Read More »స్ఫూర్తిదాయక విజయగాధలు రూపొందించాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ ప్రభుత్వ రాయితీలు వినియోగించుకుని విజయవంతమైన వారి స్ఫూర్తిదాయక విజయగాధలు తయారు చేసి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై జిల్లాలోని స్ఫూర్తిదాయక విజయగాధల తయారీపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలను పొంది విజయవంతమైన …
Read More »ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవేత్తగా ఎదగాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవేత్తగా ఎదగాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలా చేయూత అందిస్తుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ అవనిగడ్డ, నాగాయలంక, చల్లపల్లి మండలాల్లో విస్తృతంగా సుడిగాలి పర్యటన చేసి స్వయం సహాయక సంఘాల మహిళలు డిఆర్డిఏ –వెలుగు ద్వారా ఆర్థిక సహాయం పొంది ఏర్పాటు చేసుకున్న వివిధ రకాల డ్వాక్రా యూనిట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. …
Read More »సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అవనిగడ్డ లోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లాలో డిఆర్డిఏ వెలుగు ద్వారా ఆర్థిక సహాయం పొందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకున్న డ్వాక్రా యూనిట్ల పరిశీలనకు వచ్చిన కలెక్టర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి విచారించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోగులతో ముఖాముఖి మాట్లాడారు వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు …
Read More »విజయవంతంగా ముగిసిన ఉద్భవ్-2025 వేడుకలు
-కేఎల్ యూనివర్శిటీలో మూడు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించిన ఉద్భవ్-2025 -దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాలనుండి వేడుకల్లో పాల్గొన్న 1500 మంది విద్యార్థులు -వేడుకలలో భాగంగా సంప్రదాయ నాటిక, నృత్య, సంగీత పోటీలు -49 విభాగాలకు సంబంధించి పోటీల ఫలితాలు వెల్లడి మరియు విజేతలకు బహుమతుల ప్రధానం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన విద్యార్థుల కళా నైపుణ్యాలను, ప్రతిభను వెలికితీసి దేశవ్యాప్తంగా చాటి చెప్పాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరవ జాతీయ ఏకలవ్య మోడల్ …
Read More »సామాజిక స్పృహతోనే వెట్టిచాకిరి నిర్మూలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక స్పృహతోనే వెట్టిచాకిరి వంటి వ్యవస్థలను నిర్మూలన చేయవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. వెట్టిచాకిరి నిరోధక చట్టం 1976 (బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్) – నిఘా మరియు అమలు కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ సభ్యులు అంకితభావంతో పనిచేసి వెట్టిచాకిరి వంటి వ్యవస్థ లేకుండా చూడాలని అన్నారు. సామాజిక స్పృహ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, ప్రతీ ఒక్కరూ ఇందులో …
Read More »యూనిట్లు త్వరగా ప్రారంభం కావాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ పథకాలు క్రింద మంజూరైన యూనిట్లు త్వరగా ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతుల ప్రోత్సాహక మండలి (డి.ఐ.ఇ.పి.సి) సమావేశం శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చేసుకున్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎపిఐఐసి భూములకు సంబంధించిన దస్త్రాలు త్వరగా పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏర్పాటు చేస్తున్న యూనిట్లకు రుణాలు అందించడంలో …
Read More »
Prajavartha Online Telugu News