Breaking News

Daily Archives: December 7, 2025

మనం మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి

-తమిళనాడులో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చింది -భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రతీ హిందువులో చైతన్యం రావాలి -సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు… ఆధ్యాత్మిక శాస్త్రం -భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదు -భగవద్గీత… మనో ధైర్యమిచ్చే గురువు, నిర్దేశించే దిక్సూచి -పుట్టిగె మఠం చేస్తోంది అనేది కేవలం ఆధ్యాత్మిక ప్రక్రియ కాదు – సంస్కృతిక, నాగరికతా బాధ్యత -ఉడుపి క్షేత్రంలో నిర్వహించిన ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  …

Read More »

సంగీతం సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి -కేంద్ర పర్యాటక శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వెంకట రామన్ హెగ్డే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక రంగం పురోభివృద్ధికి ఊతమివ్వడం యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగవకాశాలు పొందే వీలు ఏర్పడుతుందని కేంద్ర పర్యాటక శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వెంకట్రామన్ హెగ్డే తెలిపారు. స్థానికి తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఆదివారం రెండో రోజు నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ గౌరవ సయ్యద్ అబ్దుల్ …

Read More »

ఎర్రదొడ్డి గంగమ్మ దేవాలయం ఈవో చోరికి పాల్పడిన ఘటనపై సీఎం సీరియస్

-సీఎం ఆదేశాలతో ఆలయ ఈవో మురళీ కృష్ణ సస్పెన్షన్ -ఈవో మురళీకృష్ణ మీద కేసు నమోదు… అరెస్ట్ -దేవాలయాల్లో తప్పుడు విధానాలకు పాల్పడితే కఠిన చర్యలని స్పష్టం చేసిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పరిధిలో గంగమ్మ గుడి లో ఆలయ ఈవోనే చోరీ చేసిన ఘటన పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈవో మురళీకృష్ణ ను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఆదేశాలు ఇచ్చింది. గుడిలో 5 …

Read More »

విద్యార్థిని వేధింపుల కేసులో తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి డిమాండ్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో తొలి సంవత్సరం బీఈడ్ చదువుతున్న ఎస్సీ విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్ ఘటనపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్ లకు ఎంపీ గురుమూర్తి లేఖలు రాశారు. సదరు విద్యార్థిని వ్యక్తిగత ఫొటోలు, …

Read More »

రౌడీషీటర్ లకు, సస్పెక్ట్ లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అధికారులు

-రూరల్ జోన్ పరిధిలోని రౌడీషీటర్ లకు, సస్పెక్ట్ లకు స్వయంగా కౌన్సిలింగ్ నిర్వహించిన డి.సి.పి.బి.లక్ష్మీ నారాయణ ఐ.పి.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు ఆదివారం డి.సి.పి.లు కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్., బి.లక్ష్మీ నారాయణ ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో ఏ.సి.పి., పోలీసు కమిషనరేట్ పరిదిలోని అన్నీ పోలీసు స్టేషన్ల మరియు టాస్క్ ఫోర్స్ కార్యాలయం లలో అయా పోలీసు అధికారులు వారి వారి సిబ్బందితో కలిసి ఆయా పోలీసు …

Read More »

సేఫ్ రైడింగ్ పై అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

-“మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. ట్రాఫిక్ నియమాలు మన కోసం – మన ప్రాణాల కోసం.” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.ఆదేశాల మేరకు ట్రాఫిక్ డి.సి.పి.శ్రీమతి షీరిన్ బేగం ఐ.పి.ఎస్.గారి ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని ట్రాఫిక్ వారు నగరంలోని వాహనదారులకు సేఫ్ రైడింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపధ్యంలో నగరంలో బెంజ్ సర్కిల్ పరిసర ప్రాంతాలలో వాహనదారుల్లో భద్రతా చైతన్యం పెంపొందించేందుకు అధికారులు రోడ్లపై ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా …

Read More »

కాలుష్య నియంత్రణ ఒక చెట్ల పెంపకంతోనే సాధ్యం

-ఫల, పుష్ప ప్రదర్శన ను సందర్శించిన ఎంపి స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ, అర్బన్ గ్రీనరీ, ఉద్యానవన శాఖ సహకారంతో పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శన-2025 ను విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ ఆదివారం సందర్శించారు . కేశినేని జానకి ల‌క్ష్మి కు సంస్థ నిర్వాహకులు స్వాగతం …

Read More »

తెలుగు భాషా పరిరక్షణకు అందరూ కృషి చేయాలి…

-అత్తలూరి విజయ లక్ష్మి స్వర్ణోత్సవ సభలో తెలుగు మరియు సంస్కృత ఆకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ @శరత్ చంద్ర గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషా పరిరక్షణ కోసం అందరూ కృషి చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ మరియు ఉషా గ్రూప్ ఆఫ్ మ్యాగజైన్స్ అధినేత, ఎడిటర్ ఆర్. డి. విల్సన్ ఉద్గోషించారు. శనివారం హైదరాబాద్ చిక్కడపల్లి లోని త్యాగరాయ గాన సభ లో ప్రముఖ రచయిత్రి, రేడియో నాటికల ప్రయోక్త అత్తలూరి విజయ లక్ష్మి స్వర్ణోత్సవ …

Read More »

రతన్ టాటా ఇన్నో్వేషన్ హబ్ లో ఒక రోజు వర్క్‌షాప్‌

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (NRDC) & ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ(APMSMEDC ) సంయుక్తంగా డిసెంబర్ 9, 2025న మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నో్వేషన్ హబ్ (RTIH)లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSMEల) కోసం టెక్నాలజీ, ఇన్నోవేషన్ & మేదోసంపత్తి హక్కులు (IPR)పై వర్క్‌షాప్ నిర్వహించనుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో …

Read More »

మాదకద్రవ్యాలు (డ్రగ్స్) వంటి తప్పు అమూల్యమైన జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది – ఈగల్ ఐజీ ఆకే రవి కృష్ణ.

-మంచు తెరలను చీల్చుకుంటూ మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడమే “సంకల్పం (Sankalpam)గా ” సాగిన “డ్రగ్స్ వద్దు బ్రో – సైకిల్ తొక్కు బ్రో” అవగాహన కార్యక్రమం -గుంటూరు జిల్లా పోలీస్ మరియు ఈగల్ విభాగం వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ “డ్రగ్స్ వద్దు బ్రో – సైకిల్ తొక్కు బ్రో” కార్యక్రమంలో పాల్గొన్న ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు గుంటూరు, …

Read More »